ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ram Gopal Varma: సినీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ కేసు విచారణ...

ABN, Publish Date - Nov 25 , 2024 | 07:59 AM

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు రాంగోపాల్ వర్మ మార్ఫింగ్ చేశాడని ఒంగోలు, మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. మార్ఫింగ్ చేసిన ఫోటోలు ఎక్స్ లో పోస్టు చేశాడని టీడీపీ మండల కార్యదర్శి రామలింగం మద్దిపాడు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో విచారణకు రావాల్సిందిగా ఆర్జీవీకి పోలీసులు నోటీసులు ఇచ్చారు.

ప్రకాశం జిల్లా: ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం సినీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ (Film director Ramgopal Varma) కేసు విచారణ (Case Trail) జరగనుంది. ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని వర్మకు ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ (CI Srikanth) నోటీసు (Notice) ఇచ్చారు. కాగా ఈనెల 19న విచారణకు హాజరుకావాలని పోలీసులు వర్మకు నోటీసు ఇచ్చారు. అయితే తాను సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నానని, వారం రోజులు గడువు కావాలని కోరారు. ఆయన విజ్ఞప్తి మేరకు పోలీసులు వారం రోజులు గడువు ఇచ్చారు. దీంతో ఈ రోజు విచారణ జరగనుంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు మార్ఫింగ్ చేసి ఎక్స్ లో పోస్ట్ చేసిన కేసులో రాంగోపాల్ వర్మ విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.


కాగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు రాంగోపాల్ వర్మ మార్ఫింగ్ చేశాడని మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. మార్ఫింగ్ చేసిన ఫోటోలు ఎక్స్ లో పోస్టు చేశాడని టీడీపీ మండల కార్యదర్శి రామలింగం మద్దిపాడు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఈనెల 10న ఏడు సెక్షన్లతో రాంగోపాల్ వర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా తనపై నమోదైన కేసు కొట్టేయాలని వర్మ హైకోర్టు‌ను ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం ఆ పిటిషన్‌ను తిరస్కరించింది.


విచారణ వివరాలు..

కాగా సామాజిక మాధ్యమాలలో అనుచిత, అసభ్యకర పోస్టులు పెట్టిన దర్శకుడు రాంగోపాల్‌ వర్మకు ఏపీ హైకోర్టు ఝలక్‌ ఇచ్చింది. అరెస్ట్‌ నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. పోలీసులు అరెస్ట్‌ చేస్తారనే ఆందోళన ఉంటే బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసుకోవాలని సూచించింది. క్వాష్‌ పిటిషన్‌లో అరెస్ట్‌ నుంచి రక్షణ కల్పిస్తూ ఎలాంటి ఉత్తర్వులూ ఇవ్వలేమని తేల్చిచెప్పింది. పోలీసుల ముందు హాజరయ్యేందుకు మరికొంత సమయం ఇవ్వాలన్న రామ్‌గోపాల్‌ వర్మ తరఫు న్యాయవాది అభ్యర్థననూ తోసిపుచ్చింది. ఈ తరహా అభ్యర్థనను సంబంధిత స్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్‌ (ఎస్‌హెచ్‌వో) వద్ద చేసుకోవాలని, కోర్టు ఎలాంటి ఆదేశాలూ ఇవ్వలేదని పేర్కొంది. వ్యాజ్యంలో ప్రతివాదిగా ఉన్న ముత్తనపల్లి రామలింగయ్యకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్‌ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంతో రాంగోపాల్‌ వర్మ విచారణకు హాజరు కావడం అనివార్యమైంది.


ఈ వార్తలు కూడా చదవండి..

బీఆర్ఎస్ మహాధర్నా.. ముఖ్య అతిథిగా కేటీఆర్..

ఆ భేటీల మర్మమేమి...

అబద్ధాల్లో తగ్గేదేలే

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Nov 25 , 2024 | 08:00 AM