ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kotam Reddy: ఆయన వాగ్మూలంలో కొన్ని లక్షల మందికి మేలు జరిగింది..

ABN, Publish Date - Nov 19 , 2024 | 12:08 PM

సభా నాయకుడిపైనే ఇలాంటి కుట్ర జరిగితే మరి మామూలు జనం పరిస్థితి ఏంటనేది ఆలోచించాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలన్నారు. ఇది ముఖ్యమైన అంశమని, దీనిపై తప్పనిసరిగా చర్చించాలని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు కూడా అన్నారు.

అమరావతి: తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు (CM Chandrababu)పై మహ కుట్ర (Conspiracy) జరిగిందని.. ఇది తాను చెప్పడం లేదని... ఏబీఎన్ డిబేట్‌లో జరిగిందే తాను చెబుతున్నానని, వెంకట కృష్ణ డిస్కషన్‌లో పీవీ రమేష్ (PV Ramesh) ఏం చెప్పారో ఈ రోజు ఆంధ్రజ్యోతి (Andhrajyolthy) పేపర్‌లో కూడా వచ్చిందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (MLA Kotam Reddy Shridhar Reddy) పేర్కొన్నారు. మంగళవారం అసెంబ్లీలో జీరోఅవర్‌లో చంద్రబాబుపై జరిగిన కుట్రను ఆయన లేవనెత్తారు. ‘నేను ఏనాడు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో పొరపాటు జరిగిందని చెప్పలేదు’ అని పీవీ రమేష్ చెప్పారన్నారు. చంద్రబాబు నాయుడును జైల్లో పెట్టేందుకు అప్పటి సీఎం జగన్ కుట్ర చేశారని, ఏక కాలంలో మూడు చోట్ల స్కిల్ డెవలప్‌మెంట్, సిఐడి, సిఎంవోలో ఫైళ్లు ఒకేసారి మాయం చేశారన్నారు.


చంద్రబాబు మీద జరిగిన కుట్ర ఓ వ్యక్తి పైన కాదని... ఒక హై ప్రోఫైల్ వ్యక్తిపై కుట్ర జరిగితే ప్రజలపై ఎలాంటి కుట్రలు జరుగుతాయనేది పీవీ రమేష్ స్పష్టంగా చెప్పారని ఎమ్మెల్యే కోటం రెడ్డి అన్నారు. వైఎస్సార్‌సీపీలో అధికారులు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పీవీ రమేష్ వాగ్మూలంలో కొన్ని లక్షల మందికి మేలు జరిగిందని. దాన్ని ప్యాబ్రికేట్ చేశారని రాత్రి కూడా చెప్పారన్నారు. ఒక సీనియర్ విశ్రాంత అధికారి స్టేట్‌మెంట్‌ను ప్యాబ్రికేట్ చేశారంటే ప్రభుత్వం స్పందించాలన్నారు. సభా నాయకుడు ముఖ్యమంత్రి గౌరవ మర్యాదలకు సంబంధించి స్వయంగా మాజీ ఐఏఎస్ డిజిపికి లేఖ రాసారన్నారు. దానిపై డిజిపి స్పందించారా.. లేదా.. ఎందుకు స్పందించలేదో చెప్పాలన్నారు. ఈరోజు జీరో అవర్‌ను రద్దు చేసి అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలని.. ఇది చాలా ముఖ్యమయిన అంశమని కోటంరెడ్డి అన్నారు. సభా నాయకుడిపైనే ఇలాంటి కుట్ర జరిగితే మరి మామూలు జనం పరిస్థితి ఏంటనేది ఆలోచించాలన్నారు. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలన్నారు. ఇది ముఖ్యమైన అంశమని, దీనిపై తప్పనిసరిగా చర్చించాలని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు కూడా అన్నారు. ఈ అంశాన్ని హోమ్ మంత్రి నోట్ చేసుకుని వెంటనే స్పందించాలని డిప్యూటీ స్పీకర్ సూచించారు.


