ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Pawan Kalyan : మీరు కష్టపడే విధానం స్ఫూర్తిదాయకం

ABN, Publish Date - Sep 06 , 2024 | 04:15 AM

వరదల సమయంలో సీఎం చంద్రబాబు యుద్ధప్రాతిపదికన చేపట్టిన సహాయక చర్యలపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. ‘మీ మాటలతో మరింత ఉత్తేజాన్ని కలిగించినందుకు చంద్రబాబుకు ధన్యవాదాలు.

  • మీ మాటలు మరింత ఉత్తేజాన్ని కలిగించాయి

  • చంద్రబాబును కొనియాడిన డిప్యూటీ సీఎం పవన్‌

  • సూపర్‌ క్లోరినేషన్‌ చేపట్టాలి పారిశుధ్య పనులు

  • వేగవంతం చేయండి

  • డిప్యూటీ సీఎం ఆదేశాలు

  • వైరల్‌ జ్వరంలోనూ అధికారులతో సమీక్ష

అమరావతి, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): వరదల సమయంలో సీఎం చంద్రబాబు యుద్ధప్రాతిపదికన చేపట్టిన సహాయక చర్యలపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. ‘మీ మాటలతో మరింత ఉత్తేజాన్ని కలిగించినందుకు చంద్రబాబుకు ధన్యవాదాలు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మరోవైపు ప్రకృతి వైపరీత్యం, వీటి నడుమ మీ పాలనా దక్షత, విధి నిర్వహణలో మీరు కష్టపడే విధానం స్ఫూర్తిదాయకం, అభినందనీయం. ఇలాంటి సమయంలో ప్రజలను ఆదుకోవడం మన ప్రభుత్వంతో పాటు వ్యక్తిగత స్థాయిలో నా కనీస బాధ్యతగా భావిస్తున్నాను. సహాయ కార్యక్రమాల్లో పంచాయతీరాజ్‌, ఇతర శాఖలు యుద్ధప్రాతిపదికన పాల్గొంటున్నాయి. త్వరలోనే మనం ఈ సంక్షోభం నుంచి బయటపడతామని ఆశిస్తున్నాను’ అంటూ పవన్‌ ఆకాంక్షించారు.

సూపర్‌ క్లోరినేషన్‌ చేపట్టాలి : పవన్‌

వరద నీరు తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో పారిశుధ్య పనులు వేగవంతం చేయాలని, సూపర్‌ క్లోరినేషన్‌ చేపట్టాలని పవన్‌ కల్యాణ్‌ అధికారులను ఆదేశించారు. ఓవైపు వైరల్‌ జ్వరం, తీవ్రమైన దగ్గుతో బాధపడుతూనే గురువారం ఆయన పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో వరద బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు.కాగా, పవన్‌ కుటుంబ సభ్యులు కూడా వైరల్‌ జ్వరాలతో బాధపడుతున్నందున వైద్యుల సూచనలు తీసుకుంటున్నారు.

Updated Date - Sep 06 , 2024 | 04:15 AM

Advertising
Advertising