ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Raghurama Krishnaraju: హాయ్ జగన్ అంటూ దగ్గరకు వెళ్లి...

ABN, Publish Date - Jul 22 , 2024 | 11:53 AM

ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే అసెంబ్లీ హాల్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అసెంబ్లీ హాల్‌లో వైసీపీ అధినేత జగన్‌ భుజంపై చెయ్యి వేసి మరీ రఘురామ కృష్ణరాజు మాట్లాడటం అక్కడున్న వారందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

అమరావతి: ఏపీ అసెంబ్లీ (AP Assembly) సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే అసెంబ్లీ హాల్‌ (Assembly Hall)లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అసెంబ్లీ హాల్‌లో వైసీపీ (YCP) అధినేత జగన్‌ (Jagan) భుజంపై చెయ్యి వేసి మరీ టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు మాట్లాడటం అక్కడున్న వారందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కనిపించిన వెంటనే హాయ్ జగన్ అంటూ రఘురామ ఆయన వద్దకు వెళ్లి మరీ పలకరించారు. ఇది జగన్‌కు కూడా ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించి ఉండవచ్చు.


ఇక ఇద్దరూ అసెంబ్లీలోనే ఉన్నారు కాబట్టి.. మరోసారి కూడా వారిద్దరూ ఒకరికొకరు తారస పడ్డారు. తర్వాత కలిసినప్పుడు ‘రోజూ అసెంబ్లీకి రా జగన్’ అని రఘురామ కోరారు. ‘రెగ్యులర్ వస్తాను...మీరే చూస్తరుగా’ అని జగన్ వినమ్రంగా చెప్పారు. ప్రతిపక్షం లేకపోతే ఎలా అని రఘురామ పేర్కొన్నారు. ఒకరకంగా ప్రతిపక్షం అసెంబ్లీలో ఉంటేనే సమావేశాలు మజాగా ఉంటాయన్నట్టుగా మాట్లాడారు. జగన్ చేతిలో చేయు వేసి మరీ రఘురామ మాట్లాడటం ఆసక్తిని రేకెత్తించింది.


అంతటితో రఘురామ ఆగితే బాగానే ఉంటుంది. అసెంబ్లీకి ప్రతిరోజూ వస్తే బాగుంటుందని మరోసారి జగన్‌కు సూచించారు. పైగా అటుగా వెళుతున్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ను తనకు జగన్ పక్కనే సీటు వేయించాలని రఘురామ కోరారు. తప్పని సరిగా అంటూ లాబీల్లో నవ్వుకుంటూ కేశవ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. వైసీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు అందరూ కూడా రఘురామకు విష్ చేసి వెళ్లడం ఆసక్తికరంగా అనిపించింది.

ఇవి కూడా చదవండి...

AP Politics: జనసేనతో టచ్‌లోకి వైసీపీ మాజీ మంత్రులు.. పవన్ రిప్లై‌తో కంగుతిన్న నేతలు..!

Gautam Gambhir: రోహిత్, కోహ్లీ 2027 ప్రపంచకప్ కూడా ఆడగలరు.. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గౌతమ్ గంభీర్!

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 22 , 2024 | 11:53 AM

Advertising
Advertising
<