CM Chandrababu: పింఛన్ పథకానికి పేరు మార్పు
ABN, Publish Date - Jun 14 , 2024 | 09:54 AM
పింఛన్ పథకానికి చంద్రబాబు ప్రభుత్వం పేరు మార్చింది. పింఛన్ పథకాన్ని ఎన్టీఆర్ భరోసాగా పేరు మార్చేసింది. ఈ పెన్షన్ల పెంపు అనేది వృద్ధులు, వితంతువులు, చేనేత, కల్లుగీత, మత్స్యకార, ఒంటరి మహిళలు, డప్పు కళాకారులు, ట్రాన్స్ జెండర్లు వంటి వారికి వర్తించనుంది. రూ.3 వేలు ఉన్న పెన్షన్‌ను రూ.4 వేలు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దివ్యాంగుల పెన్షన్ అయితే రూ.3 వేల నుంచి ఏకంగా రూ.6 వేలకు పెంచింది.
అమరావతి: పింఛన్ పథకానికి చంద్రబాబు ప్రభుత్వం పేరు మార్చింది. పింఛన్ పథకాన్ని ఎన్టీఆర్ భరోసాగా పేరు మార్చేసింది. ఈ పెన్షన్ల పెంపు అనేది వృద్ధులు, వితంతువులు, చేనేత, కల్లుగీత, మత్స్యకార, ఒంటరి మహిళలు, డప్పు కళాకారులు, ట్రాన్స్ జెండర్లు వంటి వారికి వర్తించనుంది. రూ.3 వేలు ఉన్న పెన్షన్‌ను రూ.4 వేలు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దివ్యాంగుల పెన్షన్ అయితే రూ.3 వేల నుంచి ఏకంగా రూ.6 వేలకు పెంచింది. పూర్తిస్థాయి దివ్యాంగుల పెన్షన్‌ను రూ.5 వేల నుంచి రూ.15వేలకు పెంచడం జరిగింది. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడేవారికి రూ.10వేలు పెన్షన్ అందించనుంది.
ఏపీ సీఎంగా అలా బాధ్యతలు చేపట్టారో లేదో.. ఇలా నారా చంద్రబాబు నాయుడు సంస్కరణలు మొదలు పెట్టేశారు. ఏపీలో చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. మొత్తానికి ఏపీకి మంచి రోజులు అయితే వచ్చేశాయని అర్థమవుతోంది. ఉద్యోగాల కోసం కళ్లు కాయలు కాసేలా చూస్తున్న అభ్యర్థుల కోసం మెగా డీఎస్సీ ఫైలుపై తొలి సంతకం చేశారు. జగన్ ప్రభుత్వం అన్యాయంగా తీసుకొచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం చేశారు. ఇప్పుడు ముచ్చటగా మూడో సంతకం పెన్షన్ల పెంపుపై చేశారు. దీంతో పెన్షన్ దారుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
Updated Date - Jun 14 , 2024 | 10:53 AM