ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

అమరావతిలో బొల్లినేని ధార్మిక సేవ.. కుప్పంలో 'పురాణపండ' ఆధ్యాత్మిక సౌందర్యం!

ABN, Publish Date - May 12 , 2024 | 10:22 PM

అన్వేషణలనుండి ... అద్భుత దైవీయ స్పృహలోకి ప్రవేశించిన ప్రస్థానంలో పరమాద్భుతాలు నిస్వార్ధంగా సృష్టిస్తున్నారని ... ఈ పవిత్రతలు, అపురూపతలు నచ్చడం వల్లనే ... శ్రీనివాస్ లోని మేధ, ప్రజ్ఞ, నిస్వార్ధత కృష్ణయ్యను ఆకర్షించి ఇంతటి మహా గ్రంథ యజ్ఞ కార్యానికి బొల్లినేని కృష్ణయ్య సమర్పకులుగా వ్యవహరించారని కిమ్స్ హాస్పిటల్స్ వర్గాలు స్పష్టం చెయ్యడం గమనార్హం.ప్రశంసనీయం.

* అమరావతిలో బొల్లినేని ధార్మిక సేవ అద్భుతం !!

ఆధ్యాత్మిక భావజాలాన్ని కధల, కవిత్వాల, స్తోత్రాల, రచనల, సంకలనాల రూపంలో రసజ్ఞ పాఠకులకు చేరవేయడంలో నిశ్శబ్దాన్ని, నిస్వార్ధతనూ ఆచరణాత్మకంగా పాటించే ఒక అద్భుతమైన సౌందర్యమైన గాఢతల నిగూఢతల ప్రగాఢ పాత్ర పేరే ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ అని ఎనిమిదేళ్లనాడు హైదరాబాద్ రవీంద్రభారతిలో ఒక గ్రంథావిష్కరణ సభలో పూర్వ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పేర్కొన్నారంటే వ్యాపార కాలుష్యం అంటని పురాణపండ శ్రీనివాస్ ప్రతిభావంతమైన గ్రంధాలపట్ల ఆయనకి ఉన్న అభిమానాన్ని తేటతెల్లం చేస్తోంది. కేవలం వెంకయ్య నాయుడు మాత్రమే కాదు... పురాణపండ శ్రీనివాస్ ఒక అపూర్వ చారిత్రకగ్రంధంలాంటి వాడంటారు ఆంధ్రప్రదేశ్ పూర్వ ఆర్ధిక శాఖామంత్రి, సీనియర్ తెలుగుదేశం నాయకులు ఆనం రామనారాయణ రెడ్డి.

ఆయాకాలాల సామాజిక, సాంస్కృతిక చరిత్రను అవగాహన చేసుకుంటూ, సాహిత్య సంగీత శిల్ప చిత్రలేఖనాది కళలను ఆస్వాదిస్తూ స్వచ్ఛ జీవనదీజలాల్లో తేలియాడేలా ఆధ్యాత్మిక అంశాల్ని అపూర్వంగా బుక్స్ ద్వారా పురాణపండ శ్రీనివాస్ ప్రెజెంట్ చేసినట్లు నేనెవరినీ చూడలేదంటారు నాటి ఐ.టి.శాఖామంత్రి, నేటి టీఆరెస్ సీనియర్ నాయకులు పొన్నాల లక్ష్మయ్య.

ఎన్నో యుగాల రహస్యాలను అందించాలని ఎప్పుడూ పుస్తకాల మధ్యే తహతహలాడుతూ కవిత్వ సౌందర్యాల వెన్నెలలో మా పురాణపండ శ్రీనివాస్ తడిసి అనుభూతి చెందుతుంటారని స్పష్టంగా చెప్పేసింది సీనియర్ యాంకర్ సుమ.

పురాణపండ శ్రీనివాస్ అవిశ్రాన్తంగా చేసే, అందరినీ ఆకట్టుకునేలా చేసే పుస్తక రచనా సంకలనాలు అన్నిటికన్నా నన్ను ఎక్కువ చాలా సార్లు ఆశ్చర్య పరిచాయని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖామంత్రి ఆర్కే రోజా రెండు మూడు సందర్భాల్లో బాహాటంగానే పేర్కొనడం గమనార్హం.

