ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Pawan Kalyan: మంత్రిగా పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం.. అనంతరం ఆసక్తికర సీన్..

ABN, Publish Date - Jun 12 , 2024 | 11:50 AM

కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను.. అంటూ మంత్రిగా పవన్ తన ప్రమాణ స్వీకారాన్ని నిర్వహించారు. పవన్‌తో గవర్నర్ అబ్దుల్ నజీర్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పవన్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారానంతరం వేదికపై ఆశీనులైన అతిథులందరికీ నమస్కరించారు.

అమరావతి: కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను.. అంటూ మంత్రిగా పవన్ తన ప్రమాణ స్వీకారాన్ని నిర్వహించారు. పవన్‌తో గవర్నర్ అబ్దుల్ నజీర్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పవన్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారానంతరం వేదికపై ఆశీనులైన అతిథులందరికీ నమస్కరించారు. ఇక తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి వద్దకు వెళ్లి కాళ్లకు నమస్కరించడం ఆసక్తికరంగా అనిపించింది. పవన్‌ను చిరు ప్రేమగా దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకున్నారు. ఈ దృశ్యం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది.


ఎమ్మెల్యేగా అసెంబ్లీ గేటు తాకనీయబోమన్న వారికి ఓ రేంజ్ సమాధానం అయితే పవన్ చెప్పారు. ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఫిక్స్ అయినట్టు పక్కా సమాచారం. వాస్తవానికి ఆయన విజయం కూడా ఓ అద్భుతమే. 70 వేలకు పైగా మెజారిటీతో పిఠాపురం నుంచి విజయం సాధించారు. ఇంత మెజారిటీ అంటే మాటలు కాదు. పిఠాపురంలో పవన్ గెలవరంటూ వైసీపీ నేతలు నానా రచ్చ చేశారు. తను మాత్రమే కాదు.. తన పార్టీ తరుఫున బరిలో నిలిచిన వారందరినీ గెలిపించుకున్నారు. ఇక ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ.. కేంద్ర మంత్రులు అమిత్‌షా, జేపీ నడ్డా, నితిన్‌ గడ్కరీ మహారాష్ట్ర సీఎం ఏక్‌నాళథ్‌ షిండే, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ సీజేఐ ఎన్వీ రమణ తదితరులు హాజరయ్యారు. ఇక ఇండస్ట్రీ నుంచి ప్రముఖులు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు.

Updated Date - Jun 12 , 2024 | 11:50 AM

Advertising
Advertising