ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అత్యాచారం కేసులో నిందితుడికి మరణించే వరకు జైలుశిక్ష

ABN, Publish Date - Dec 03 , 2024 | 06:13 AM

మైనర్‌ బాలికపై అత్యాచారం కేసులో ఒంగోలు పోక్సో కోర్టు జడ్జి సంచలన తీర్పు ఇచ్చారు. దోషిగా తేలిన షేక్‌ మొహ్మద్‌ అప్సర్‌బాషాకు మరణించే వరకు జైలుశిక్ష విధిస్తూ ఇన్‌చార్జి న్యాయమూర్తి రాజా వెంకటాద్రి సోమవారం తీర్పు వెలువరించారు.

  • ఒంగోలు పోక్సో కోర్టు సంచలన తీర్పు

  • బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన టీచర్‌

ఒంగోలు క్రైం, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): మైనర్‌ బాలికపై అత్యాచారం కేసులో ఒంగోలు పోక్సో కోర్టు జడ్జి సంచలన తీర్పు ఇచ్చారు. దోషిగా తేలిన షేక్‌ మొహ్మద్‌ అప్సర్‌బాషాకు మరణించే వరకు జైలుశిక్ష విధిస్తూ ఇన్‌చార్జి న్యాయమూర్తి రాజా వెంకటాద్రి సోమవారం తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్‌ కథనం మేరకు కంభంకు చెందిన అప్సర్‌ బాషా.. అక్కడే ఒక ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసేవాడు. పాఠశాలలో ఓ బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో అప్పట్లో అతన్ని ఉద్యోగం నుంచి తొలిగించారు. అనంతరం ఆ బాలిక ఒంగోలులో చదువుకుంటుండగా.. 2017 ఆగస్టు 6న మాయమాటలు చెప్పి హైదరాబాద్‌, నరసరావుపేట ప్రాంతాలకు తీసుకెళ్లాడు. అక్కడ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లిదండ్రులు ఒంగోలు టూటౌన్‌ పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టారు. అప్పటి డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు కేసు విచారణ చేపట్టి, కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. నేరం రుజువైనందున కోర్టు అప్సర్‌ బాషాకు మరణించే వరకు జైలుశిక్ష, రూ.25 వేలు జరిమానా విధించింది. బాధితురాలికి రూ.7 లక్షల పరిహారం అందేలా చూడాలని న్యాయ సేవాధికార సంస్థను ఆదేశిం చింది. ప్రాసిక్యూషన్‌ తరఫున స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఎన్‌.వసుంధర వాదనలు వినిపించారు.

Updated Date - Dec 03 , 2024 | 06:13 AM