Pawan Kalyan: పదేళ్ల నిరీక్షణకు ఫలితం.. అసెంబ్లీ గేటు తాకనీయబోమన్నవారికి అదిరిపోయే రిప్లై..
ABN, Publish Date - Jun 12 , 2024 | 10:20 AM
కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలంటారు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అలాగే చేశారు. తొలిసారిగా ఎమ్మెల్యేగా విజయం సాధించిన పవన్.. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనకు డిప్యూటీ సీఎం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేగా అసెంబ్లీ గేటు తాకనీయబోమన్న వారికి ఓ రేంజ్ సమాధానమిది. ఏకంగా డిప్యూటీ సీఎంగానే అసెంబ్లీలో పవన్ అడుగు పెట్టబోతున్నారు. వాస్తవానికి ఆయన విజయం కూడా ఓ అద్భుతమే.
అమరావతి: కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలంటారు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అదే చేశారు. తొలిసారిగా ఎమ్మెల్యేగా విజయం సాధించిన పవన్.. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనకు డిప్యూటీ సీఎం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేగా అసెంబ్లీ గేటు తాకనీయబోమన్న వారికి ఓ రేంజ్ సమాధానమిది. ఏకంగా డిప్యూటీ సీఎంగానే అసెంబ్లీలో పవన్ అడుగు పెట్టబోతున్నారు. వాస్తవానికి ఆయన విజయం కూడా ఓ అద్భుతమే. 70 వేలకు పైగా మెజారిటీతో పిఠాపురం నుంచి విజయం సాధించారు. ఇంత మెజారిటీ అంటే మాటలు కాదు. పిఠాపురంలో పవన్ గెలవరంటూ వైసీపీ నేతలు నానా రచ్చ చేశారు. తను మాత్రమే కాదు.. తన పార్టీ తరుఫున బరిలో నిలిచిన వారందరినీ గెలిపించుకున్నారు. పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న పవన్‌ను ఏపీ ప్రజలు పూర్తిగా నమ్మారు. సినిమాల ద్వారా వచ్చిన డబ్బును రైతులకు సాయంగా ఇచ్చారు. 2019లో రెండు చోట్ల పోటీ చేసి ఓడినా కూడా పవన్ ఏపీని వీడలేదు. ప్రజలకు ఎప్పటికప్పుడు అండగా నిలిచారు. టీడీపీ అధినేత చంద్రబాబు జైలు పాలైనప్పుడు ఆ పార్టీకి అండగా నిలిచారు.
ఇప్పుడు చంద్రబాబు వంతు. తనకు కష్టకాలంలో అండగా నిలిచిన పవన్ కల్యాణ్ స్థాయిని తగ్గించే ప్రసక్తే లేదని.. అందుకే ఆయనకు మాత్రమే డిప్యూటీ సీఎం పదవి కేటాయించాలని చంద్రబాబు ఫిక్స్ అయినట్టు రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇప్పటికే చంద్రబాబు జనసేనకు ముచ్చటగా మూడు మంత్రి పదవులను కేటాయించారు. ఇక డిప్యూటీ సీఎం పదవితో పాటు హోం మంత్రి కూడా పవన్ కళ్యాణ్‌కే ఇవ్వనున్నట్టు జోరుగా చర్చ నడుస్తోంది. ఈ విషయమై క్లారిటీ అయితే లేదనే చెప్పాలి. పవన్ డిప్యూటీ సీఎం అనే టాక్ జోరుగా నడుస్తుండటంతో జన సైనికుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. జగన్ ప్రభుత్వంలో మంత్రి పదవుల మాదిరిగా డిప్యూటీ సీఎంలను సైతం పలువురికి పంచారు. చంద్రబాబు మాత్రం పవన్ ఒక్కరికే డిప్యూటీ సీఎం ఇస్తున్నారని టాక్. దీంతో పవన్ ఒక్కరికే డిప్యూటీ సీఎం పదవి ఇస్తున్నారని.. ఇది మా నాయకుడి రేంజ్ అంటూ జనసైనికులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
Updated Date - Jun 12 , 2024 | 12:03 PM