ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

లోకేశ్‌కు రుణపడి ఉంటాం!

ABN, Publish Date - Oct 06 , 2024 | 05:13 AM

14 రోజుల పసికందు.. ప్లేట్‌లెట్లు పడిపోయి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లాడు. ఆ తల్లిదండ్రులు ఉన్న కొంచెం డబ్బులు ఊర్లోని ఆస్పత్రిలో ఖర్చు చేశారు. దేవుడా.. అంటూ విజయవాడలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు.

  • పసికందు ప్రాణం కాపాడిన ప్రజాదర్బార్‌

  • లోకేశ్‌ చొరవతో మెరుగైన వైద్యం

  • యువనేతకు కృతజ్ఞతలు తెలిపిన తల్లిదండ్రులు

జగ్గయ్యపేట, అక్టోబరు 5: 14 రోజుల పసికందు.. ప్లేట్‌లెట్లు పడిపోయి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లాడు. ఆ తల్లిదండ్రులు ఉన్న కొంచెం డబ్బులు ఊర్లోని ఆస్పత్రిలో ఖర్చు చేశారు. దేవుడా.. అంటూ విజయవాడలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే భారీ ఖర్చుతో వైద్యం చేయించలేని దయనీయ స్థితి ఒకవైపు, కన్నబిడ్డకు ముంచుకొస్తున్న మృత్యువు మరోవైపు. సరిగ్గా ఎటూ పాలుపోని ఆ సమయంలో మంత్రి నారా లోకేశ్‌ ఆ తల్లిదండ్రులకు అండగా నిలిచారు. క్షణాల్లో స్పందించి.. బిడ్డను ప్రాణాలు నిలిచేలా చేశారు. దీంతో ‘మీరు చేసిన సాయం మర్చిపోలేం. జన్మజ జన్మజన్మలకు రుణపడి ఉంటాం’ అంటూ తల్లిదండ్రులు మంత్రి లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

జగ్గయ్యపేటలోని సత్యనారాయణపురానికి చెందిన గిరిజన కుటుంబానికి చెందిన ప్రైవేటు చిరుద్యోగి చదల మహేశ్‌ తన బిడ్డ ప్రాణాలను మంత్రి లోకేశ్‌ నిలిపిన వైనాన్ని మీడియాకు వివరించారు. మహేష్‌ భార్య లక్ష్మీ సెప్టెంబరు 14న రెండో సంతానంగా మగ శిశువును ప్రసవించింది. బిడ్డ 4 కేజీల బరువుతో ఆరోగ్యంగా జన్మించాడు. అయితే త ర్వాత 14 రోజులకు బాబు రాత్రిళ్లు ఏడుస్తూ ఉండటం, పాలు తాగకపోవటంతో పట్టణంలో ఒక చిన్నపిల్లల ఆస్పత్రికి, తర్వాత మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌కు తీసుకెళ్లగా రక్తకణాలు పడిపోయాయని వైద్యులు చెప్పారు. మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తీసుకెళ్లాలని సూచించారు.


అప్పటికప్పుడు విజయవాడ ఆంధ్రా ఆసుపత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమంగా ఉందని, చికిత్సకు భారీగా ఖర్చవుతుందని అక్కడి డాక్టర్లు చెప్పారు. అయితే అంత డబ్బు లేని నేపథ్యంలో న్యాయవాది, స్నేహితుడు మహేంద్ర ఇచ్చిన సూచనతో బాలుడి తండ్రి మహేశ్‌ గత నెల 27 అర్ధరాత్రి ఉండవల్లిలోని నారా లోకేష్‌ నివాసం వద్దకు వెళ్లి ఉదయం వరకు ఆయన కోసం వేచిచూశాడు. అప్పటికే ప్రజాదర్బార్‌కు 400 మంది తమ అర్జీలతో సిద్ధంగా ఉన్నారు.

అప్పుడు శిశువుకు ప్లేట్‌లెట్స్‌ మరింత తగ్గాయని ఆస్పత్రి నుంచి ఫోన్‌ రావటంలో తీవ్ర ఆందోళన చెందిన మహేశ్‌.. 5 నిమిషాల్లో తన బిడ్డ చనిపోతాడంటూ పరిస్థితిని మిగతా అర్జీదారులకు, భద్రతా సిబ్బందికి వివరించాడు. ఆ తర్వాత లోకేశ్‌ ఓఎ్‌సడీని, అక్కడ నుంచి మంత్రి లోకే్‌శను కలవడం వెంట వెంటనే జరిగిపోయాయి. ఆయన మొర విన్న మంత్రి లోకేశ్‌.. ఎంత ఖర్చైనా ఆ పసికందుకు చికిత్స చేయించమని వెంటనే కలెక్టర్‌, పీఎ్‌సకు ఆదేశాలు ఇచ్చారు. వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించడంతో శనివారం బాబు ఆరోగ్య పరిస్థితి కుదుట పడిందని ఆంధ్రజ్యోతికి చెప్పారు.

Updated Date - Oct 06 , 2024 | 05:13 AM