ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Notice : జగన్‌ సీఎంగా ఉన్నప్పుడే.. అక్రమ నిర్మాణంపై నోటీసులు

ABN, Publish Date - Jun 23 , 2024 | 05:34 AM

మాజీ సీఎం జగన్‌ నోరు విప్పితే పచ్చి అబద్ధాలు చెబుతారని మరోసారి తేలింది. తాడేపల్లి బోటుయార్డులోని రూ.కోట్ల విలువైన భూమిలో జల వనరుల శాఖ అనుమతి లేకుండా.. సీఆర్‌డీఏ, తాడేపల్లి-మంగళగిరి కార్పొరేషన్‌ల నుంచి పర్మిషన్‌ తీసుకోకుండా వైసీపీ కార్యాలయం కోసం అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాన్ని అధికారులు కూల్చివేయడంపై

అయినా ఇవ్వలేదంటూ మాజీ సీఎం అబద్ధాలు

రాజధానికి రోడ్డు లేకుండా చేసేందుకే ఆ భూములపై కన్ను

జలవనరులు, కుంటల్లో నిర్మాణాలు కూడదని, ఆ భూమి

ఇవ్వొద్దని నాడు ఈఎన్‌సీ నివేదిక.. అయినా కేటాయింపు

ఇప్పుడు నోటీసులకు స్పందించనందుకే కూల్చివేత

దీనిని చంద్రబాబుకు ఆపాదిస్తూ జగన్‌ రాజకీయం

వైసీపీ స్పందించకపోవడంతోనే సీఆర్‌డీఏ చట్టం ప్రకారం కూల్చివేత

(అమరావతి/గుంటూరు-ఆంధ్రజ్యోతి)

మాజీ సీఎం జగన్‌ నోరు విప్పితే పచ్చి అబద్ధాలు చెబుతారని మరోసారి తేలింది. తాడేపల్లి బోటుయార్డులోని రూ.కోట్ల విలువైన భూమిలో జల వనరుల శాఖ అనుమతి లేకుండా.. సీఆర్‌డీఏ, తాడేపల్లి-మంగళగిరి కార్పొరేషన్‌ల నుంచి పర్మిషన్‌ తీసుకోకుండా వైసీపీ కార్యాలయం కోసం అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాన్ని అధికారులు కూల్చివేయడంపై ఆయన గగ్గోలు పెడుతున్నారు. అధికారులు ఎలాంటి నోటీసులూ ఇవ్వకుండా కూల్చారని ఆరోపిస్తున్నారు. అయి తే గత నెల రోజులుగా నోటీసులపై నోటీసులు ఇచ్చాక.. వైసీపీ నుంచి ఎలాంటి స్పందనా లేనందునే కూల్చివేతకు వారు ఉపక్రమించార ని తెలుస్తోంది. పైగా జగన్‌ సీఎంగా ఉన్నప్పుడే వైసీపీకి ఈ నోటీసులు అందడం గమనార్హం. అంతేకాదు.. ఆయన అధికారంలో ఉన్నప్పుడే.. సదరు భూమిని అప్పగించేది లేదని ఇంజనీర్‌-ఇన్‌-చీఫ్‌ సి.నారాయణరెడ్డి తేల్చిచెప్పారు. పైగా అక్రమ కట్టడాలు ఏవైనా ఉంటే కూల్చివేయాలని ఆదేశించారు. ఇవన్నీ కప్పిపుచ్చి ఇప్పుడు సీఎం చంద్రబాబుపై జగన్‌ అభాండాలు వేస్తున్నారు.

జరిగింది ఇదీ..

2019లో తాను గద్దెనెక్కాక వైసీపీ కార్యాలయాల నిర్మాణం కోసం విలువైన స్థలాలను కాజేందుకు జగన్‌ కుట్రకు తెరతీశారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో రూ.కోట్లు ఖరీదుచేసే స్థలాలను 33 ఏళ్లపాటు ఎకరా రూ.వెయ్యి చొప్పున లీజుకు కట్టబెడుతూ కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగం గా విజయవాడ సమీపంలోని తాడేపల్లి బోటుయార్డులో జల వనరుల శాఖకు చెందిన 2 ఎకరాల భూమిని వైసీపీ కేంద్ర కార్యాలయం కోసం జగన్‌ ప్రభుత్వం గత ఏడాది కేటాయించింది. దీనికి ముందు చాలా తతంగం జరిగిం ది. బోటుయార్డు భూముల నుంచి రెండెకరాలు కేటాయించాల్సిందిగా జల వనరుల శాఖకు లేఖ రాయాలని నాటి గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను ఆ పార్టీ నాయకత్వం ఆదేశించింది. ఆయన లేఖ రాశారు. తెనాలి సబ్‌ కలెక్టర్‌ దీనిపై నివేదిక ఇస్తూ ఆ ప్రాంతంలోని 5.35 ఎకరాలను సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు కోసం సీఆర్‌డీఏ మార్కింగ్‌ చేసిందని.. బోటుయార్డు భూమిని కేటాయించాలంటే ఇరిగేషన్‌ శాఖ అనుమతి తీసుకోవాలని పేర్కొన్నారు. అయితే ఇరిగేషన్‌ శాఖ అనుమతులు తీసుకోకుండానే నేరుగా కేబినెట్‌లో పెట్టి ఆమోదం పొందారు. అలాగే వైసీపీ కార్యాలయ నిర్మాణంపై నిరుడు జనవరి 31న విజయవాడ ఇరిగేషన్‌ సర్కిల్‌ సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌ (ఎస్‌ఈ).. బోటుయార్డు భూముల కేటాయింపుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఈఎన్‌సీ నారాయణరెడ్డిని కోరారు. ఈ కేటాయింపును ఈఎన్‌సీ వ్యతిరేకించారు. జల వనరులు, నీటి కుంటలు, చెరువులు, నీటి ప్రవాహ ప్రాంతాల పరిరక్షణ కోసం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వాటిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని ఈఎన్‌సీ తన నివేదికలో స్పష్టం చేశారు. అలాగే జల వనరుల భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్‌జీటీ) ఇచ్చిన ఆదేశాలను గుర్తుచేశారు. బోటుయార్డులోని 17 ఎకరాలకు గాను 9 ఎకరాల్లో కృష్ణా పశ్చిమ కాలువ పారుతోందని.. ఈ కాలువకు 100 మీటర్ల దూరంలోనే వైసీపీ కార్యాలయం నిర్మించడం అక్రమమని పేర్కొన్నారు. మరో ఐదెకరాలను రాజధాని అమరావతి సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు కోసం రెవె న్యూ శాఖ కోరిందని వివరించారు. ఇక అక్కడ 3 ఎకరాలు మాత్రమే మిగిలి ఉందని.. అది కూడా నదీ తీర ప్రాంతమని తెలియజేశారు. ఈ భూముల్లోనే రాష్ట్ర జల భూ యాజమాన్య శిక్షణ సంస్థ కార్యాలయాన్ని, ఇంజనీరింగ్‌ రీసెర్చ్‌ లేబొరేటరీస్‌(ఏపీఈఆర్‌ఎల్‌)నూ ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. అందుచేత ఈ భూముల్లో వైసీపీ కార్యాలయం నిర్మించేందుకు అనుమతులు ఇవ్వడం సాధ్యం కాదని ఆయన తేల్చిచెప్పారు. అయితే జల వనరుల శాఖ అనుమతులు ఇవ్వకపోయినా.. కార్యాలయం నిర్మాణానికి వైసీపీ పూనుకుంది.


