Minister Narayana: టౌన్ ప్లానింగ్‌లో సంస్కరణలు.. ఆ రోజు నుంచి అమలు
ABN, Publish Date - Nov 25 , 2024 | 08:06 PM
టౌన్ ప్లానింగ్ విభాగంలో సంస్కరణలు తీసుకు రావడం కోసం.. 7 బృందాలు 10 రాష్ట్రాల్లో పర్యటించాయని మంత్రి పి.నారాయణ వెల్లడించారు. తద్వారా లే అవుట్ అఫ్రూవల్, బిల్డింగ్ అప్రూవల్‌పై అధ్యాయనం చేశామన్నారు.
అమరావతి, నవంబర్ 25: రాష్ట్రంలోని టౌన్ ప్లానింగ్ విభాగంలో పారదర్శకత కోసం వివిధ సంస్కరణలు అమలు చేయాలని నిర్ణయించామని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి పి.నారాయణ వెల్లడించారు. సోమవారం అమరావతిలో పురపాలక శాఖలోని టౌన ప్లానింగ్ విభాగంలోని అంశాలపై సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి పి. నారాయణ విలేకర్లతో మాట్లాడుతూ.. ఈ సమీక్షా సమావేశంలో ఈ సంస్కరణలకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారన్నారు.
Also Read: గూగుల్ మ్యాప్స్‌పై కేసు వేయొచ్చా..?
ఇక నుంచి మున్సిపాలిటీల్లో టీడీఆర్‌ల జారీ విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. టీడీఆర్‌లు జారీ లేకుండా ఆ విలువకు సంబంధించి అక్కడే అనుమతి ఇచ్చేలా మార్పు చేస్తున్నట్లు ఆయన వివరించారు. 500 చదరపు అడుగులు దాటిన నివాస భవనాలకూ సెల్లార్ పార్కింగ్‌కు అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించారు.
Also Read: కొత్త రేషన్ కార్డుల మంజూరుపై ప్రభుత్వం కీలక నిర్ణయం
120 మీటర్ల కంటే ఎత్తైన భవనాల సెట్ బాక్ పరిమితిని 20 మీటర్లకు కుదిస్తూ నిర్ణయం తీసుకున్నామన్నారు. 20 మీటర్ల సెట్ బ్యాక్ నేషనల్ బిల్డింగ్ కోడ్ ప్రకారం అమోదయోగ్యమేనని తెలిపారు. ఎత్తైన భవనాల్లో పార్కింగ్ పోడియంను 5 అంతస్తుల వరకూ అనుమతి ఇవ్వాలని నిర్ణయించామన్నారు. 10 అంతస్తుల కంటే ఎత్తైన భవనాల్లోనూ రిక్రియేషన్‌కు ఒక అంతస్తు ఉండేలా అనుమతి ఇస్తామన్నారు.
Also Read: అదానీ పెట్టుబడులపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం
లే ఆవుట్లలో ఇక నుంచి 9 మీటర్ల రోడ్డును మాత్రమే వదిలేలా నిర్ణయించామని చెప్పారు. ఇందులో డీవియేషన్లపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. అయితే టీడీఆర్ బాండ్ల విషయంలో త్వరలోనే చర్యలు ఉంటాయని మంత్రి పి.నారాయణ పేర్కొన్నారు. 15 రోజుల్లోగా టీడీఆర్ బాండ్లపై సవివర నివేదిక ఇవ్వాలని ఆదేశించామన్నారు. మెప్మా సభ్యుల ఆర్ధిక పురోగతికి సంబంధించి పీ4 విధానం అమలు చేయాలని ఈ సమీక్షా సమావేశంలో సీఎం చంద్రబాబు ఆదేశించారని మంత్రి పి.నారాయణ వివరించారు.
