CS: నీరబ్ కుమార్ ప్రసాద్ సర్వీస్ పొడిగింపు!
ABN, Publish Date - Jun 20 , 2024 | 03:31 AM
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీకాలాన్ని ఆరు నెలలు పొడిగించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.
నీరబ్ కుమార్ ప్రసాద్ సర్వీస్ పొడగింపు
ఆరు నెలలు పొడిగించండి
కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ
అమరావతి, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీకాలాన్ని ఆరు నెలలు పొడిగించాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వానికి బుధవారం లేఖ రాశారు. నీరబ్ కుమార్ ప్రసాద్ కొద్ది రోజుల కింద ఏపీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్నారు. నెలాఖరులో రిటైర్ అవబోతున్నారు. ఆయన ఆయన సేవలు కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది. కేంద్రానికి లేఖ రాసింది. గత ప్రభుత్వంలో ఆయన సీఎస్ కావాల్సి ఉంది. జగన్ ఆయనను పక్కన పెట్టి జూనియర్ అయిన జవహర్ రెడ్డికి పట్టం కట్టారు.
చంద్రబాబు ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించగానే సీనియార్టీకి ప్రయార్టీ ఇచ్చారు. సీనియారిటీలో ముందున్న నీరబ్‌కుమార్ ప్రసాద్‌ను చీఫ్ సెక్రటరీగా ఎంపిక చేశారు. ప్రస్తుతం ఆయనకు 10 రోజుల సర్వీస్ మాత్రమే ఉండడంతో మరికొంత కాలం పాటు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో సర్వీస్ పొడిగింపు కోరుతూ కేంద్రానికి లేఖ రాశారు. కేంద్రం ఒకే విడతలో ఆరు నెలలు పొడిగింపు ఇస్తుందా.. లేదంటే మూడు నెలల చొప్పున రెండుసార్లు పొడిగిస్తుందా అన్నది వేచి చూడాలి.
Updated Date - Jun 20 , 2024 | 07:30 AM