మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

DGP Harish Kumar Guptha: ఉద్రిక్తత సృష్టిస్తే రౌడీ షీట్లు, పీడీ యాక్ట్ ప్రయోగిస్తాం

ABN, Publish Date - Jun 03 , 2024 | 01:12 PM

సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. కౌంటింగ్ తర్వాత మీ అంతు చూస్తామంటూ కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థి శిబిరాలకు సవాలు విసురుతూ సమాజంలో అశాంతి సృష్టిస్తున్నారన్నారు. మరి కొందరు వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ ఉద్రిక్తలు సృష్టిస్తున్నారని.. అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని హరీష్ కుమార్ గెప్తా హెచ్చరించారు.

DGP Harish Kumar Guptha: ఉద్రిక్తత సృష్టిస్తే రౌడీ షీట్లు, పీడీ యాక్ట్ ప్రయోగిస్తాం

అమరావతి: సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. కౌంటింగ్ తర్వాత మీ అంతు చూస్తామంటూ కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థి శిబిరాలకు సవాలు విసురుతూ సమాజంలో అశాంతి సృష్టిస్తున్నారన్నారు. మరి కొందరు వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ ఉద్రిక్తలు సృష్టిస్తున్నారని.. అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని హరీష్ కుమార్ గెప్తా హెచ్చరించారు. వారిపై ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని డీజీపీ హెచ్చరించారు.

అతిపెద్ద పార్టీగా అవతరించనున్న టీడీపీ..


రౌడీ షీట్లు ఓపెన్ చేయటం, పీడీ యాక్ట్ ప్రయోగించడం వంటి కఠిన చర్యలు ఉంటాయని డీజీపీ హెచ్చరించారు. ఉద్రిక్తత సృష్టించే పోస్టులు ఎవరి ప్రోద్భలంతో పెడుతున్నారో కూడా విచారణ చేస్తామని ఏపీ డీజీపీ తెలిపారు. వారిని కూడా ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఆ పోస్టులను, ఫోటోలను, వీడియోలను వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకోవడం లేదా షేర్ చేయడం కూడా నిషిద్ధమన్నారు. గ్రూప్ అడ్మిన్‌లు కూడా అటువంటి వాటిని ప్రోత్సహించ కూడదన్నారు. సోషల్ మీడియా పోస్టులపై పోలీస్ శాఖ నిరంతర నిఘా ఉంటుందనే విషయాన్ని గుర్తించుకోవాలని డీజీపీ స్పష్టం చేశారు.

ప.గో. జిల్లాలో కూటమి పంజా విసరనుందా?

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 03 , 2024 | 02:06 PM

Advertising
Advertising