Pawan Kalyan: న్యూ జల్‌పాయ్‌గురి రైలు ప్రమాదం దిగ్భ్రాంతికి గురి చేసింది: డిప్యూటీ సీఎం పవన్
ABN, Publish Date - Jun 17 , 2024 | 08:42 PM
పశ్చిమ బెంగాల్ రాష్ట్రం న్యూ జల్‌పాయ్‌గురి(New Jalpaiguri) రైలు ప్రమాదం(Train Accident) తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) తెలిపారు. కాంచనజంగ రైలును గూడ్స్ ఢీకొట్టిన ప్రమాదంలో 15మంది ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమన్నారు.
అమరావతి: పశ్చిమ బెంగాల్ రాష్ట్రం న్యూ జల్‌పాయ్‌గురి(New Jalpaiguri) రైలు ప్రమాదం(Train Accident) తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) తెలిపారు. కాంచనజంగ రైలును గూడ్స్ ఢీకొట్టిన ప్రమాదంలో 15మంది ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమన్నారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ప్రమాదంలో 60మందికి పైగా గాయపడడంతో వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని రైల్వే మంత్రిత్వ శాఖను కోరారు.
ప్రమాదాల నివారణకు ఉద్దేశించిన "కవచ్" సాంకేతికతను సమర్థంగా వినియోగించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రమాదాలకి తావు లేని ప్రయాణాన్ని ప్రజలకు అందించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. ఈ ఘటనపై ఇప్పటికే రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ సహా పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి:
MP Purandeswari: ప్రజల సొమ్ముతో విలాస భవనాలు నిర్మించారు: ఎంపీ పురందేశ్వరి
Updated Date - Jun 17 , 2024 | 08:48 PM