గతంలో గుంటూరులో భూమి ఇచ్చినా..

వాస్తవానికి 2016లోనే టీడీపీ ప్రభుత్వం గుంటూరు నడిబొడ్డున కొరిటెపాడులో 98 సెంట్ల భూమిని కార్యాలయ నిర్మాణం కోసం వైసీపీకి కేటాయించింది. ఆ ఏడాది జూలై 21న జీవో 340 జారీచేసింది. అయితే ఈ భూమిని తీసుకునేందుకు ఆ పార్టీ నిరాకరించింది. తాము అధికారంలోకి వచ్చాక బోటుయార్డులో రెండెకరాలు తీసుకోవాలని నిర్ణయించింది. టీడీపీ ప్రభుత్వం గుంటూరులో వైసీపీకి కేటాయించిన భూమికి బదులు ఇక్కడ రెండెకరాల భూమిని కేటాయిస్తూ సీసీఎల్‌ఏ సాయిప్రసాద్‌ గత ఏడాది ఫిబ్రవరి 16న ఉత్తర్వు జారీ చేశా రు. ఇంకోవైపు.. ఈఎన్‌సీ నివేదికపై జగన్‌ సర్కారు న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ అంశంలో సుప్రీంకోర్టు ఆదేశాలను, ఎన్‌జీటీ మార్గదర్శకాలను పాటించాలని కోర్టు కూడా ఆదేశించింది. అయితే తహశీల్దార్‌ నిబంధనలకు విరుద్ధంగా 2023 మార్చి 31న స్థలాన్ని ఇరిగేషన్‌ శాఖ అనుమతి లేకుండానే వైసీపీకి అప్పగించేశారు. అధికార పార్టీ పెద్దలు భవన నిర్మాణానికి సీఆర్‌డీఏ నుంచి అనుమతులు తీసుకోకుండానే పనులు సాగించారు. ఇరిగేషన్‌ శాఖ అనుమతి ఇవ్వనందున భూమి కోసం లీజు ఒప్పందం కూడా కుదుర్చుకోలేదు. దీనిపై ఫిర్యాదులు రావడంతో మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు ఈ ఏడాది మే 20న.. బోటు యార్డులో జల వనరుల శాఖ ఆమోదం లేకుండా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయంటూ వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడికి సంజాయిషీ నోటీసు జారీ చేశారు. అప్పటికి ఓట్ల లెక్కింపు జరుగనేలేదు. మే 13న రాష్ట్రంలో పోలింగ్‌ జరగడం.. జూన్‌ 4న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలువడడం తెలిసిందే. అంటే అప్పటిదాకా జగన్‌ ప్రభుత్వం ఉన్నట్లే కదా! మే 20నాటి నోటీసుకు వైసీపీ నాయక త్వం స్పందించకపోవడంతో మళ్లీ ఈ నెల 1న వారం రోజుల్లో అక్రమ నిర్మాణాలపై సంజాయిషీ ఇవ్వాలని కార్పొరేషన్‌ నోటీసు ఇచ్చింది. ఈ నోటీసును భవన నిర్మాణం చేపట్టిన రాంకీ సంస్థకు కూడా పంపింది. అయినా స్పందనలేకపోవడంతో ఈ నెల 14న కార్పొరేషన్‌ కమిషనర్‌ కూల్చివేత ఉత్తర్వులు జారీ చేశారు. షోకాజ్‌ నోటీసుకు సమాధానం ఇవ్వకుండా.. హైకోర్టును ఆశ్రయించామంటూ రాకీ సంస్థ ఈ నెల 17వ తేదీ రాత్రి 11.37 గంటలకు తెలియజేసింది. అయితే హైకోర్టు కూడా ఈ వ్యవహారంలో చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలనే సూచించడంతో సీఆర్‌డీఏ చట్టం సెక్షన్‌ 115 ప్రకారం అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారు.

Updated Date - Jun 23 , 2024 | 05:34 AM

Advertising
Advertising