Pawan Kalyan: ఏపీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ కింగ్ మేకర్ కానున్నారా..?
ABN, Publish Date - May 04 , 2024 | 04:48 PM
21 స్థానాల్లో అభ్యర్థులను దింపిన జనసేనాని ఈ ఎన్నికల్లో సంకీర్ణ ప్రభుత్వం నిర్మాతగా.. కింగ్ మేకర్‌గా వ్యవహరిస్తారా? అని పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించగా.. చట్టసభల్లో ప్రజల గొంతుకగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో (AP Elections) జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సంకీర్ణ ప్రభుత్వం నిర్మాతగా ఉంటారా..? కింగ్ మేకర్ అవుతారా..? ఇప్పుడిదే రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న ప్రధాన చర్చ. ఇదే ప్రశ్నకు ఓ జాతీయ మీడియా నిర్వహించిన ఇంటర్వ్యూలో క్లియర్ కట్‌గా సేనాని సమాధానమిచ్చారు. చట్ట సభల్లో ప్రజల గొంతుకగా వ్యవహరిస్తానని స్పష్టం చేశారు. ఇక ఇదే ఇంటర్వ్యూలో పలు ప్రశ్నలకు లాజికల్‌గా, ఇంట్రెస్టింగ్‌గా సమాధానాలిచ్చారు పవన్. గత ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలతో జత కడితే.. ఈ సారి నరేంద్రమోదీతో జతకట్టారని.. అంటే నాడు లెఫ్ట్ నుంచి నేడు రైటుకు వచ్చారనుకోవచ్చా..? అనే ప్రశ్న ఎదురైంది. దీనికి పవన్ బదులిస్తూ.. అబ్బే అదేం లేదు.. ఈ ఎన్నికల్లో చాలా బ్యాలెన్స్‌గా వెళ్తున్నామన్నారు. 2014లో మోదీతో ఉన్నామని ఈ సందర్బంగా పవన్ గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ పద్దతి లేకుండా ఆంధ్రప్రదేశ్‌ను విభజించిందని.. దీంతో రాష్ట్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొందని పవన్ చెప్పుకొచ్చారు.
ఎందుకు ఇంత తక్కువ..?
కోస్తా ప్రాంతంలో కాపు సామాజిక వర్గంలో ఓట్లు చాలా బలంగా ఉన్నాయని.. అలాంటిప్పుడు కేవలం 21 సీట్లలోనే జనసేన ఎందుకు పోటీ చేస్తోంది..? అనే ప్రశ్నకు చాలా లాజిక్‌గా పవన్ మాట్లాడారు. కులమనేది ఎప్పుడు తన మైండ్‌లో కానీ మనస్సులో కానీ లేదన్నారు. 10 ఏళ్ల క్రితమే.. కులాన్ని అంతగా పట్టించుకోలేదని తెలిపారు. ‘మనమంతా ఏదో రాష్ట్రంలో.. ఏదో ప్రాంతంలో.. ఏదో భాషలు కలిగి ఉన్న ప్రాంతాల్లో జన్మిస్తాం.. కానీ మనం ఎలా ముందుకు వెళ్లాలన్నదే మన ముందు ఉంటుంది. ఒక కులం మీదే రాజకీయాల్లో వెళ్లడం అనేది సాధ్యం కాని పని’ అని పవన్ క్లియర్ కట్‌గా బదులిచ్చారు.
Read National News and Telugu News
Updated Date - May 04 , 2024 | 06:10 PM