తిరుమల శ్రీవారి అనుగ్రహం పురాణపండ శ్రీనివాస్ పై పుష్కలంగా ఉండటం వల్లనే పుస్తకం వెనుకనే మరొక పుస్తకం చొప్పున ఇంత మంగళంగా, ఇంత మంత్రమయంగా, ఇంత ఆకర్షణీయంగా ఇన్ని పుస్తకాలు అపురూపంగా అన్ని విలువలతో అందించగలుగుతున్నారని తిరుమల పుణ్యక్షేత్ర ప్రధానార్చకులు డాక్టర్ ఏ.వీ.రమణ దీక్షితులు అనేక సందర్భాల్లో శ్రీనివాస్ పై ఆశీరనుగ్రహం వర్షించారని తిరుమల పండిత బృందాలు స్పష్టం చేస్తున్నాయి.

మానవదేహం ఎదుర్కొనే మానసిక శారీరక విపత్తుల నుండి పురాణపండ శ్రీనివాస్ పుస్తకాల మంత్ర శక్తి విముక్తి కలిగిస్తుందని యాదాద్రి మహాక్షేత్రం ప్రధాన అర్చకులు నల్లంతీగల్ లక్ష్మీ నరసింహాచార్యులు పేర్కొన్నారని యాదాద్రి వేద పండితులు సైతం గొంతెత్తుతున్నారు.

జీవితంలో ఎన్నో సవాళ్లెదుర్కొన్న పురాణపండ శ్రీనివాస్ మానవత్వం పోతపోసిన మానవ విలువల సాన్నిహిత్యమని ఆయన స్నేహితులు సైతం రాజమహేంద్రవరం గౌతమీ గ్రంధాలయంలో ఇప్పటికీ చెబుతున్నారు. శ్రీనివాస్ చిన్న వయస్సులోనే భయంకరమైన కష్టాలెదుర్కొన్నారని... కేవలం ఆయన మంచితనం, దైవబలం మాత్రమే ఎప్పటికప్పుడు రక్షించాయని కూడా వివరాలతో చెబుతున్నారు.

ఎంతో దైవబలం, ఆత్మబలం ఉండటం వల్లనే ఇన్ని బుక్స్ నిస్వార్ధంగా ఉచితంగా పురాణపండ అందజెయ్యడం జరుగుతోందని, ఇది మామూలు విషయం కాదనీ అమరావతికి చెందిన ప్రభుత్వ అధికారులూ, విజయవాడలో అనేక దేవాలయాల అర్చక పండిత పారిశ్రామిక రాజకీయ సాంస్కృతిక రంగ ప్రముఖులూ జే జే లు పలుకుతున్నారు.

ఈ అంశాన్ని ఎందుకింత ప్రశంసలతో ఎత్తుకున్నామంటే... శుక్ర, శని, ఆదివారాలలో విజయవాడ, అమరావతి మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నియోజకవర్గం కుప్పంలో సైతం పురాణపండ శ్రీనివాస్ అపురూప గ్రంధాలైన ‘జయ జయోస్తు’. ‘శ్రీమాలిక’లను వేల కొలది ప్రతులను రాజకీయ పార్టీలకు సంబంధం లేని యువతీ యువకులే పంచడం ప్రత్యేకంగా పేర్కొనాలి.

అంతేకాకుండా బెజవాడ కనకదుర్గమ్మ వద్ద గత రెండు వారాలుగా కుంకుమార్చనల్లో, ప్రత్యేక దర్శనాల్లో కూడా పురాణపండ ‘సౌభాగ్య’ అనే గ్రంధాన్ని దేవస్థానం అధికారికంగా మంత్ర ప్రసాదంగా సమర్పిస్తుండటం భక్తకోటిని విశేషంగా ఆకర్షిస్తోంది.

చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఆదేశాల మేరకు ఈ అద్భుత గ్రంధాలను అందుకున్న అమరావతి, విజయవాడ, కుప్పం భక్త జన కోటి ఆనందం వర్ణనాతీతమని, ఈ పవిత్రసేవ తమకు అందిందని కాణిపాకం దేవస్థాన యజ్ఞ పండితులు సత్యనారాయణమూర్తి ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు.

జయ జయోస్తు, శ్రీమాలిక గ్రంధాల నిర్మాణం, ఉచిత వితరణ ఉద్యమం వెనుక ఒక పవిత్ర వ్యవస్థలా, అదృశ్య శక్తిగా వ్యవహరించిన ప్రఖ్యాత పారిశ్రామిక వేత్త, మాజీమంత్రి, కిమ్స్ హాస్పిటల్స్ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్య, సుజాత దంపతుల నిష్కపట,నిస్వార్ధ సేవకు ఆంధ్రప్రదేశ్‌లో అనేక జిల్లాలలో వందలమంది చేతులెత్తి నమస్కరిస్తున్నట్లు జయ జయోస్తు, శ్రీమాలిక గ్రంధాలను ఉచితంగా పంచుతున్న యువతీ యువకులు మనస్ఫూర్తిగా చెప్పడం ఒక ప్రత్యేక విశేషమైతే ... బొల్లినేని కృష్ణయ్య ఏమీ ఆశించకుండా ... కేవలం అందరికీ దైవబలం అందాలనే ఈ గొప్ప ధార్మిక సేవగా ఈ అత్యద్భుత పవిత్ర సేవ చెయ్యడం వేలమందిని ఆశ్చర్య పరుస్తోంది. కిమ్స్ హాస్పిటల్ ఫౌండర్ చైర్మన్‌గా, మాజీ మంత్రిగా లక్షల తెలుగువారికి చిరపరిచితులైన బొల్లినేని కృష్ణయ్య కీర్తి కోసం కాకుండా... మానవత్వం కోసం... దైవత్వం కోసం ఇలాంటి మహత్కార్యాలు చేస్తారని ఆయన సన్నిహితులు నెల్లూరులో ప్రశంసలు వర్షిస్తున్నారు.

శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారు పురాణపండ శ్రీనివాస్ సంఘర్షణలనుండి... అన్వేషణలనుండి ... అద్భుత దైవీయ స్పృహలోకి ప్రవేశించిన ప్రస్థానంలో పరమాద్భుతాలు నిస్వార్ధంగా సృష్టిస్తున్నారని... ఈ పవిత్రతలు, అపురూపతలు నచ్చడం వల్లనే... శ్రీనివాస్ లోని మేధ, ప్రజ్ఞ, నిస్వార్ధత కృష్ణయ్యను ఆకర్షించి ఇంతటి మహా గ్రంథ యజ్ఞ కార్యానికి బొల్లినేని కృష్ణయ్య సమర్పకులుగా వ్యవహరించారని కిమ్స్ హాస్పిటల్స్ వర్గాలు స్పష్టం చెయ్యడం గమనార్హం, ప్రశంసనీయం.

ఇదిలా ఉండగా... ప్రముఖ పారిశ్రామికవేత్త, నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి, కోవూరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు సైతం జయ జయోస్తు గ్రంధాన్ని ఆవిష్కరించి అనేకమందికి ఉచితంగా అందజేయడంతో నెల్లూరు ఊరు ఊరంతా భారీ స్పందన వచ్చి... ఈ గ్రంధానికి భారీ డిమాండ్ ఏర్పడిన అంశాన్ని నెల్లూరు మీడియా కోడైకూస్తోంది. ఉభయ గోదావరి జిల్లాలలో... కృష్ణా, విశాఖ, అనంతపురం, కడప జిల్లాలలో ఈ జయ జయోస్తు గ్రంధానికి విపరీతమైన స్పందన లభించిందని ఆయా ప్రాంతాల భక్తగణాలు, పండితులు మీడియా ద్వారా చెప్పడం గమనార్హం.

Updated Date - May 12 , 2024 | 11:32 PM

Advertising
Advertising