Pattabhiram : చెత్త ఏరుకొనే వారితో ఇంటింటి చెత్త సేకరణ
ABN, Publish Date - Dec 21 , 2024 | 05:26 AM
చెత్త ఏరుకొనే వారితోనే ఇంటింటా చెత్త సేకరించే పద్ధతిని పుణె మున్సిపల్ కార్పొరేషన్ అమలు చేస్తోంది.
పుణెలో అమలు తీరును పరిశీలించిన పట్టాభి బృందం
అమరావతి, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): చెత్త ఏరుకొనే వారితోనే ఇంటింటా చెత్త సేకరించే పద్ధతిని పుణె మున్సిపల్ కార్పొరేషన్ అమలు చేస్తోంది. రాష్ట్ర స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ వైస్‌చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరాం బృందం శుక్రవారం ఆ న గరంలో పర్యటించి ఈ విధానాన్ని పరిశీలించింది. ఆ వివరాలను పట్టాభి మీడియాకు వివరించారు. మహారాష్ట్రలోని పుణెలో చెత్త ఏరుకొనే 8 వేల మందితో అధికారులు సొసైటీని ఏర్పాటుచేసి..చెత్త ఏరిస్తున్నారు. చె త్త సేకరించే సమయంలో ప్లాస్టిక్ కవర్లు తదితర రీ సె ౖక్లిం గ్‌కు పనికొచ్చే వస్తువులను చెత్త ఏరుకొనేవారు తమవ ద్దే ఉంచుకొని సొసైటీద్వారా విక్రయిస్తున్నారు’’అని తెలిపారు.
Updated Date - Dec 21 , 2024 | 05:27 AM