Big Twist: విచారణకు హాజరైన సీఐడీ రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్..
ABN, Publish Date - Nov 26 , 2024 | 12:47 PM
ప్రకాశం జిల్లా: ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణకు సీఐడి రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్ హాజరయ్యారు. ఆయనను ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ప్రశ్నిస్తున్నారు. 2021 మే 14న రఘురామకృష్ణం రాజు పుట్టన రోజునే ఆయనను హైదరాబాద్‌లో అక్రమంగా అరెస్టు చేశారు. అక్కడి నుంచి గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి తీసుకువచ్చి చిత్రహింసలకు గురిచేశారు.
ప్రకాశం జిల్లా: ఒంగోలు (Ongole) ఎస్పీ కార్యాలయంలో (SP Office) విచారణకు సీఐడి రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్ (Retired CID ASP Vijaypal) హాజరయ్యారు. ఆయనను ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ప్రశ్నిస్తున్నారు. డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు (Raghuramakrishnamraju)ను గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అక్రమంగా అరెస్టు చేయడంతో పాటు ఆయనపై పై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసులో అప్పుటి సీఐడి ఏఎస్పీ విజయపాల్ విచారణను ఎదుర్కొంటున్నారు. మంగళవారం విచారణకు హాజరయ్యారు. ఈ నెల 13న కూడా విజయ్ పాల్‌ను ఇక్కడే విచారణ జరిపారు. 50 ప్రశ్నలకు ఆయన ముక్తసరిగా సమాధానాలు ఇచ్చారు. ‘ఏమో తెలియదు.. గుర్తు లేదు.. మరిచిపోయా’ అంటూ సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి మరోసారి నోటీసులు జారీ చేసి ఈరోజు విచారిస్తున్నారు.
కాగా కేసు విచారణ నుంచి రక్షణ పొందేందుకు విజయ్ పాల్ హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు ఆశ్రయించినా ఆయనకు ముందస్తు బెయిల్ లభించలేదు. ఈ నేపథ్యంలో మంగళవారం ఒంగోలు ఎస్పీ ఎదుట విచారణకు హాజరయ్యారు. విజయ్ పాల్‌ను మొదటి నుంచి అరెస్టు చేయాలని పోలీసులు బావిస్తున్నా.. ఆయన కోర్టులను ఆశ్రయిస్తూ రక్షణ పొందుతూ వచ్చారు. ఈ క్రమంలో సోమవారం సుప్రీం కోర్టులో కూడా ముందస్తు బెయిల్‌పై విజయ్ పాల్‌కు చుక్కెదురైంది. కాగా ఈరోజు సాయంత్రం వరకు విజయ్ పాల్‌ను విచారించే అవకాశముంది. విచారణ సందర్బంగా సరైన సమాధానాలు చెప్పకపోతే.. ఖచ్చితంగా అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
2021 మే 14న రఘురామకృష్ణం రాజు పుట్టన రోజునే ఆయనను హైదరాబాద్‌లో అక్రమంగా అరెస్టు చేశారు. అక్కడి నుంచి గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి తీసుకువచ్చి చిత్రహింసలకు గురిచేశారు. దీనిపై తనకు న్యాయం చేయాలంటూ గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్‌లో రఘురామ ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కేసు విచారణ బాధ్యతలను ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్‌కు అప్పగించారు. ఈ నేపథ్యంలో మంగళవారం విజయ్ పాల్‌ను రెండోసారి విచారిస్తున్నారు. గతంలో విజయ్ పాల్ చెప్పిన సమాధానాలు ఎక్కడ పొంతన లేకపోవడంతో పోలీసులు మరోసారి విచారణ చేస్తున్నారు. విచారణ అనంతరం అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది.
ఈ వార్తలు కూడా చదవండి..
దెబ్బతిన్న హైదరాబాదీ బిర్యానీ బ్రాండ్ ఇమేజ్..
పర్యాటక రంగంలో 7 ప్రాజెక్టులపై ప్రతిపాదనలు
ఢిల్లీలో పవన్ కల్యాణ్ బిజీ బిజీ..
మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై కేసు నమోదు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Nov 26 , 2024 | 12:48 PM