KA Paul: పవన్ రూ.500 కోట్లు తీసుకొని 21 సీట్లలకు సరెండర్ అయ్యాడు
ABN, Publish Date - Mar 18 , 2024 | 04:50 PM
Andhrapradesh: జనసేన అధినేత పవన్ రూ.500 కోట్లు తీసుకొని 21 సీట్లకి సరెండర్ అయ్యారని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ విమర్శలు గుప్పించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. 2014లో మోదీ మోసం చేశారని..ఇప్పుడు మోదీ మాట్లాడుతుంటే పవన్ చప్పట్లు కొడుతున్నారని మండిపడ్డారు. బుర్రలేని దద్దమ్మలు వైసీపీలో, టీడీపీలో చేరుతున్నారన్నారు. రాష్టాన్ని సర్వనాశనం చేసింది కాంగ్రెస్ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఒక కుటుంబంలో ఉన్నవారు మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అయితే ఇతరులకు అవకాశం ఇవ్వరా అని ప్రశ్నించారు.
విజయవాడ, మార్చి 18: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) రూ.500 కోట్లు తీసుకొని 21 సీట్లకి సరెండర్ అయ్యారని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ (Prajashanti Party leader KA Paul) విమర్శలు గుప్పించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. 2014లో మోదీ మోసం చేశారని..ఇప్పుడు మోదీ మాట్లాడుతుంటే పవన్ చప్పట్లు కొడుతున్నారని మండిపడ్డారు. బుర్రలేని దద్దమ్మలు వైసీపీలో (YSRCP), టీడీపీలో (TDP) చేరుతున్నారన్నారు. రాష్టాన్ని సర్వనాశనం చేసింది కాంగ్రెస్ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఒక కుటుంబంలో ఉన్నవారు మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అయితే ఇతరులకు అవకాశం ఇవ్వరా అని ప్రశ్నించారు. ఒక కుటుంబంలో ఒకరి ఎంపీ లేదా ఎమ్మెల్యే ఉండాలని కోర్ట్‌లో పిటిషన్ వేస్తానని అన్నారు. తనను వైజాగ్ ఎంపీని చేస్తే దేశాన్ని బాగు చేస్తానని.. లేకపోతే ప్రజలే నష్టపోతారన్నారు. కుల రాజకీయాలకు స్వస్తి పలకాలన్నారు. రెడ్డి కమ్మ కాపు రాజ్యాన్ని పాలించాలని రాజ్యాంగంలో రాసుందా అని నిలదీశారు. ‘‘అంబేద్కర్ పాలన రావాలి. పాల్ రావాలి పాలన బాగుండాలి’’ అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కేఏపాల్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
YSRCP: కోడ్ వచ్చినా ఆగని వైసీపీ అరాచకాలు
Congress: అబ్బే అది నేను కాదు.. రాహుల్ గాంధీ కామెంట్లపై అశోక్ చవాన్
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Mar 18 , 2024 | 04:56 PM