ISRO : షార్‌కు చేరిన స్పాడెక్స్ ఉపగ్రహం
ABN, Publish Date - Dec 18 , 2024 | 04:52 AM
ఈ ఏడాది చివర్లో మరో పీఎ్‌సఎల్వీ రాకెట్ ప్రయోగానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ నెల 30న పీఎ్‌సఎల్వీ-సీ60 రాకెట్ ..
సూళ్లూరుపేట, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది చివర్లో మరో పీఎ్‌సఎల్వీ రాకెట్ ప్రయోగానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ నెల 30న పీఎ్‌సఎల్వీ-సీ60 రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపే స్పాడెక్స్ ఉపగ్రహం మంగళవారం శ్రీహరికోటలోని షార్‌కు చేరుకుంది. బెంగళూరులోని ఉపగ్రహ కేంద్రం నుంచి రోడ్డు మార్గాన ప్రత్యేక వాహనంలో భారీ భద్రత నడుమ దీన్ని షార్‌కు తరలించారు. క్లీన్‌రూమ్‌లో తుది పరీక్షలు నిర్వహించిన అనంతరం ఉపగ్రహాన్ని రాకెట్ శిఖర భాగాన అమర్చనున్నారు. రాకెట్ మూడు దశల అనుసంధాన పనులను ఇస్రో శాస్త్రవేత్తలు పూర్తిచేశారు. ఈ నెల 30వ తేదీ రాత్రి 9:48 గంటలకు షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎ్‌సఎల్వీ-సీ60 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది.
Updated Date - Dec 18 , 2024 | 04:52 AM