ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Godavari flood : ఉగ్ర గోదావరి

ABN, Publish Date - Jul 22 , 2024 | 04:42 AM

గోదావరి వరద ఉధృతమవుతోంది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక దిశగా పరుగులు పెడుతోంది.

ధవళేశ్వరం వద్ద ఉధృతంగా ప్రవాహం

మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేసే అవకాశం

భద్రాచలం వద్ద ఇప్పటికే తొలి హెచ్చరిక జారీ

చింతూరు వద్ద జాతీయ రహదారిపైకి వరద

తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌కు నిలిచిన రాకపోకలు

8.18 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల

ఘాట్లలో స్నానాలకు వెళ్లకుండా నియంత్రణ చర్యలు

కోనసీమ జిల్లాలో నేడు, విలీన మండలాల్లో

నేడు, రేపు బడులకు సెలవులు

ఉధృతంగా శబరి.. చింతూరు-మారేడుమిల్లి ఘాట్‌ బంద్‌

రాష్ట్రంలో 48 వేల హెక్టార్లలో వరి పైరు మునక

ప్రాథమికంగా అంచనా వేసిన వ్యవసాయ శాఖ

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

గోదావరి వరద ఉధృతమవుతోంది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక దిశగా పరుగులు పెడుతోంది. ఆదివారం సాయంత్రం 6గంటలకు బ్యారేజీ వద్ద నీటిమట్టం 10.10 అడుగులకు చేరింది. పాండ్‌ లెవెల్‌ 13.75 మీటర్లుగా ఉంది. బ్యారేజీ నుంచి రాత్రి 9గంటలకు 8,18,853 క్యూసెక్కులు సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఈ ప్రవాహం 10లక్షల క్యూసెక్కులు దాటినా.. బ్యారేజీ నీటిమట్టం 11.75 అడుగులకు చేరినా మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. సోమవారం తెల్లవారుజాముకే మొదటి హెచ్చరిక జారీచేసే అవకాశం ఉన్నట్టు ఇరిగేషన్‌ అధికారులు చెబుతున్నారు. కాగా, భద్రాచలం వద్ద ఆదివారం రాత్రి 43 అడుగులకు గోదావరి నీటిమట్టం చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరి జారీ చేశారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరి ఇంకా పెరిగే అవకాశం ఉందని అక్కడి అధికారులు అంచనా వేస్తున్నారు. రాజమహేంద్రవరం వద్ద అఖండ గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఘాట్లలో ఎవరినీ స్నానాలకు వెళ్లకుండా నియంత్రణ చర్యలు చేపట్టారు. రాజమహేంద్రవరం, కొవ్వూరు డివిజన్లలోని ఘాట్లలో సోమవారం నుంచి సచివాలయ, ఇతర ఉద్యోగులను మూడుషిప్టులుగా 24గంటలూ ఉండేలా డ్యూటీలు వేశారు. వర్షాలు, వరద నేపథ్యంలో డాక్టర్‌ బీఆర్‌ కోనసీమ జిల్లాలో 22న, విలీన మండలాల్లో 22, 23 తేదీల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. భారీవర్షాలు, గోదావరి వరదలతో ఏలూరు జిల్లా కుక్కునూరు, వేలేరుపాడు మండలాల ప్రజలు అల్లాడిపోతున్నారు.