ముమ్మాటికీ కుట్రే..

చంద్రబాబు లాంటి హైప్రొఫైల్‌ ఉన్న వ్యక్తినే ఇంత అన్యాయంగా కుట్రలు చేసి అరెస్టు చేస్తే, సామాన్యుల పరిస్థితి ఏంటి? ఇది ఒక్క వ్యక్తికి జరిగిన అన్యాయం కాదు, మొత్తం వ్యవస్థకే జరిగిన అన్యాయం. బాధ్యులంతా పెద్ద మనుషులు. ఈ కుట్రలను ప్రజల ముందు పెడితే పోలీసు వ్యవస్థపై నమ్మకం పెరుగుతుంది. - పీవీ రమేశ్‌

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబును అరెస్ట్‌ చేయడం వెనుక పెద్దకుట్ర జరిగిందని సీనియర్‌ ఐఏఎస్‌, నాటి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పీవీ రమేశ్‌ స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో చంద్రబాబును అరెస్ట్‌ చేయాలని సీఎం జగన్‌ అంటుండేవారని, అది తాను విన్నానని, ఈ విషయంలో సీఎం సలహాదారులతో పాటు కొందరు అధికారులు ఉత్సాహంగా పనిచేశారని చెప్పారు. చంద్రబాబును అరెస్ట్‌ చేయడం కోసం ఫైళ్లను మాయం చేశారని తెలిపారు. ఏకకాలంలో 3 విభాగాల్లో ఫైళ్లు కనిపించకుండా పోయాయని, అత్యున్నత స్థాయిలో నాటి సీఎంవో, సీఐడీ, స్కిల్‌ డెవల్‌పమెంట్‌ డిపార్ట్‌మెంట్‌ వాళ్లు కలిస్తే తప్ప ఇది సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు.

సీఐడీ అధికారులకు తాను పంపిన స్టేట్‌మెంట్‌ను మార్చేశారని పీవీ రమేశ్‌ స్పష్టం చేశారు. సోమవారం రాత్రి ఏబీఎన్‌ డిబేట్‌లో పీవీ రమేశ్‌ పాల్గొన్నారు. చంద్రబాబు అరె్‌స్టకు ముందు, ఆ తర్వాత జరిగిన పరిణామాల గురించి ఆయన సంచలన విషయాలు వెల్లడించారు. నాడు చంద్రబాబును ఎలాగైనా అరెస్టు చేసి జైల్లో వేయాలన్న కక్షసాధింపు ధోరణితో భారీ కుట్రలకు పాల్పడ్డారని చెప్పారు.

మొదటి కుట్ర

‘‘మూడు విభాగాలకు చెందిన ఫైళ్లను ముందుగానే మాయం చేశారు. చట్టబద్ధంగా, నిబంధనల ప్రకారం టీడీపీ ప్రభుత్వం చేసిన పనికి సాక్ష్యాలు చెరిపేశారు. స్కిల్‌ డెవల్‌పమెంట్‌కు సంబంధించిన ఫైళ్లు స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌లో, సచివాలయంలో సంబంధిత శాఖా విభాగంలో, కేబినెట్‌ ఆమోదం కోసం వెళ్లిన ఫైళ్లు సాధారణ పరిపాలనా (జీఏడీ)శాఖలో కచ్చితంగా ఉంటాయి. ఒకేసారి ఈ ఫైళ్లన్నీ కనిపించకుండా పోవడం వెనుక జరిగిన కుట్ర ఏంటో ముందుగా ఛేదించాల్సిన అవసరం ఉంది. కార్పొరేషన్‌లోని ఫైళ్లు ఆ సంస్థ ఎండీకి, సచివాలయంలో సంబంధిత శాఖా ఫైళ్లు ఆ శాఖ సెక్రటరీకి, జీఏడీలోని ఫైళ్లు చీఫ్‌ సెక్రటరీకి, జీఏడీ పొలిటికల్‌ సెక్రటరీకి అందుబాటులో ఉంటాయి. అవి మాయమయ్యాయంటే వారిదే బాధ్యత. అందరూ కలిస్తేనే ఫైళ్లు మాయం అవుతాయి. ఆ ఫైళ్లు అందుబాటులో ఉంటే చంద్రబాబుపై కేసు నమోదు చేయడం కుదరదు. అందువల్లే ముందుగా ఆ ఫైళ్లు మాయం చేసి అరెస్టుకు మొదటి కుట్ర పన్నారు. స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కోసం నిధులను అజేయ కల్లం విడుదల చేశారు’’ అని పీవీ రమేశ్‌ చెప్పారు.

