ABN vs Sakshi: సాక్షిపై కేసు నమోదు చేసిన సైబర్ క్రైం పోలీసులు..
ABN, Publish Date - Oct 19 , 2024 | 05:55 PM
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మానసపుత్రిక, రోత మీడియా 'సాక్షి' అనైతిక పనులపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. కంటెంట్ చోరీ చేసిన సాక్షి పై విజయవాడ సైబర్ క్రైం పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు.
హైదరాబాద్: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మానసపుత్రిక, రోత మీడియా 'సాక్షి' అనైతిక పనులపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. కంటెంట్ చోరీ చేసిన సాక్షి పై విజయవాడ సైబర్ క్రైం పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజయవాడ సిటీ పోలీసు కమిషనర్ రాజశేఖర్ బాబు చర్యలు తీసుకున్నారు. ఆయన ఆదేశాల మేరకు సైబర్ క్రైం ఇన్‌స్పెక్టర్ గుణరామ్ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి సంబంధించిన కంటెంట్ చోరీ పై తగిన ఆధారాలు సేకరించి, సాక్షిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సైబర్ క్రైం పోలీసులు సిద్ధమవుతున్నారు. కోట్ల మంది తెలుగు ప్రజల అభిమానాన్ని చూరగొన్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వెబ్ సైట్‌తో పాటు, పలు యాప్‌ల కంటెంట్‌ను సాక్షి చోరీ చేసి, ట్రాఫిక్ ను పెంచుకునేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే.
నీచపు పనులు..
ప్రపంచంలో తెలుగువారు విశేషంగా అభిమానించి, ఆదరించే ఎబీఎన్ ఆంధ్రజ్యోతి వెబ్ సైట్ కు అత్యధిక ప్రజాదరణ ఉంది. వెబ్ సైట్ వీక్షణల సంఖ్య చాలా ఎక్కువ. ఏబీఎన్‌కు వచ్చే ట్రాఫిక్‌ను తమ వైపునకు మళ్లించుకునేందుకు తద్వారా ఏబీఎన్‌కు నెలకు రూ.50 లక్షల మేర ఆదాయాన్ని గండి కొట్టేందుకు సాక్షి ప్రయత్నించింది. ఈ విషయాన్ని వెంటనే గుర్తించిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యం తగిన చర్యలు చేపట్టింది. ఆంధ్రజ్యోతి వెబ్ సైట్‌ను క్లిక్ చేస్తే సాక్షిలోకి వెళ్లి చదివేలా లింక్ లు కలిపారు. ఈ అంశంపై కంటెంట్ చోరీ పేరుతో ఏబీఎన్ వరుస కథనాలను ప్రసారం చేసింది. ఇలాంటి నీచపు పనులే కాకుండా ఏబీఎన్ లింక్‌లను తొలగించి సాక్షి తోక ముడిచింది. కంటెంట్ చోరీకి పాల్పడిన సాక్షి బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆంధ్రజ్యోతి వీక్షకులు డిమాండ్ చేశారు.
దీంతో సాక్షి యాజమాన్యం కంటెంట్ చోరీ లింక్ లను తొలగించింది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యం అన్ని సాక్ష్యాలను సేకరించి కేంద్రంలోని హోంమంత్రిత్వ శాఖ, సమాచార ప్రసార శాఖతో పాటు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విజయవాడ ఆంధ్రజ్యోతి బ్రాంచి మేనేజర్ వేమూరి మురళి , విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబును కలిసి శుక్రవారం సాయంత్రం కంప్లైంట్ చేశారు.
ఈ ఫిర్యాదు అనంతరం పోలీసులు ప్రాథమిక ఆధారాలను పరిశీలించి, కేసు నమోదు చేశారు. సైబర్ క్రైం పోలీసులు BNSలోని 318(4), 319(2), తో పాటు, ఐటీ చట్టంలోని 66, 66సి, 66డి, సెక్షన్ల కింద సాక్షిపై కేసు నమోదు చేశారు. ప్రాథమిక దర్యాప్తు జరిపి, తగిన ఆధారాలు సేకరించి చర్యలు చేపడతామని విజయవాడ సైబర్ క్రైం పోలీసులు తెలిపారు. సాక్షి అనైతిక చర్యలను కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఖండించింది. వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. గతంలోనూ కొందరు ఏబీఎన్ ప్రీక్వెన్సీని హ్యాక్ చేశారు. దీనిపై అప్పట్లో ఇస్రోతో పాటు, కేంద్ర హోంమంత్రిశాఖకు ఏబీఎన్ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. ఈ అంశంపై ఇస్రో దర్యాప్తు చేసి హ్యకింగ్ నిజమేనని తేల్చింది.
Secunderabad: నిర్మానుష్యంగా సికింద్రాబాద్.. కొనసాగుతున్న బంద్
ఈ వార్తలు కూడా చదవండి:
Hyderabad: గబ్బు రేపుతున్న హైదరాబాద్ పబ్బులు..
TG News: ముగ్గురు యువకుల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు చూస్తే..
TG News: ప్రేమించిన యువతి దూరం పెట్టడంతో సహించలేని ఓ యువకుడు ఏం చేశాడంటే
Updated Date - Oct 19 , 2024 | 05:56 PM