Also Read: చూశారా.. ఎంపీ గారి సింప్లిసిటీ
టౌన్ ప్లానింగ్ విభాగంలో సంస్కరణలు తీసుకు రావడం కోసం.. 7 బృందాలు 10 రాష్ట్రాల్లో పర్యటించాయని ఆయన గుర్తు చేశారు. తద్వారా లే అవుట్ అఫ్రూవల్, బిల్డింగ్ అప్రూవల్‌పై అధ్యాయనం చేశామన్నారు. అందులోభాగంగా 15 మీటర్లు అంటే 5 అంతస్ధులు కట్టే వారికి పర్మిషన్‌లో మార్పులు తెచ్చామని చెప్పారు. లైసెన్స్‌డ్, సర్వేయర్లు వారి ప్లాన్‌ను ఆన్ లైన్‌లో పెట్టి.. పేమంట్ చెల్లిస్తే అది డీమ్డ్ అప్రూవల్ అవుతుందని చెప్పారు. దీంతో టాస్క్ ఫోర్స్ విభాగ సిబ్బంది రెగ్యూలర్‌గా వెరీఫై చేసుకుంటారన్నారు.
Also Read: జోన్న రోట్టి వల్ల ఇన్ని లాభాలున్నాయా?
ఫౌండేషన్ వేసిన వెంటనే ఫోటోలు తీసి మున్సిపల్ శాఖకు లైసెన్స్‌డ్ సర్వేయర్లు సబ్మిట్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. అయితే ఓ వేళ వారు తప్పు చేస్తే వారి లైసెన్స్‌లు సైతం క్యాన్సిల్ చేయడంతో పాటు క్రిమినల్ కేసులు పెడతామని మంత్రి పి. నారాయణ హెచ్చరించారు. ఇక హర్యానా, డిల్లీ, గుజరాత్‌లో 15 మీటర్లు ఉంది.. ఒడిస్సా, మహరాష్ట్ర, కర్ణాటకలలో 10 మీటర్లు ఉందని తెలిపారు. దీని వల్ల 95 శాతం మంది ఇళ్లు నిర్మించుకునే వారు.. కార్యాలయాల చుట్టు తిరగాల్సిన అవసరం అయితే లేదన్నారు.
రెవెన్యూ నుండి నాలా సర్టిఫికెట్, రిజిస్ట్రేషన్ డిపార్టమెంట్‌కు వెళ్లి వ్యాల్యూ తెచ్చుకోవాల్సి ఉందన్నారు. అలాగే ఈసీలు సైతం తెచ్చుకోవాల్సి ఉందని తెలిపారు. ఎయిర్ పోర్టు, ఫైర్ డిపార్టమెంట్, మైనింగ్ డిపార్టమెంట్, రైల్వే ట్రాక్, ఇరిగేషన్ శాఖల వద్ద నుండి పర్మిషన్ అవసరం ఉంటుందని మంత్రి పి. నారాయణ స్పష్టం చేశారు. అందుకు 3 నెలల నుండి సంవత్సరం వరకు పడుతోందన్నారు.
ఆయా డిపార్టమెంట్ వాళ్లతో మాట్లాడామని.. వారి సర్వర్‌ను తమ సర్వర్‌తో ఇంటిగ్రేట్ చేస్తున్నామని తెలిపారు. మైనింగ్, రివెన్యూ వాళ్ళకు వారి హెడ్ ఆఫ్ అకౌంట్‌లో తమ సైట్‌లో పే చేస్తారని చెప్పారు. నిర్ధిష్ట సమయం దాటితే డీమ్డ్ టూ బి పెయిడ్ అని చెపుతున్నామన్నారు. బిల్డింగ్ అప్రూవల్‌కు అన్ని డిపార్టమెంట్‌లు తిరగకుండా మున్సిపల్ పోర్టల్‌లో అప్లోడ్ చేస్తే సరిపోతుందని స్పష్టం చేశారు. ఇవన్ని డిసెంబర్ 31 నుంచి అమలులోకి వస్తాయని మంత్రి పి.నారాయణ వెల్లడించారు.
For AndhraPradesh News And Telugu News
Updated Date - Nov 25 , 2024 | 08:06 PM