Pawan Kalyan: రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొనే సీట్ల పంపకం..
ABN, Publish Date - Mar 12 , 2024 | 09:55 AM
రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సీట్లు పంపకం జరిగిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. సీట్ల సంఖ్య.. హెచ్చుతగ్గుల కంటే రాష్ట్ర శ్రేయస్సు ముఖ్యమని మూడు పార్టీలు ధృడ సంకల్పంతో ముందడుగు వేశాయని ట్విటర్ వేదికగా వెల్లడించారు.
అమరావతి: రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సీట్లు పంపకం జరిగిందని జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పేర్కొన్నారు. సీట్ల సంఖ్య.. హెచ్చుతగ్గుల కంటే రాష్ట్ర శ్రేయస్సు ముఖ్యమని మూడు పార్టీలు ధృడ సంకల్పంతో ముందడుగు వేశాయని ట్విటర్ వేదికగా వెల్లడించారు. ‘‘గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) గారి శక్తిమంతమైన, దార్శనిక నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగనున్న లోక్ సభ, శాసనసభ ఎన్నికల్లో బీజేపీ (BJP), తెలుగుదేశం (TDP), జనసేన కలసి పని చేస్తాయి.
రాష్ట్ర అభివృద్ధి, ప్రగతి, ప్రజల స్థితిగతుల మెరుగుదలకు మూడు పార్టీలు కట్టుబడి ఉన్నాయి. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సీట్లు పంపకం జరిగింది. సీట్ల సంఖ్య.. హెచ్చుతగ్గుల కంటే రాష్ట్ర శ్రేయస్సు ముఖ్యమని మూడు పార్టీలు ధృడ సంకల్పంతో ముందడుగు వేశాము. ఈ కూటమి ఆవిర్భావంతో రాష్ట్ర పురోభివృద్ధికి ఒక బలమైన పునాదిపడిందని మా ప్రగాఢ విశ్వాసం. ఎన్డీఏ. భాగస్వాములుగా రాష్ట్ర ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటాము. ఈ రోజు చర్చల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ (Gajendra Singh Shekawath) గారికి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు శ్రీ బైజయంత్ పాండా గారికి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు (Chandrababu) గారికి కృతజ్ఞతలు’’ అని తెలిపారు.
TDP: టీడీపీ దెబ్బకు దిగివచ్చిన ఆర్టీసీ
మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Mar 12 , 2024 | 09:55 AM