ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP High Court : ప్రేమ్‌కుమార్‌ అరెస్ట్‌పై కౌంటర్‌ వేయండి

ABN, Publish Date - Dec 14 , 2024 | 04:11 AM

పోలీసులు తన తండ్రి ప్రేమ్‌కుమార్‌ను అక్రమంగా నిర్బంధించారని, కోర్టు ముందు హాజరుపర్చేలా వారిని ఆదేశించాలని కోరతూ కొరిటిపాటి అభినయ్‌ హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

  • ఎందుకు అరెస్టు చేయాల్సివచ్చిందో చెప్పండి

  • సోషల్‌ మీడియాలో వ్యాఖ్యల కేసుపై కర్నూలు పోలీసులకు హైకోర్టు ఆదేశం

అమరావతి, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): పోలీసులు తన తండ్రి ప్రేమ్‌కుమార్‌ను అక్రమంగా నిర్బంధించారని, కోర్టు ముందు హాజరుపర్చేలా వారిని ఆదేశించాలని కోరతూ కొరిటిపాటి అభినయ్‌ హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం శుక్రవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రఘునందనరావు, జస్టిస్‌ కుంచం మహేశ్వరరావు ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ.. ప్రేమ్‌కుమార్‌ను మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచామని, న్యాయాధికారి రిమాండ్‌ విధించారని తెలిపారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ప్రేమ్‌కుమార్‌ అరెస్టుకి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని కర్నూలు పోలీసులను ఆదేశించింది. విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది.

అంతకుముందు పిటిషనర్‌ తరఫు న్యాయవాది మహేశ్వరరెడ్డి వాదనలు వినిపిస్తూ.. నిందితులను అరెస్టు చేసే విషయంలో పోలీసులు చట్టనిబంధనలు పాటించడం లేదన్నారు. సివిల్‌ డ్రెస్సులో వచ్చి బలవంతంగా తీసుకెళ్తున్నారని తెలిపారు. నిబంధనలు పాటించని పోలీసులపై కఠిన చర్యలకు ఆదేశించాలని కోరారు. ‘‘రాష్ట్రంలో కొత్తగా రోడ్లు వేసి, టోల్‌గేట్లు పెట్టి కూటమి ప్రభుత్వం వాహనదారుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేయనుందని ప్రేమ్‌కుమార్‌, ఆయన అనుచరులు ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. అదేవిధంగా సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు’’ అని పేర్కొంటూ కర్నూలు ఐ-టీడీపీ అధ్యక్షుడు గట్టు తిలక్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రేవ్‌కుమార్‌పై కర్నూలు మూడవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - Dec 14 , 2024 | 04:11 AM