Pawan Kalyan: చిటికెన వేలంత రావణుడు లాంటి జగన్ ఎంత.. పవన్ కళ్యాణ్ ధ్వజం
ABN, Publish Date - Mar 17 , 2024 | 06:23 PM
చిలకలూరిపేటలోని బొప్పూడిలో నిర్వహించిన ప్రజాగళం సభలో (Praja Galam Event) ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై (CM YS Jagan) జనసేనాధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ ఒక సారా వ్యాపారి అని.. ఐదేళ్లలో లక్షా 20 వేల కోట్ల వ్యాపారం జరిగితే, 84 వేల కోట్లు మాత్రమేనని అండర్ కోట్ చేశారని అన్నారు. పన్ను ఎగవేసి.. సొమ్ము దాచుకున్నారని ఆరోపించారు.
చిలకలూరిపేటలోని బొప్పూడిలో నిర్వహించిన ప్రజాగళం సభలో (Praja Galam Event) ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై (CM YS Jagan) జనసేనాధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ ఒక సారా వ్యాపారి అని.. ఐదేళ్లలో లక్షా 20 వేల కోట్ల వ్యాపారం జరిగితే, 84 వేల కోట్లు మాత్రమేనని అండర్ కోట్ చేశారని అన్నారు. పన్ను ఎగవేసి.. సొమ్ము దాచుకున్నారని ఆరోపించారు. ‘డిజిటల్ భారత్’ (Digital Bharat) అని ప్రధాని మోదీ దేశాన్ని ముందుకు తీసుకెళ్తుంటే.. వైసీపీ మాత్రం ‘క్యాష్’ అంటూ రాష్ట్రాన్ని నాశనం చేస్తోందని నిప్పులు చెరిగారు. మద్యం, ఇసుకలో కూడా అవినీతి అక్రమాలకు పాల్పడుతోందని మండిపడ్డారు.
వైఎస్ వివేకాను (YS Viveka Case) హత్య చేయించిన ప్రభుత్వం ఇదని పవన్ కళ్యాణ్ ఆరోపణలు గుప్పించారు. చంద్రబాబు నాయుడిని కూడా అనేక ఇబ్బందులు పెట్టిందని, ఈ ప్రభుత్వం పోవాలని ఆయన పిలుపునిచ్చారు. జగన్ తనని తాను ‘రావణాసురుడు’ అని అనుకుంటున్నాడని.. తన చుట్టూ బంగారంతో కట్టిన ప్రాకారం ఉందని భావిస్తున్నాడని.. అయితే నారచీర కట్టుకొని శ్రీరాముడు బాణంతో రావణుడ్ని చంపేశాడని గుర్తు చేశారు. అన్ని ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలను ఈ ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందని.. రాష్ట్రాన్ని రావణకాష్టం చేశారని తూర్పారపట్టారు. అభివృద్ధి లేక ఏపీ అప్పులతో నలిగిపోతోందని.. దాష్టీకాలతో ఇబ్బందులు పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సందర్భంలో ఆంధ్రకు ప్రధాని మోదీ (PM Modi) రాక ఆనందాన్ని కలిగిందని పేర్కొన్నారు.
ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన ప్రధాని మోదీకి ఏపీ ప్రజల తరఫు నుంచి.. అలాగే టీడీపీ, జనసేన పార్టీల నుంచి పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. గతంలో వెంకటేశ్వరుని సాక్షిగా పొత్తు మొదలైతే.. ఇప్పడు బెజవాడ దుర్గమ్మ సాక్షిగా పొత్తు ఏర్పడిందని అన్నారు. 2014లో తిరుపతి బాలాజీ ఆశీస్సులతో ఎన్డీఏ విజయం సాధించి, ప్రభుత్వం స్థాపించిందని.. 2024లో దుర్గమ్మ ఆసీస్సులతో ఎన్డీఏ అంతకన్నా ఘనవిజయం సాధిస్తుందని నమ్మకం వెలిబుచ్చారు. ప్రధానిగా మోదీ హ్యాట్రిక్ కొట్టబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. అయోధ్యకు రాముడ్ని తెచ్చి మోదీ ఇక్కడున్నారని.. చిటికెన వేలంత రావణుడు లాంటి జగన్ ఎంత అని దుయ్యబట్టారు. ధర్మందే గెలుపు, కూటమిదే పీఠం అని పవన్ తన ప్రసంగాన్ని ముగించారు.
ఇదిలావుండగా.. పవన్ ప్రసంగిస్తున్న సమయంలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సభలో జనం కిక్కిరిసిపోవడంతో కొందరు ఫోకస్ లైట్ల టవర్‌పైకి ఎక్కగా.. ప్రధాని మోదీ మైక్ అందుకొని వారిని కిందకు దిగాలని విజ్ఞప్తి చేశారు. అటు.. బారికేడ్లు ఎక్కిన అభిమానుల్ని కూడా కిందకి దిగమని కోరారు. పోలీసులు వారిని కిందకు దించాలని, అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దీంతో.. అందరూ కిందకు దిగొచ్చారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Mar 17 , 2024 | 06:23 PM