AP Politics: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మరో భారీ కుంభకోణం
ABN, Publish Date - Nov 03 , 2024 | 09:41 AM
ఉమ్మడి కర్నూలు జిల్లాలో మరో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో నీరు చెట్టు పథకం కోసం వినియోగించాల్సిన నిధులు పక్కదారి పట్టాయి. దీంతో జిల్లాలోని జలవనరుల శాఖ అధికారులకు కోర్టు నోటీసులు అందాయి. దాంతో అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
కర్నూలు, నవంబర్ 03: గత వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న పలు కుంభకోణాలు ఒక్కొక్కటిగా బహిర్గతమవుతున్నాయి. తాజాగా ఉమ్మడి కర్నూలు జిల్లాలోని జలవనరుల శాఖలో భారీ కుంభకోణం చోటు చేసుకుంది. ఈ శాఖలో దాదాపు రూ.10 కోట్లకుపైగా నిధులు పక్క దారి పట్టినట్లు సమాచారం. నీరు- చెట్టు పథకం కోసం వినియోగించాల్సిన నిధులు.. అందుకు సంబంధించిన పనులు చేపట్టకుండానే బిల్లులు చెల్లించినట్లు తెలుస్తుంది. గతంలో ఇంజనీర్లుగా పని చేసిన అధికారులకు తాజాగా కోర్టు నోటీసులు అందాయి. దీంతో ఈ విషయం కాస్తా బహిర్గతమైంది. ఈ నేపథ్యంలో జలవనరుల శాఖ ఉన్నతాధికారులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు.
Also Read: తోటకూర తినడం వల్ల ఇన్ని లాభాలా..?
గత జగన్ ప్రభుత్వ హయాంలో భారీగా అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయి. అందుకు నాటి ప్రభుత్వ తీరే ఉదాహరణ. గత ప్రభుత్వంలో పలు శాఖల మంత్రులు సమీక్షలు సైతం నిర్వహించిన దాఖలాలు అయితే లేవన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ పనులు ఎంత వరకు వచ్చాయంటే.. ఆ శాఖను నిర్వహించిన ఇద్దరు మంత్రులు సైతం చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. అలాగే ప్రతిపక్ష నేతగా రాజధాని అమరావతి నిర్మాణానికి అసెంబ్లీ సాక్షిగా వైఎస్ జగన్ మద్దతు తెలిపారు. అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులుండాలంటూ అదే అసంబ్లీ సాక్షిగా సీఎంగా వైఎస్ జగన్ కీలక ప్రకటించారు.
Also Read: మాచర్ల ఎమ్మెల్యే బావమరిదిపై దాడి..
దీంతో రాజధానికి భూమలు ఇచ్చిన రైతులు, ప్రజలు సైతం ఆందోళలనకు దిగారు. కానీ ఫలితం లేకుండా పోయింది. పోని మూడు రాజధానులు అని చెప్పి.. ఆయా ప్రాంతాల్లో నిర్మాణాలు ఏమైనా సీఎం వైఎస్ జగన్ చేపట్టారా? అంటే అది కూడా లేదు. కేవలం సంక్షేమ పథకాల పేరుతో ప్రజల బ్యాంక్ ఖాతాల్లోకి నిధులు జమ చేసే వారు. అందుకోసం బటన్లు నొక్కే వారు. దీంతో రాష్ట్రంలో అభివృద్ది అనేది లేకుండా పోయింది. ఇక యువతకు ఉపాధి సైతం లేకపోవడంతో.. వారంత ఇతర రాష్ట్రాల బాట పట్టారు. మరోవైపు అధికారంలోకి రాగానే జగన్ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ అంటూ కొత్త పల్లవి చేపట్టింది.
దాంతో అంతకు ముందు టీడీపీ ప్రభుత్వంలో ఊపందుకున్న పలు అభివృద్ధి పనులన్నీ అర్థాంతరంగా ఆగిపోయాయి. ఇక ప్రభుత్వ పర్యవేక్షణ సైతం లేకపోవడంతో వివిధ శాఖల్లో భారీగా అవినీతి చోటు చేసుకుంది. అంతలో ఎన్నికలు రానే వచ్చాయి. ఆ క్రమంలో కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ఓటరు పట్టం కట్టారు. అందులోభాగంగా చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. అలాగే గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి సారించింది. దీంతో నాటి ప్రభుత్వంలో వివిధ శాఖల్లో చోటు చేసుకున్న అవినీతి ఒక్కొక్కటిగా బహిర్గతమవుతుంది. తాజాగా కర్నూలు జిల్లాలోని జలవనరుల శాఖలో కోట్లాది రూపాయిల మేర అవినీతి జరిగినట్లు బహిర్గతమైంది. ఆ దిశాగా అధికారులు విచారణ చేపట్టారు.
For AndhraPradesh News And Telugu News
Updated Date - Nov 03 , 2024 | 09:41 AM