స్కిల్‌లో అంతా సవ్యం

‘‘2013-14లో స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేశారు. ఆ కార్పొరేషన్‌కు ఒక ఎండీని నియమించి, బడ్జెట్‌ కేటాయించారు. ఆ సమయంలో సీమెన్స్‌ ఇండియా వాళ్లు వచ్చి ఏపీలో నైపుణ్య శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా రూ.3,000 కోట్లు పెట్టుబడులు పెడతామని చెప్పారు. సీఎ్‌సఆర్‌ నుంచి ఖర్చు చేస్తామన్నారు. నిర్వహణ ఖర్చుల కోసం మరో 10 శాతం మొత్తాన్ని బడ్జెట్‌ నుంచి ఖర్చు చేయా ల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టుకు కేబినెట్‌ ఆమోదం ఉంది. దీనికి కావాల్సిన బడ్జెట్‌ కేబినెట్‌లో, చట్టసభల్లో ఆమోదం పొందాక, గవర్నర్‌ కూడా ఆమోదించాక, ఫైనాన్సు బిల్లు ఆమోదం పొందాక రూ.270 కోట్లు విడుదల చేశారు. ఇది పూర్తిగా చట్టబద్ధంగా, నిబంధనల ప్రకారం జరిగింది. అందుకే ఆ ఫైళ్లన్నింటినీ ముందుగానే మాయం చేశారు’’ అని చెప్పారు.

చంద్రబాబు అరెస్టే లక్ష్యంగా...

‘‘చంద్రబాబు అరెస్టు జరిగినప్పుడు సీఐడీ డీజీ, అడిషనల్‌ అడ్వొకేట్‌ జనరల్‌... నేను ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఆధారంగా ఆయనపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు. దాన్ని నేను అప్పుడే ఖండించాను. 2019 జూన్‌ నుంచి 2020 అక్టోబరు వరకు నేను ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జగన్‌ ప్రభుత్వంలో విధులు నిర్వహించడంతో అక్కడ జరిగిన కొన్ని విషయాలు నాకు తెలుసు. జగన్‌ సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబును అరెస్టు చేయాలని, కేసులు పెట్టాలని అనేవారు. కొందరు అధికారులు చాలా ఉత్సాహంగా సలహాదారులతో కలిసి చంద్రబాబును అరెస్టు చేయడం కోసం పనిచేశారు. ఇదిలా జరుగుతుండగా, పుణె జీఎస్టీ కమిషనర్‌ నుంచి సీమెన్స్‌ కంపెనీ చెల్లించాల్సిన జీఎస్టీ గురించి ఒక నోటీసు వచ్చిందని అప్పటి సీఎంవో అధికారి ప్రవీణ్‌ ప్రకాశ్‌ మాటవరుసగా నాకు చెప్పారు. ప్రవీణ్‌ ప్రకాశ్‌, అప్పటి ఉన్నత విద్యాశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సతీష్‌ చంద్ర నా దగ్గరకు వచ్చి, స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌లో ఏవో అవకతవకలు జరిగాయని చెప్పారు. స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ అప్పటి ఎండీ అర్జ శ్రీకాంత్‌ను పిలిచి నేను మాట్లాడాను. అవకతవకలు ఏమీ లేవని, కొన్ని లక్షల మంది శిక్షణ ఇచ్చారని, చాలా సంస్థలు ఈ కార్యక్రమం వల్ల ప్రయోజనాలు పొందారని శ్రీకాంత్‌ చెప్పారు. ప్రభుత్వ విధానం, అక్కడి వాతావరణం నచ్చక నేను ఉద్యోగం వదిలేసి 2020 అక్టోబరులో వచ్చేశాను’’ అని వివరించారు.

