ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rajamahendravaram : పోలీసులపై దొంగనోట్ల ముఠా ఎటాక్‌

ABN, Publish Date - Dec 14 , 2024 | 05:09 AM

ముందు పోలీస్‌ వాహనం. వెనుక రెండు కార్లలో దొంగ నోట్ల ముఠా చేజింగ్‌. అనుకూలమైన టైం కోసం వెయిటింగ్‌.

  • రెండు కార్లలో 80 కిలోమీటర్ల చేజింగ్‌

  • పోలీసు వాహనం అడ్డగింత.. దాడి

  • వాహనంలోని నిందితుడిని ఎత్తుకుపోయిన వైనం రాజమహేంద్రవరంలో సినీ ఫక్కీలో ఘటన

  • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

రాజమహేంద్రవరం/సిటీ, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): ముందు పోలీస్‌ వాహనం. వెనుక రెండు కార్లలో దొంగ నోట్ల ముఠా చేజింగ్‌. అనుకూలమైన టైం కోసం వెయిటింగ్‌. 80 కిలో మీటర్లు దాటాక ఒక్కసారిగా ముందుకు వచ్చి పోలీస్‌ వాహనం అడ్డగింత. పోలీసులపై ఎటాక్‌ చేసి వారి వాహనంలో ఉన్న తమ సభ్యుడిని ఎత్తుకుపోయిన ముఠా.. ఇదేదో సినిమాలో సీన్‌ కాదు. రియల్‌గా రాజమహేంద్రవరంలో జరిగింది. గురువారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం పోలీసులు తమ పరిధిలోని ఓ దొంగనోట్ల కేసులో ప్రధాన నిందితుడు పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఉన్నట్లు గుర్తించారు. దీంతో గురువారం రాత్రి భీమవరానికి వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ నిందితుడితో పాటు తమ వాహనంలో శ్రీకాకుళానికి బయలుదేరారు. రాజమహేంద్రవరం ఆర్‌టీసీ కాంప్లెక్స్‌ నుంచి వీఎల్‌పురం సెంటర్‌కు వచ్చాక రెండు కార్లలో వెంబడించి వచ్చిన దొంగ నోట్ల ముఠా సభ్యులు పోలీసు వాహనాన్ని అడ్డగించారు. పోలీసులపై దాడి చేసి నిందితుడ్ని విడిపించి వారి వాహనాల్లో తీసుకెళ్లిపోయారు. వెంటనే ఆ పోలీసులు 100కు కాల్‌ చేసి పోలీసులకు సమాచారం అందించారు. దాంతో బొమ్మూరు, ప్రకాశ్‌నగర్‌ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.


  • స్థానికంగా సంచలనం..

అర్ధరాత్రి దొంగనోట్ల ముఠా పోలీసులపై దాడి చేసి వారి అదుపులో నిందితుడ్ని విడిపించుకుపోవడం స్థానికంగా తీవ్ర సంచలనం రేకెత్తించింది. ఘటనపై తొమ్మిది సెక్షన్ల కింద ప్రకాశ్‌ నగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీకాకుళం పోలీసుల వాహనం వెనుక వచ్చిన కార్ల వివరాల కోసం సీసీ ఫుటేజీలు పరిశీస్తున్నారు. ముఠాలో ఒకరిని రక్షించడం కోసం ఆ సభ్యులు ఇంత సాహసం చేశారంటే అదుపులోకి తీసుకున్న వ్యక్తే ఆ ముఠా డాన్‌ అయ్యి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - Dec 14 , 2024 | 05:09 AM