పెదవాగు ప్రాజెక్టుకు గండి పడటంతో వేలేరుపాడు మండలంలోని 13 గ్రామాల ప్రజలు తీవ్రంగా నష్టపోమారు. ఇళ్లు, పశుసంపద కొట్టుకుపోవడంతో పాటు పంటల్లో ఇసుక మేటలు వేసింది. ఏలూరు జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో 7 గ్రామాల్లోని 432 కుటుంబాలను తక్షణమే పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. గోదావరి వరద మరింత పెరిగే అవకాశం ఉన్నందున ముంపునకు గురయ్యే గ్రామాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అల్లూరి జిల్లా చింతూరు మండలంలో శబరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆదివారం సాయంత్రానికి చింతూరు వద్ద శబరి నీటిమట్టం 39 అడుగులకు చేరింది. విజయవాడ నుంచి జగదల్‌పూర్‌కు వెళ్లే 30వ నెంబరు జాతీయ రహదారిపై అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం చట్టి వద్ద, ఛత్తీ్‌సగఢ్‌లోని సుక్మా జిల్లా ఎర్రబోరు వద్ద రహదారిపై వరద నీరు చేరింది. మరోవైపు ఏపీ మీదుగా ఒడిశా వెళ్లే 326 నెంబరు జాతీయ రహదారిపై అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలో కల్లేరు, కుయుగూరు వద్ద వరద నీరు చేరింది. దీంతో తెలంగాణ, ఛత్తీ్‌సగఢ్‌, ఒడిశా జాతీయ రహదారులపై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. చింతూరు, కూనవరం, ఎటపాక, వరరామచంద్రపరం మండలాల్లోని పలు గ్రామాలను వరద నీరు చుట్టుముట్టింది. వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతవాసులు స్వచ్ఛందంగా సురక్షిత ప్రాంతాలకు సామగ్రిని తరలించుకుంటున్నారు. చింతూరు-మారేడుమిల్లి ఘాట్‌రోడ్‌పై చెట్లు విరిగి పడుతుండడంతో రాత్రివేళల్లో అటుగా రాకపోకలు నిలిపివేశారు. డొంకరాయి జలవిద్యుత్‌ కేంద్రానికి చెందిన రిజర్వాయరు నిల్వ సామర్థ్యం 1,037 అడుగులు కాగా ప్రస్తుతం 1022.9 అడుగులకు నీరు చేరింది. దేవీపట్నం మండలం కొండమొదలు, తాళ్ళూరు, కచ్చులూరు, మంటూరు, మడిపల్లి, మూలపాడు, అగ్రహారం, దేవీపట్నం, తొయ్యేరు, పూడిపల్లి, పోశమ్మగండి గ్రామాల్లో వరద పెరుగుతూ వస్తోంది. మూడు రోజుల నుంచి మాతృశ్రీ అమ్మవారి ఆలయాన్ని చుట్టుముట్టి ఆదివారం గోపురం పైభాగం వరకు వరద చేరింది. తాలిపేరు జలాశయం, శబరి తదితర నదుల నుంచి గోదావరికి వరదనీరు చేరి సీతపల్లి వాగు పోటెత్తడంతో 4 పంచాయతీలకు ప్రభుత్వ క్యాంప్‌ కార్యాలయాలకు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.


48వేల హెక్టార్లలో వరి మునక

రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా ముంపు ప్రాంతాల్లో 48వేల హెక్టార్లలో వరి పైరు నీట మునిగిందని వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. పశ్చిమగోదావరి జిల్లాలో 15వేలు, తూర్పు గోదావరి జిల్లాలో 16,500, ఏలూరు జిల్లాలో 5వేలు, గుంటూరు జిల్లాలో 3వేలు, కోనసీమ జిల్లాలో 3,500, కాకినాడ జిల్లాలో 2,200 హెక్టార్లలో వరి ముంపుబారిన పడినట్లు తెలిపింది. ప్రస్తుత వర్షాలతో పంటలకు పెద్దగా నష్టం ఉండదని, నీరు తగ్గాక పైరు ఎదుగుతుందని పేర్కొంది. పూర్తిగా దెబ్బతిన్న చోట మళ్లీ నాట్లు వేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ముంపు తగ్గాక పంట నష్టంపై ఎన్యుమరేషన్‌ చేపట్టనున్నట్లు వ్యవసాయశాఖ డైరెక్టర్‌ ఢిల్లీరావు తెలిపారు. కాగా, తూర్పుగోదావరి జిల్లాలో ఎర్రకాలువ ముంపునకు గురైన నల్లజర్ల, నిడదవోలు మండలాలకు ఇద్దరు ప్రత్యేకాధికారులను నియమించినట్టు జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి తెలిపారు. శెట్టిపేట గ్రామంలో 500 మందికి పునరావాసం కల్పించినట్టు చెప్పారు. మంత్రి కందుల దుర్గేష్‌ ఢిల్లీ నుంచి పరిస్థితిని సమీక్షించారు. పశ్చిమగోదావరి జిల్లాలో యనమదుర్రు డ్రెయిన్‌ పొంగి ప్రవహిస్తోంది. ఉప్పుటేరులో కలవాల్సిన ఈ డ్రెయిన్‌ నీరు ముందుకు సాగక పంట కాల్వల్లోకి ఎగదన్నుతున్నది. గోదావరిలో వరద నీరు పెరగటంతో నరసాపురం వద్ద పంటు రాకపోకలను నిలిపివేశారు. ఏలూరు జిల్లాలో తమ్మిలేరు వరద ఉధృతి కొనసాగుతోంది. నాగిరెడ్డిగూడెం తమ్మిలేరు రిజర్వాయర్‌కు 2360 క్యూసెక్కులు నీరు వచ్చి చేరుతోంది. కొంగువారిగూడెం ఎర్రకాలువ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో తగ్గింది. ఆదివారం సాయంత్రానికి ఎర్రకాలువ ప్రాజెక్టులోకి 5,600 క్యూసెక్కులు నీరు చేరుతుండగా, ప్రాజెక్టు నుంచి 7,092 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

Updated Date - Jul 22 , 2024 | 04:47 AM

Advertising
Advertising
<