ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Pawan Kalyan: పవన్ ఏ పేషీ అయినా తీసుకోవచ్చు..!!

ABN, Publish Date - Jun 18 , 2024 | 02:57 PM

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్యాంపు కార్యాలయం, సచివాలయంలో పేషి ఖరారు కావాల్సి ఉంది. జలవనరుల శాఖ క్యాంపు కార్యాలయంగా కన్ఫామ్ అవనుంది. సచివాలయంలో గల కార్యాలయాలను పవన్ కల్యాణ్ ఈ రోజు పరిశీలించారు. ఇంతలోనే పవన్ పేషీపై వార్తలు వస్తున్నాయి. అందుకు గల కారణం సెకండ్ బ్లాక్‌లో ఫైనాన్స్ అని స్టిక్కర్ కనిపించడం.

payyavula keshav

అమరావతి: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan).. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) మధ్య చాంబర్ల విషయంలో వివాదం తలెత్తిందని వార్తలు గుప్పుమన్న సంగతి తెలిసిందే. ముందుగా 212, 214 చాంబర్లు ప‌వ‌న్‌కు కేటాయించగా ఆ తర్వాత ఆ ఛాంబ‌ర్ ఆర్థిక మంత్రి కావాల‌ని అడ‌గ‌డం ఇచ్చారని.. ప‌వ‌న్‌కు 211 పేషీ కేటాయించినట్లు టాక్ నడిచింది. ఇంకేముంది సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు అయితే ‘అప్పుడే మొదలైంది’ అంటూ ఓ రేంజిలో వైరల్ చేసేశారు. ఈ వ్యవహారంపై పయ్యావుల కేశవ్ ప్రత్యేకంగా ఏబీఎన్- ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ఫుల్ క్లారిటీ ఇచ్చుకున్నారు.


ఏంటంటే..?

పేషీల గురించి నేను ఎవరితో మాట్లాడలేదు. నాకు ఇది కావాలని ఎవరినీ అడగలేదు. ప్రభుత్వం నాకు ఏది కేటాయిస్తే అది తీసుకుంటాను. పవన్ కల్యాణ్ పేషీ గురించి వస్తోన్న వార్తల్లో నిజం లేదు. పవన్ కల్యాణ్ సచివాలయాన్ని పరిశీలించారు. సెక్రటేరియట్‌లో ఏ బ్లాక్ కావాలంటే అది తీసుకోవచ్చు. సెకండ్ బ్లాక్‌లో ఫైనాన్స్ అని ఉన్న స్టిక్కర్ ఎప్పటిదో.. గతంలో ఇక్కడ ఫైనాన్స్, ప్లానింగ్ శాఖలు ఉండేవి. ఒకవేళ పవన్ కల్యాణ్ ఆ పేషీ కావాలంటే తీసుకోవచ్చు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాకు మొదటి ప్రాధాన్యత. పేషీ విషయంలో ఇబ్బందులు లేవు. కొందరు కావాలనే అసత్యాలు ప్రచారం చేస్తున్నారు అని మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..


కోడెల చేస్తే తప్పు.. జగన్‌ చేస్తే ఒప్పా?

Updated Date - Jun 18 , 2024 | 04:18 PM

Advertising
Advertising