ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ISRO: PSLV C - 60 రాకెట్.. నిర్విగ్నంగా కొనసాగుతున్న కౌంట్ డౌన్

ABN, Publish Date - Dec 30 , 2024 | 03:16 PM

Andhrapradesh: పీఎస్‌ఎల్వీ సీ-60 రాకెట్ ప్రయోగానికి కౌంట్‌డౌన్ కొనసాగుతోంది. పీఎస్‌ఎల్వీసీ- 60 రాకెట్ బరువు 229 టన్నులు, ఎత్తు 44.5 కిలోలు. 440 కిలోల బరువుండే ఛేజర్, టార్గెట్ ఉపగ్రహాలతో పాటు, 24 బుల్లి ఉపగ్రహాలని నింగిలోకి పీఎస్‌ఎల్వీసీ - 60 రాకెట్ చేర్చనుంది. ఛేజర్, టార్గెట్ ఉపగ్రహాలు రెండేళ్ల పాటు సేవలు అందించనున్నాయి.

PSLV C - 60 rocket Countdown

నెల్లూరు, డిసెంబర్ 30: శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ఈరోజు (సోమవారం) రాత్రి 9:58 గంటలకు పీఎస్‌ఎల్వీసీ- 60 రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. నిన్న( ఆదివారం) రాత్రి 8:58 గంటల నుంచి నిర్విగ్నంగా కౌంట్ డౌన్‌ కొనసాగుతోంది. పీఎస్‌ఎల్వీసీ- 60 రాకెట్ బరువు 229 టన్నులు, ఎత్తు 44.5 కిలోలు. 440 కిలోల బరువుండే ఛేజర్, టార్గెట్ ఉపగ్రహాలతో పాటు, 24 బుల్లి ఉపగ్రహాలని నింగిలోకి పీఎస్‌ఎల్వీసీ - 60 రాకెట్ చేర్చనుంది. ఛేజర్, టార్గెట్ ఉపగ్రహాలు రెండేళ్ల పాటు సేవలు అందించనున్నాయి. డాకింగ్ సంక్లిష్ట సాంకేతిక పరిజ్ఞానంతో రోధసీలో ఛేజర్, టార్గెట్ ఉపగ్రహాలని అనుసంధానం చేసేలా డిజైన్ చేశారు శాస్త్రవేత్తలు. అనుసంధానం అనతరం విడిపోయి భూపరిశీలన, సహజవనరుల పర్యవేక్షణ, పచ్చదనం, రోధసీలో రేడియో ధార్మికతపై అధ్యయనం చేయనున్నాయి. అలాగే మానవ సహిత ప్రయోగాలకు డేటాను ఛేజర్, టార్గెట్ ఉపగ్రహాలు అందివ్వనున్నాయి. ఈ రాకెట్ ప్రయోగంతో అంతరిక్ష కేంద్ర నిర్మాణానికి తొలి అడుగు వేయనుంది ఇస్రో. శాస్త్ర సాంకేతిక రంగంలో అమెరికా, రష్యా, చైనా సరసన భారత్ చేరనుంది. ఇప్పటికే ఇస్రో ఛైర్మన్ డాక్టర్ సోమనాథ్ షార్‌కు చేరుకున్నారు. పీఎస్‌ఎల్‌వీసీ - 60 రాకెట్ ప్రయోగంతో ఇస్రో వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.


2025లోనే ఎక్కువ ప్రయోగాలు: ఇస్రో చైర్మన్

కాగా... పీఎస్‌ఎల్వీసీ - 60 రాకెట్ ప్రయోగం సందర్భంగా ఈరోజు(సోమవారం) ఉదయం సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాళమ్మ ఆలయంలో ఇస్రో చైర్మన్ సోమనాథ్ పూజలు చేశారు. పీఎస్‌ఎల్వీ సీ-60 రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని సోమనాథ్ ప్రత్యేక పూజలు చేశారు. ఈరోజు రాత్రి 10 గంటల 15 సెకన్లకు పీఎస్‌ఎల్వీ సీ-60 రాకెట్ ప్రయోగం జరుగనుంది. ప్రయోగ కౌంట్ డౌన్ ప్రక్రియ సజావుగా సాగుతోందని ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ తెలిపారు. ఈ రాకెట్‌లో ప్రయోగించే స్పాడెక్స్ ఉపగ్రహం ఒక ప్రత్యేకమైన ఉపగ్రహమన్నారు. ఈ ప్రయోగంలో రెండు ఉపగ్రహాలను అమర్చి నింగికి పంపుతున్నామని చెప్పారు. ఈ స్పాడెక్స్ అనే ఉపగ్రహం కేవలం స్పేస్ డాకింగ్ అనే సరికొత్త టెక్నాలజీని వాడుకలోకి తీసుకురావడం కోసం ఉపయోగపడుతుందన్నారు.

భారత జట్టు దారుణ ఓటమి.. నెటిజన్ల రచ్చ


ఈ ప్రయోగంలో 4వ స్టేజ్‌లో 24 ఉపకరణాలు అమర్చి 24 పరిశోధనలు చేపట్టనున్నామని చెప్పారు. 2025 జనవరిలో నావిక్ సాటిలైట్ నింగికి చేరుకుంటుందన్నారు. 2025 మార్చిలోపు జీఎస్‌ఎల్వీ ఎఫ్15, పీఎస్‌ఎల్వీ సీ 61, జీఎస్‌ఎల్వీ ఎమ్‌కే3 ప్రయోగాలు చేపడుతామన్నారు. గగన్ యాన్ టెస్ట్‌టెడ్ ఫ్లైట్ కూడా మరో రెండు మూడు మాసాలలో ప్రయోగిస్తామని చెప్పారు. యూఎస్ దేశానికి చెందిన ఎన్‌ఐఎస్‌ఏఆర్ ఉపగ్రహము నింగలోకి పంపేందుకు ఇస్రో శ్రీకారం చుట్టిందని తెలిపారు. 2024 లో కన్నా 2025 సంవత్సరంలో ఎక్కువ రాకెట్ ప్రయోగాలు చేపడుతామని ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

కొత్త సంవత్సరంలో జరగబోయే మార్పులు ఇవే

వేతనాల గురించి సీఎం కీలక ప్రకటన.. వీరికి గుడ్ న్యూస్..

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 30 , 2024 | 03:16 PM