మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Congratulations Pawan Kalyan : పవన్‌కల్యాణ్‌కు సినీ ప్రముఖుల అభినందనలు

ABN, Publish Date - Jun 05 , 2024 | 04:30 AM

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమితో పొత్తు కుదుర్చుకున్న పవన్‌ కల్యాణ్‌.. పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాలలోనూ(21) జయకేతనం ఎగురవేశారు. ఈ నేపథ్యంలో పవన్‌కు

Congratulations Pawan Kalyan : పవన్‌కల్యాణ్‌కు సినీ ప్రముఖుల అభినందనలు

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమితో పొత్తు కుదుర్చుకున్న పవన్‌ కల్యాణ్‌.. పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాలలోనూ(21) జయకేతనం ఎగురవేశారు. ఈ నేపథ్యంలో పవన్‌కు పలువురు టాలీవుడ్‌ సెలబ్రిటీల నుంచి అభినందలు వెల్లువెత్తాయి. ‘‘ఎవ్వరికి అందదు అతని రేంజ్‌.. రెప్ప తెరిచేను రగిలే రివెంజ్‌’’ అని పేర్కొంటూ.. ‘ఓజీ’ టైమ్‌ బిగిన్స్‌ అనే ఓ సినిమా పోస్టర్‌ను నిర్మాణ సంస్థ డివివి మూవీస్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ‘‘ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, హీరోలు బాలకృష్ణ, పవన్‌కల్యాణ్‌, బీజీపీ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరికి హృదయపూర్వక అభినందనలు’’ అని తెలుగు ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, నిర్మాతల మండలి పేర్కొంది. మరోవైపు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుకి మోహన్‌ బాబు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇంతటి ఘనవిజయం అందుకున్న నారా చంద్రబాబునాయుడుకు నా హృదయపూర్వక అభినందనలు. మీ పాలనలో రాష్ట్రం ప్రగతిపథంలో పయనిస్తుందని .. ఉన్నత శిఖరాలను చేరుకుంటుందని విశ్వసిస్తున్నాను’’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు.

ఒక అన్నగా గర్వంగా ఉంది

‘‘డియర్‌ కల్యాణ్‌ బాబూ ..ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను, తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజలని గెలిపించటానికే అని నిరూపించిన నిన్ను చూస్తుంటే ఒక అన్నగా గర్వంగా వుంది. నువ్వు ‘గేమ్‌చేంజర్‌’వి మాత్రమే కాదు, ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’వి కూడా అని అందరూ నిన్ను కొనియాడుతుంటే నా హృదయం ఉప్పొంగుతోంది.

- చిరంజీవి

హృదయపూర్వక శుభాకాంక్షలు

చిరస్మరణీయమైన విజయం అందుకున్న పవన్‌ కల్యాణ్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రజలకు నిరంతరం సేవ చేయాలన్న మీ కృషి, అంకితభావం, నిబద్ధత హృదయాన్ని హత్తుకునేలా ఉంటాయి. మీ కొత్త రాజకీయ ప్రయాణానికి అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను.

- అల్లుఅర్జున్‌

మీ గెలుపు స్ఫూర్తిదాయకం

రీల్‌ లైఫ్‌లోనూ.. రియల్‌ లైఫ్‌లోనూ అసలు సిసలు హీరో అయిన పవన్‌ కల్యాణ్‌కు అభినందనలు. ఈ గెలుపు కోసం మీరు చేసిన పోరాటం ఎంతో స్ఫూర్తిదాయకంగా.. ఓ పాఠంలా ఉంది. మీరు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలి.

- నాని

చరిత్రను సృష్టించారు

ఓ అభిమానిగా.. ఓ సోదరుడిగా నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఎన్నికల్లో చరిత్రను సృష్టించారు. మీ సత్తాతో కూటమిని నిలబెట్టారు. ఈ విజయానికి మీరు అర్హులు. మీరెప్పటికీ మా పవర్‌స్టారే.

- నితిన్‌

తగిన ప్రతిఫలం దక్కింది

శుభాకాంక్షలు పవన్‌ కల్యాణ్‌. మీ కృషికి, అంకితభావానికి తగిన ప్రతిఫలం దక్కింది.

- కాజల్‌ అగర్వాల్‌

Updated Date - Jun 05 , 2024 | 04:31 AM

Advertising
Advertising