Preliminaries : ముందస్తు చవితి సంబరాలు
ABN, Publish Date - Sep 06 , 2024 | 11:27 PM
స్థానిక ఏపీ మోడల్ స్కూల్‌లో జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో ముందస్తు వినాయక చవితి సంబరాలను నిర్వహించారు. పర్యావరణ కాలుష్య రహిత మట్టి వినాయక ప్రతిమల ను పూజించడం ద్వారా భక్తితో పాటు మా నసిక ఆరోగ్యం సిద్దిస్తాయన్నారు.
చిన్నమండెం, సెప్టెంబరు6: స్థానిక ఏపీ మోడల్ స్కూల్‌లో జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో ముందస్తు వినాయక చవితి సంబరాలను నిర్వహించారు. పర్యావరణ కాలుష్య రహిత మట్టి వినాయక ప్రతిమల ను పూజించడం ద్వారా భక్తితో పాటు మా నసిక ఆరోగ్యం సిద్దిస్తాయన్నారు. ప్రతిమ లను నిమజ్జనం చేయడం ద్వారా అవి నీటి లో కరిగిపోతాయని, తద్వారా పర్యావరణా నికి ఎలాంటి ముప్పు ఉండదని ప్రిన్సిపాల్ రమేశ్ తెలిపారు. పాఠశాలలో 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు మట్టితో వినాయకుల ప్రతిమలు చేసే పోటీని నిర్వ హించారు. విద్యార్థులు చేసిన మట్టి వినా యక ప్రతిమలను గ్రామాల్లో పంచి పెట్టా లన్నారు. ఎన్‌ఎస్‌ఎస్పీఓ సుబ్బరాయుడు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థుల ర్యాలీ
సిద్దవటం, సెప్టెంబరు 6: ప్రకృతికి ఏమాత్రం హాని కలిగించని మట్టి గణనా ధున్ని పూజకు వినియోగించాలని సిద్దవ టం ఎగువపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం.శ్రీరా ములు అన్నారు. సహజ రంగులతో తయా రు చేసి మట్టి గణేష్ ప్రతిమలను ప్రోత్స హించి పర్యావరణ పరిరక్షణకు పాటుప డాలని విద్యార్థులను కోరారు. చెరువులకు, నదులకు నష్టం కలిగించే వ్యర్థపదార్థాల వినియోగం తగ్గించాలని, మట్టి వినాయక ప్రతిమలను పూజిద్దామని పిలుపునిచ్చారు. పాఠశాల విద్యార్థులు మట్టి విగ్రహాలను ప్రోత్సహించాలని సిద్దవటంలో ర్యాలీ నిర్వ హించారు. మట్టి గణపతి ముద్దు - ప్లాస్టిక్ సహిత గణపతి వద్దు, మట్టి గణపతిని పూజిద్దాం - పర్యావరణాన్ని కాపాడుదాం, పెన్నానది జలాన్ని కలుషిత రహితంగా ఉంచుదాం లాంటి నినాదాలతో విద్యార్థు లు, ఉపాధ్యాయులు సిద్దవటం పురవీధు ల్లో ప్రజల అవగాహన కోసం ర్యాలీ నిర్వ హించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Sep 06 , 2024 | 11:27 PM