సునీల్‌కుమార్ పారిపోయే అవకాశం
ABN, Publish Date - Nov 28 , 2024 | 04:03 AM
తనపై కస్టోడియల్ టార్చర్‌కు పాల్పడిన సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్‌కుమార్ పారిపోయే అవకాశాలున్నాయని, ఆయనపై లుక్‌అవుట్ నోటీసులు జారీ చేయాలని శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు డిమాండ్ చేశారు.
లుక్‌అవుట్ నోటీస్ జారీ చేయాలి
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు డిమాండ్
విజయ్‌పాల్ పాపం ఇప్పటికి పండిందని వ్యాఖ్య
న్యూఢిల్లీ, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): తనపై కస్టోడియల్ టార్చర్‌కు పాల్పడిన సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్‌కుమార్ పారిపోయే అవకాశాలున్నాయని, ఆయనపై లుక్‌అవుట్ నోటీసులు జారీ చేయాలని శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు డిమాండ్ చేశారు. బుధవారం ఢిల్లీ ఏపీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఐడీ మాజీ ఏఎస్పీ విజయ్‌పాల్‌ను అరెస్ట్ చేయడం చాలా సంతోషంగా అనిపించిందని తెలిపారు. ఈ కేసులో అసలు కుట్రదారు సునీల్‌కుమార్ అని చెప్పారు. సునీల్‌కుమార్, విజయ్‌పాల్ అంతా ఒక ముఠా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయ్‌పాల్ ఎన్నో దందాలు చేశారని, నేటికి ఆయన పాపం పండిందన్నారు. పోలీసులు ఎన్ని ప్రశ్నలు అడిగినా తనకేమీ తెలియదని విజయ్‌పాల్ ఒక క్రిమినల్ లాగా సమాధానాలు చెబున్నారని మండిపడ్డారు.
తన ఛాతీపై ఒక బలమైన వ్యక్తి కూర్చున్నారని, ముఖానికి కర్చీఫ్ కట్టుకుని, దాడి చేశారని రఘురామ తెలిపారు. తన అరెస్టు, దాడి అంతా ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగాయని ఆరోపించారు. వారిని శిక్షించడంలో ఇప్పటికే చాలా ఆలస్యమైందని అన్నారు. పీవీ సునీల్ కుమార్ తులసివనంలో గంజాయి మొక్కలాంటి వ్యక్తి అని ధ్వజమెత్తారు. ఈ కేసులో అందరినీ శిక్షించడానికి ఎక్కువ సమయం పట్టదని భావిస్తున్నట్లు రఘురామ తెలిపారు. కాగా, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, రఘురామరాజు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. త్వరలో జరగనున్న 16వ ఆంధ్రప్రదేశ్ శాసనసభ నూతన సభ్యుల అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు రావాలని ఆహ్వానించారు. ఆ ఆహ్వానాన్ని ఆయన గౌరవంగా స్వీకరించారు. ప్రతిపాదిత కార్యక్రయాన్ని విజయవంతంగా నిర్వహించడానికి లోక్‌సభ కార్యాలయం ద్వారా అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
Updated Date - Nov 28 , 2024 | 04:05 AM