ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Sri Reddy: నాకు అంత స్ధాయిలేదు లోకేష్‌ అన్నా...

ABN, Publish Date - Nov 14 , 2024 | 11:11 AM

తప్పయిపోయింది. తనను క్షమించాలంటూ వైఎస్సార్‌సీపీ సానుభూతి పరురాలు, సినీ నటి శ్రీరెడ్డి వేడుకుంటున్నారు. ఈ క్రమంలో మంత్రి నారా లోకేష్‌కు విజ్ఞప్తి చేస్తూ ఓలేఖను సామాజిక మధ్యమం ఎక్స్‌లో శ్రీరెడ్డి పోస్టు చేశారు. జగన్ హయాంలో ప్రతిపక్ష నేతలైన చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కల్యాణ్, వంగలపూడి అనితపై సోషల్ మీడియా వేదికగా ఆమె అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

అమరావతి: సినీ నటి, వైసీపీ మద్ధతుదారురాలైన శ్రీరెడ్డి (Sri Reddy) అప్పటి ప్రతిపక్ష నేతలైన చంద్రబాబు (Chandrababu), నారా లోకేష్ (Nara Lokesh), పవన్ కల్యాణ్ (Pawan Kalyan), వంగలపూడి అనిత (Vangalapudi Anitha)పై సోషల్ మీడియా (Social Media) వేదికగా ఆమె అనుచిత వ్యాఖ్యలు (Comments) చేసిన విషయం తెలిసిందే. చిన్నా పెద్దా అని చూడకుండా ఇష్టమొచ్చినట్లు విమర్శలు చేస్తూ.. భూతులు మాట్లాడుతూ మాజీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డికి అనుకూలంగా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలే లక్ష్యంగా శ్రీరెడ్డి సోషల్ మీడియాలో అనుచిత విమర్శలు చేశారు. ఇప్పుడు అధికారం మారిపోగానే ఆమె స్వరం మార్చారు. తప్పయిపోయింది. తనను క్షమించాలంటూ వేడుకుంటున్నారు. ఈ క్రమంలో మంత్రి నారా లోకేష్‌కు విజ్ఞప్తి చేస్తూ ఓలేఖను సామాజిక మధ్యమం ఎక్స్‌లో శ్రీరెడ్డి పోస్టు చేశారు.


‘‘లోకేష్‌ అన్నకు విజ్జప్తి ... మా కుటుంబానికి విజయవాడతోనే ఎక్కువ అనుభందం ఉంది.. అమరావతి రాజధాని కావడం మా ఇంట్లో వారికి కూడా సంతోషాన్నిచ్చింది.. విజయవాడలోని మా ఇంటి వ్యాల్యూ కూడా పెరిగింది.. మా కుటుంబ సభ్యులు కూడా టీడీపీకి ఓటు వేశారు.. కొన్ని విషయాల్లో ఎంత మెండిగా ఉంటారో అంత మంచి తనం కూడా మీలో ఉంది.. మీకు నాతో వీడియోలో క్షమాపణలు చెప్పించింది కూడా మా కుటుంబ సభ్యులే.. మీతో డైరెక్టుగా వీలైతే మాట్లాడమని వారు చెప్పారు.. అయితే నాకు అంత స్ధాయిలేదు.. అందుకే ఈ ఓపెన్ లెటర్ రాస్తున్నా..

నేను మీ పార్టీని, కార్యకర్తలను, జనసేన వీర మహిళలను వారి కుటుంబ సభ్యులకు ఇంతకు ముందే క్షమాపణలు చెప్పాను.. నేను చాలా పరుషంగా అనేకసార్లు మాట్లాడాను అందుకే నేనే మరోసారి క్షమాపణలు చెపతున్నా.. గత పదిరోజులుగా డిస్కసన్‌లు వాటిలో పెడుతున్న కామెంట్స్ చూస్తే నేను ఎంత మంది మనోభవాలను దెబ్బతీసానో అర్ధం అవుతోంది.. వెంకటేశ్వరస్వామి భక్తురాలిగా ప్రమాణం చేసి చెపుతున్నా జుగుప్సాకరంగా మట్లాడి తప్పుచేశాను. చంద్రబాబునాయుడు, లోకేష్‌ , వారి కుటుంబ సభ్యులకు, హోంమినిష్టర్‌కు, ఆంధ్రజ్యోతి, ఐటిడిపీ, టిడీపీ కార్యకర్తలకు, సోషల్ మీడియాకు సారీ .. జనసేన మీడియా, వీర మహిళలు, సోషల్ మీడియాకి, పీకేకు సారీ.. మీ అందరూ పెద్దమనస్సుతో మీ తెలుగు అమ్మాయిని క్షమించండి అంటూ లేఖ రాస్తున్నా..

ఒక వేళ భవిష్యత్తులో వైఎస్పార్‌సీపీ అధికారంలోకి వచ్చినా నాబుద్ది వక్రంగా మారదు.. ఇకపై ఇష్టానుసారం అసభ్య భాష ఎవరిపై వాడనని ప్రమాణం చేస్తున్నా.. నా దాకా వచ్చే సరికి నేను చేసే తప్పు ఏంటో ఇప్పుడు అర్ధం అయ్యింది.. ఇప్పటికే నేను నా కుటుంబం 1000 సంవత్సరాలకు సరిపడే క్షోభ అనుభవించాం.. ఇంట్లో పెళ్లికావాల్సిన పిల్లలు ఉన్నారు.. నన్ను కొడితే ఆ దెబ్బలు ఒక నెలలో లేదా మూడు నెలల్లో మానుతాయి.. అయితే నా వల్ల మరో ముగ్గురు ఇబ్బంది పడొద్దనేది నా ఉద్దేశం.. మా కుటుంబాన్ని కాపాడండి... నన్ను బంధ విముక్తిరాల్ని చేయండి.. సినీ పరిశ్రమలోని చిరంజీవి, నాగబాబుతో పాటు అందరికి క్షమాపణలు.. సునీత, షర్మిలను కూడా క్షమాపణలు’’ అంటూ శ్రీరెడ్డి కోరారు. తాను సినిమా రంగంలో.. రాజకీయాల్లో ఫెయిల్ అయ్యాను అంటూ శ్రీరెడ్డి లేఖలో వెల్లడించారు.


కాగా సినీ నటి శ్రీరెడ్డిపై తూర్పు గోదావరి జిల్లాలో కేసు నమోదు అయ్యింది. వైసీపీ హయాంలో సోషల్ మీడియా వేదికగా కూటమి నేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్, వంగలపూడి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి తప్పుడు ప్రచారం చేశారంటూ టీడీపీ ఏపీ మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బొమ్మూరు పోలీసులు కేసు నమోదు చేశారు.

వైసీపీ పార్టీకి, మాజీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డికి అనుకూలంగా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలే లక్ష్యంగా శ్రీరెడ్డి విషం చిమ్మారంటూ పద్మ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు శ్రీరెడ్డిపై 196, 353(2), 79 BNS, 67 ITA-2000-2008 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉండడంతో ఎన్ని ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకోలేదని మజ్జి పద్మ ఆరోపించారు. తక్షణమే ఆమెను అరెస్టు చేయాలని టీడీపీ మహిళా నేత పద్మ డిమాండ్ చేశారు.

Updated Date - Nov 14 , 2024 | 11:12 AM