ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Janasena: 3 స్థానాలపై పవన్‌ కసరత్తు.. తిరుపతి సీటుపై ఫైనల్‌గా..!

ABN, Publish Date - Mar 24 , 2024 | 03:14 AM

జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ దాదాపు 18 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇక మిగిలినవి 3 స్థానాలు మాత్రమే.

  • ఇప్పటికే 18 చోట్ల అభ్యర్థులు ఖరారు

  • పాలకొండ, అవనిగడ్డ, రైల్వేకోడూరు పెండింగ్‌

  • రైల్వేకోడూరు స్థానాన్ని మార్చుకోవాలని సూచనలు

  • ధర్మవరం లేదా రాజంపేట తీసుకోవాలని పార్టీ ఆలోచన

  • తిరుపతి పంచాయితీ తేల్చేందుకు ఫీల్డ్‌ సర్వే

  • పోలవరం అభ్యర్థిగా చిర్రి బాలరాజు

(అమరావతి-ఆంధ్రజ్యోతి) :

జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ దాదాపు 18 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇక మిగిలినవి 3 స్థానాలు మాత్రమే. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ, ఉమ్మడి కృష్ణా జిల్లాలో అవనిగడ్డ, కడపలో రైల్వేకోడూరు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. పాలకొండలో జనసేన పార్టీకి బలమైన కేడర్‌ ఉంది. కాపు ఓటు బ్యాంక్‌ అధికంగానే ఉంది. బలమైన అభ్యర్థిని బరిలోకి దించితే విజయం తథ్యం. వైసీపీ ఎమ్మెల్యే కళావతి రెండుసార్లు గెలవడంతో స్థానికంగా ఆమెకు వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత కూడా జనసేనకు కలిసి వస్తుంది. కానీ, అభ్యర్థి ఎంపిక కీలకంగా మారింది. కొత్త వారిని కాకుండా రాజకీయ అనుభవం ఉన్న వారిని బరిలో దించాల్సిన అవసరం ఉంది. మరోవైపు అవనిగడ్డ సీటు కోసం పార్టీలో పోటీ ఎక్కువ ఉంది. ఇక్కడ విక్కుర్తి వెంకట శ్రీనివాస్‌, మదివాడ వెంకటకృష్ణ పోటీ పడుతున్నారు. విక్కుర్తికి సీటు దాదాపు ఖరారవుతుందని భావించారు. పార్టీ కూడా అతని పేరునే దాదాపు ఖరారు చేసేందుకు సిద్ధమైంది. కానీ, మధ్యలో వంగవీటి రాధా తెరపైకి వచ్చారు. రాధాను అక్కడ బరిలోకి దించాలని మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి భావిస్తున్నారు. దీనికోసం రెండు రోజుల క్రితం పార్టీ పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ను కలిశారు.

రైల్వేకోడూరు ఎందుకు?

మరోవైపు రైల్వేకోడూరు సీటు ఎందుకు తీసుకున్నారని పార్టీలో అంతర్గత చర్చ జరుగుతోంది. అక్కడ పార్టీకి బలమైన నాయకుడే లేడు. దీంతో అభ్యర్థి ఎంపిక పెద్ద సవాల్‌గా మారింది. దానికి బదులు ధర్మవరం లేదా రాజంపేట స్థానాలు తీసుకోవాలన్న సూచనలు వస్తున్నాయి. ధర్మవరంలో జనసేన బలంగా ఉంది. అక్కడ టీడీపీ, బీజేపీ మధ్య వర్గపోరాటాలు జరుగుతున్నాయి. దీంతో ధర్మవరం సీటు జనసేన తీసుకోవాలని సూచిస్తున్నారు. లేదంటే రాజంపేట స్థానాన్ని తీసుకోవాలని రాయలసీమ నాయకులు పార్టీని కోరుతున్నారు. రాయలసీమలో బలిజ సామాజిక వర్గం ఎక్కువ. దాదాపు 46 లక్షల మంది బలిజ ఓటర్లు రాయలసీమలో ఉన్నారు. అలాంటి చోట కేవలం రెండు సీట్లు తీసుకోవడం, అందులో ఒక ఎస్సీని తీసుకోవడంపై పార్టీలో కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రైల్వేకోడూరు స్థానాన్ని మార్చుకోవడమే మేలనే ఆలోచనలో పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూడు స్థానాలపై అధినేత తీవ్ర కసరత్తు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

తేలని తిరుపతి పంచాయితీ...

మరోవైపు తిరుపతి పంచాయితీ ఇప్పటి వరకూ తేలలేదు. దీంతో ఈపాటికే ప్రచారంలో ఉండాల్సిన నాయకులు, కేడర్‌.. అభ్యర్థిపై వ్యతిరేకతతో ప్రచారానికి రావడం లేదు. వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు దాదాపు టికెట్ ఇచ్చేశారని.. స్థానికంగా ఆయన ప్రచారం కూడా షురూ చేయడంతో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో స్థానిక నేతలతో సమావేశంలో ఫీల్డ్‌ సర్వే చేస్తామని నాగబాబు హామీ ఇచ్చారు. ప్రస్తుతం పార్టీ తిరుపతిలో ఫీల్డ్‌ సర్వే చేయిస్తోంది. రెండుమూడు రోజుల్లో సర్వే రిపోర్టు రావాల్సి ఉంది. అభ్యర్థిని మార్చడమే మంచిదన్న సూచనలు అధినేత దృష్టికి వెళ్లాయి. స్థానికులకు టికెట్‌ ఇస్తేనే సహకరిస్తామని టీడీపీ నాయకులు కూడా సృష్టంగా చెబుతున్నారు. దీంతో స్థానికులనే బరిలోకి దించాలని పార్టీ కూడా భావిస్తోంది. దీనిపై రెండుమూడు రోజుల్లో సృష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఇక పోలవరంలో పార్టీ నాయకుడు చిర్రి బాలరాజు బరిలోకి దిగనున్నారు. శనివారం పార్టీ కార్యాలయంలో పోలవరం నాయకులతో సమావేశమైన పవన్‌ కల్యాణ్‌.. బాలరాజుకు ఎన్నికల నియమావళి, నిబంధనలతో కూడిన పత్రాలను అందించారు.

Updated Date - Mar 24 , 2024 | 08:42 AM

Advertising
Advertising