ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

YSRCP: వైసీపీకి మరో ఊహించని బిగ్ షాక్

ABN, Publish Date - Aug 30 , 2024 | 01:29 PM

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత మరుసటి రోజు నుంచే వైసీపీ షాక్‌లు మొదలయ్యాయి. నాడు మొదలైన బిగ్ షాక్‌లు నేటికి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. రోజుకో నేత.. రెండ్రోజులకో ఇద్దరు ఎంపీలు రాజీనామాతో దెబ్బ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది...

YS Jagan Mohan Reddy

అమరావతి : ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో (AP Elections) ఘోర పరాజయం పాలైన తర్వాత మరుసటి రోజు నుంచే వైసీపీకి (YSR Congress) షాక్‌లు మొదలయ్యాయి. నాడు మొదలైన బిగ్ షాక్‌లు నేటికి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. రోజుకో నేత.. రెండ్రోజులకో ఇద్దరు ఎంపీలు రాజీనామాతో దెబ్బ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి (YS Jagan Mohan Reddy) దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. గురువారం నాడు ఇద్దరు రాజ్యసభ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రవిల రాజీనామాతో పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలినట్లయ్యింది. ఈ షాక్ నుంచి తేరుకోక మునుపే మరో ఇద్దరు రాజీనామా చేయడంతో వైసీపీలో వికెట్లు రాలిపోతున్నాయ్.


ఎవరా ఇద్దరు..

అధినేత జగన్‌కు సొంత పార్టీ నేతలు ఇస్తున్న షాకులతో కోలుకోలేకపోతున్నారు. మోపిదేవి, బీద మస్తాన్ రాజీనామా నుంచి తేరుకోక మునుపే మరో ఇద్దరు ఎమ్మెల్సీలు రాజీనామా చేసేశారు. శుక్రవారం నాడు ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, బల్లి కల్యాణ చక్రవర్తి తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు తమ రాజీనామా లేఖలను శాసన మండలి చైర్మన్‌‌కు రాజీనామా లేఖలు అందజేయనున్నారు. వెంటనే రాజీనామాకు ఆమోదం తెలపాలని ఇద్దరు ఎమ్మెల్సీలు చైర్మన్‌ను కోరనున్నారు.


ఇద్దరి బ్యాగ్రౌండ్ ఇదీ..

జాతీయ మత్య్సకార మహిళా అధ్యక్షురాలుగా, రాష్ట్ర మత్స్యకార సంక్షేమ సమితి మహిళా అధ్యక్షురాలిగా పని చేసిన పద్మశ్రీ గతంలో వైసీపీలో చేరారు. మార్చి 2023లో జరిగిన ఎన్నికలకు గవర్నర్ కోటా నుంచి వైసీపీ ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యారు. తిరుపతి లోక్‌సభ నుంచి 2019 ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన బల్లి దుర్గాప్రసాద్‌ కుమారుడే బల్లి కళ్యాణ్‌ చక్రవర్తి. 2020 సెప్టెంబర్‌లో కరోనాతో చికిత్స పొందుతు ఉండగా గుండెపోటు రావడంతో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. తండ్రి మరణాంతరం రాజకీయాల్లోకి వచ్చిన కళ్యాణ్‌ను 2021లో ఎమ్మెల్యేల కోటాలో అధిష్టానం ఎమ్మెల్సీని చేయడం జరిగింది. ఈ ఇద్దరూ ఎమ్మెల్సీలు అయ్యి తక్కువ కాలమే అయ్యింది. అయితే ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది..? పార్టీపై అసంతృప్తితో గుడ్ బై చెబుతున్నారా..? లేకుంటే వ్యక్తిగత కారణాలున్నాయా..? అనేదానిపై ఎలాంటి స్పష్టత రాలేదు.

ఇప్పట్లో ఆగవేమో..!

ఇదిలా ఉంటే త్వరలోనే మరికొందరు ఎమ్మెల్సీలు.. నాలుగు నుంచి ఐదుగురు రాజ్యసభ ఎంపీలు కూడా రాజీనామాకు రంగం సిద్ధం చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే సెప్టెంబర్ ఒకటి, రెండు తారీఖుల్లో రాజీనామాలు ఉంటాయని సమాచారం. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఆ తర్వాత ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేస్తారని వైసీపీలోనే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోందని తెలియవచ్చింది. దీన్ని బట్టి చూస్తే రాజీనామాలు ఇప్పట్లో ఆగే పరిస్థితి అయితే కనిపించట్లేదు.

Updated Date - Aug 30 , 2024 | 02:23 PM

Advertising
Advertising