చంద్రబాబు బలవంతం చేయలేదు

‘‘ముఖ్యమంత్రి సహా ఉన్నతస్థాయి అధికారులంతా కీలక నిర్ణయాలపై, ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు ఫోన్ల ద్వారా, నేరుగా అడిగి తెలుసుకుంటూ ఉంటారు. ఇందులో తప్పేమీ లేదు. చంద్రబాబు వర్క్‌ మైండెడ్‌. రాష్ట్రాభివృద్ధిపై దృష్టి కేంద్రీకరిస్తారు. ఎప్పుడూ ఏ అధికారిని కూడా ఏ విషయంలో కూడా బలవంతంగా చేస్తావా చస్తావా అని చెప్పరు. ముఖ్యమైన విషయమైతే చూడండి.. ఇది మన ప్రభుత్వానికి కీలకమని చెప్తారు. బలవంతం చేయడం ఆయన తత్వం కాదు. ఇదైతే నేను గట్టిగా చెప్పగలను’ అని పీవీ రమేశ్‌ చెప్పారు.

సీఐడీకి మూడుసార్లు పంపాను

‘‘2022 జనవరి నుంచి సీఐడీ వాళ్లు నా వెనుక పడడం మొదలుపెట్టారు. 2022 ఫిబ్రవరిలో నోటీసు ద్వారా 10 ప్రశ్నలు అడిగారు. సమాధానాలు కావాలంటూ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌, డీఎస్పీ, అడిషనల్‌ ఎస్పీ వచ్చారు. దీంతో నేను సమాధానాలు రిజిస్టర్డ్‌ పోస్టులోనూ, ఆ అధికారుల వాట్స్‌పకూ పంపించాను. తర్వాత ఏప్రిల్‌ 24న మరో నోటీసు ద్వారా మరికొన్ని ప్రశ్నలు అడగ్గా... జూన్‌ 28వ తేదీన సమాధానాలు పంపాను. మళ్లీ సెప్టెంబరులో మరికొన్ని ప్రశ్నలు అడగ్గా... సమాధానాలు రాసి పంపాను’’ అని వెల్లడించారు.

సమగ్ర విచారణ జరగాలి

‘‘చంద్రబాబుకు అనుకూలంగా నిలిచే సాక్ష్యాలు ఆ మూడు శాఖల్లోని ఫైళ్లే. ఆ సాక్ష్యాలు ఒక్కసారిగా ఎలా మాయం అవుతాయి? ఎవరు మాయం చేస్తారు? నా 161 స్టేట్‌మెంట్‌ను మార్చిన వాళ్లు... దొంగ సాక్ష్యాలను కోర్టుల ముందు సమర్పించి బాబును అరెస్టు చేయించిన అధికారులు ఇంకా ఆ స్థానాల్లోనే కొనసాగుతున్నారు. వాళ్లే ఉంటే విచారణ పారదర్శకంగా ఉండదు. సమర్థవంతమైన, నిజాయితీ గల అధికారులతో ఈ కుట్రలపై విచారణ చేయించాలి. దీనిపై సమగ్ర విచారణ జరపాలని డీజీపీకి లేఖ రాశాను’ అని పీవీ రమేశ్‌ చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..

విచారణకు రాలేను.. వారం రోజుల గడువు కావాలి: రాంగోపాల్ వర్మ

నింగిలోకి దూసుకెళ్లిన జీశాట్-20 ఉపగ్రహం..

అసెంబ్లీలో మంగళవారం ఏయే బిల్లులు ప్రవేశపెట్టనున్నారంటే..

మణిపూర్‌ పరిస్థితే లగచర్లలోనూ

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Nov 19 , 2024 | 12:09 PM