ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Pawan Kalyan: చేజారిన ఆ ‘ఒక్క’ సీటుపై పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫోకస్

ABN, Publish Date - Mar 20 , 2024 | 06:52 PM

జనసేన పార్టీకి (Janasena Party), రాజోలు నియోజకవర్గానికి (Razole Constituency) ఒక ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పుకోవడంలో సందేహం లేదు. ఎందుకంటే.. 2019 ఎన్నికల్లో ఆ ఒక్క అసెంబ్లీ స్థానంలోనే జనసేన గెలుపొందింది. పవన్ కళ్యాణ్‌పై (Pawan Kalyan) ఉన్న నమ్మకంతో.. రాజోలు నియోజకవర్గ ప్రజలు ఆ స్థానం నుంచి జనసేన తరఫున పోటీ చేసిన రాపాక వరప్రసాద్‌ని గెలిపించారు.

జనసేన పార్టీకి (Janasena Party), రాజోలు నియోజకవర్గానికి (Razole Constituency) ఒక ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పుకోవడంలో సందేహం లేదు. ఎందుకంటే.. 2019 ఎన్నికల్లో ఆ ఒక్క అసెంబ్లీ స్థానంలోనే జనసేన గెలుపొందింది. పవన్ కళ్యాణ్‌పై (Pawan Kalyan) ఉన్న నమ్మకంతో.. రాజోలు నియోజకవర్గ ప్రజలు ఆ స్థానం నుంచి జనసేన తరఫున పోటీ చేసిన రాపాక వరప్రసాద్‌ని గెలిపించారు. కానీ.. ఆయన క్రమంగా జనసేనకు దూరమవుతూ వైసీపీకి (YCP) దగ్గరయ్యారు. ఈ దెబ్బకు.. జనసేన చేతి నుంచి ఆ ఒక్క సీటు కూడా చేజారిపోయింది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ రాజోలు స్థానంపై ప్రత్యేక దృష్టి సారించారు. 2024 ఎన్నికల్లో మరోసారి ఆ స్థానాన్ని దక్కించుకోవాలని ఆయన భావిస్తున్నారు. ఈ క్రమంలోనే.. రాజోలు సీటును రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దేవ వరప్రసాద్ కేటాయిస్తున్నట్లు జనసేన ప్రకటించింది.


ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాజోలు నియోజకవర్గ నాయకులతో పాటు దేవ వరప్రసాద్‌తో భేటీ అయ్యారు. ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి.. ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్న విషయంపై చర్చించినట్లు తెలిసింది. ఈ సందర్భంగానే.. రాజోలు నియోజకవర్గంలో జనసేన జెండా మళ్ళీ ఎగురవేయాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో జనసేనను గెలిపించిన ప్రజలు.. మరోసారి ఆదరించాలని కోరారు. ప్రణాళిక బద్దంగా నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి పని చేయాలని సూచించారు. అధికార వైసీపీ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతూ ముందుకు సాగాలని దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఈ రాజోలు స్థానం నుంచి వైసీపీ తరఫున మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు గొల్లపల్లి సూర్యారావు బరిలోకి దిగుతున్నారు. దీంతో.. ఈ పోటీలో ఎవరు గెలుస్తారన్నది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 20 , 2024 | 06:52 PM

Advertising
Advertising