ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Gottipati Ravikumar: ఏ సీఎం చేయని పనులు జగన్ చేశారు.. మంత్రి గొట్టిపాటి ఫైర్

ABN, Publish Date - Oct 22 , 2024 | 12:13 PM

Andhrapradesh: గత ప్రభుత్వంలో శాంతి భద్రతలు పట్టించుకున్న దాఖలాలు లేవని... ఏ ముఖ్యమంత్రి చేయని దుర్మార్గపు పనులు గత ఐదేళ్లలో జగన్ చేశారని మంత్రి గొట్టిపాటి విమర్శించారు. అందుకే ప్రజలు వైసీపీని 11 సీట్లకి పరిమితం చేశారని అన్నారు.

AP Minister Gottipati Ravikumar

ప్రకాశం, అక్టోబర్ 22: గత వైసీపీ ప్రభుత్వ పాలనపై, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (Former CM YS Jagan) విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ (Minister Gottipati Ravikumar) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో శాంతి భద్రతలు పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. ఏ ముఖ్యమంత్రి చేయని దుర్మార్గపు పనులు గత ఐదేళ్లలో జగన్ చేశారని విమర్శించారు. అందుకే ప్రజలు వైసీపీని 11 సీట్లకి పరిమితం చేశారని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తరువాత శాంతి భద్రతలు పటిష్టం చేస్తున్నామని వెల్లడించారు.

Lawrence Bishnoi: అతడిని ఎన్ కౌంటర్ చేస్తే కోటి రివార్డు.. పోలీసులకు కర్ణిసేన ఓపెన్ ఆఫర్..


వైసీపీ నాయకులు దుర్మార్గపు పనులు చేసి తమపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ముంబాయి హీరోయిన్‌ను తీసుకువచ్చి పోలీసులతో వేధించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇంకా కొంతమంది నుంచి ఆ వాసన పోలేదన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో అన్ని రంగాల నుంచి పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని.. 20 ఏళ్ళ క్రితమే ముందు చూపుతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెక్నాలజీని అభివృద్ధి చేశారన్నారు. విద్యుత్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చేందుకు చంద్రబాబు పని చేస్తున్నారన్నారు. వైసీపీ చేసే కుట్రల్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.


పీపీఏలను రద్దు చేసి గత ప్రభుత్వంలో బయట నుంచి విద్యుత్ కొనుగోలు చేశారని.. విద్యుత్ సంస్థలు వైసీపీ ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాయని తెలిపారు. ఆ భారమే ఇప్పుడు ప్రజలు మోస్తున్నారన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఒక్కరూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని గుర్తుచేశారు. గత ప్రభుత్వంలో జగన్ చేసిన అరాచకాల వలన రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు సర్వనాశనం అయ్యాయన్నారు. జగన్ ప్రభుత్వంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందన్నారు. చంద్రబాబు సీఎం అయిన మొదటి రోజు నుంచే రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు పని చేస్తున్నారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు.

Vijayawada: దయచేసి వినండి.. విజయవాడ రైల్వేస్టేషన్‌లో జాగ్రత్తండి..



మానవత్వం చాటుకున్న మంత్రి..

మంత్రి గొట్టిపాటి రవికుమార్ మానవత్వం చాటుకున్నారు. ఈరోజు (మంగళవారం) అధికారిక కార్యక్రమం నిమిత్తం క్యాంపు కార్యాలయం నుంచి ఒంగోలుకు మంత్రి వెళ్తున్నారు. ఈ క్రమంలో మార్గమధ్యలో త్రోవగుంట వంతెనపై గుర్తు తెలియని వాహనం బైక్‌ను ఢీ కొట్టడంతో, తీవ్ర గాయాలతో రోడ్డుపై పడి ఉన్న ఓ వ్యక్తిని మంత్రి చూశారు. వెంటనే తన కాన్వాయ్‌ను ఆపి హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి క్షతగాత్రుడికి ప్రథమ చికిత్సను అందించారు. గాయపడిన వ్యక్తి బల్లికురవ మండలం అంబడిపూడి గ్రామానికి చెందిన కొవ్వూరి కోటేశ్వరరావుగా గుర్తించారు. వెంటనే అంబులెన్స్‌ను పిలిపించి ఒంగోలు కిమ్స్ ఆసుపత్రికి క్షతగాత్రుడిని తరలించారు. కిమ్స్ డాక్టర్లకు ఫోన్ చేసి, యాక్సిడెంట్‌ వివరాలు తెలిపి, క్షతగాత్రుడికి మెరుగైన వైద్యం అందించాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి పట్ల మంత్రి రవికుమార్ స్పందించిన తీరుపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

Heavy Rains: ఏపీని వీడని వర్షాలు.. రాప్తాడులో వర్ష బీభత్సం

AP Ministers: మూడు రోజులుగా ఢిల్లీలోనే ఏపీ మంత్రులు.. ఎందుకంటే

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 22 , 2024 | 01:30 PM