ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Politics: మరో ఇద్దరు అభ్యర్థులను ప్రకటించిన జనసేన..

ABN, Publish Date - Apr 04 , 2024 | 04:51 PM

Janasena MLA Candidates List: ఎన్నికలు దగ్గరపడుతుంటంతో జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) స్పీడ్ పెంచారు. తాజాగా తన పార్టీ నుంచి పోటీ చేయనున్న మరో ఇద్దరు అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. అవనిగడ్డ(Avanigadda) అసెంబ్లీ నియోజకవర్గం..

Janasena MLA Candidates

Janasena MLA Candidates List: ఎన్నికలు దగ్గరపడుతుంటంతో జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) స్పీడ్ పెంచారు. తాజాగా తన పార్టీ నుంచి పోటీ చేయనున్న మరో ఇద్దరు అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. అవనిగడ్డ(Avanigadda) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా మండలి బుద్దప్రసాద్‌ పేరును ఆ పార్టీ చీఫ్ పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. అలాగే రైల్వే కోడూరు అభ్యర్థిగా అరవ శ్రీధర్‌ను ఎంపిక చేశారు జనసేనాని. వీరిద్ది ఎంపికపై పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. వీరి ఎంపికను ధృవీకరిస్తూ జనసేన అధికారిక ప్రకటన విడుదల చేసింది.


అయితే, రైల్వే కోడూరు స్థానానికి ఇప్పటికే యనమల భాస్కరరావు పేరును ప్రకటించారు. ఈయన అభ్యర్థిత్వంపై సర్వే నిర్వహించగా.. వ్యతిరేక ఫలితాలు వచ్చాయి. దాంతో అభ్యర్థి పేరును మార్చేశారు. భాస్కరరావు ప్లేస్‌లో అరవ శ్రీధర్‌ను ఎంచుకున్నారు.

Also Read: కవితదే మాస్టర్ మైండ్.. ఈడీ సంచలన కామెంట్స్..


కాగా, మిగిలిపోయిన పాలకొండ అసెంబ్లీ స్థానానికి ఒకటి రెండు రోజుల్లో అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందని జనసేన నాయకులు చెబుతున్నారు. అభ్యర్థిపై పార్టీ శ్రేణుల అభిప్రాయాలను సేకరిస్తున్నారని, దాదాపు ఒక నిర్ణయానికి వచ్చేశారని అంటున్నారు. వీలైనంత త్వరగా పాలకొండ అభ్యర్థిని ప్రకటించేందుకు పార్టీ చీఫ్ సిద్ధంగా ఉన్నట్లు నేతలు చెబుతున్నారు. జనసేన, బీజేపీ, టీడీపీ పొత్తులో భాగంగా ఏపీలో 21 అసెంబ్లీ స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఒక్క స్థానానికి మినహా మిగిలిన అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది జనసేన.


ఇవి కూడా చదవండి:

అవినాష్ రెడ్డి బెయిల్‌పై విచారణ.. కీలక వ్యాఖ్యలు చేసిన కోర్టు..

కవిత చిన్న కొడుకు ఒంటిరిగా ఏం లేడు: ఈడీ తరపున న్యాయవాది

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Apr 04 , 2024 | 04:51 PM

Advertising
Advertising