Gaganyaan Mission : లాంచ్ కాంప్లెక్స్‌కు ఎస్200 సాలిడ్ మోటార్
ABN, Publish Date - Dec 14 , 2024 | 04:33 AM
భారత తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్ మిషన్‌లో కీలక ముందడుగు పడింది.
షార్‌లో వేగం పుంజుకున్న ‘గగన్‌యాన్’ పనులు
సూళ్లూరుపేట, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): భారత తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్ మిషన్‌లో కీలక ముందడుగు పడింది. దీనిలో ఒక రోబోను అంతరిక్షంలోకి పంపి దాన్ని తిరిగి సురక్షితంగా భూమి మీదకు తీసుకురానున్నారు. ఈ ప్రయోగాన్ని తిరుపతి జిల్లాలోని శ్రీహరికోట వేదికగా జనవరిలో చేపట్టే అవకాశం ఉంది. దీనికోసం హెచ్‌ఎల్‌వీఎం3-జీ1 రాకెట్‌ను సిద్ధం చేస్తున్నారు. ఈ రాకెట్‌లో కీలకమైన దశలో వినియోగించే ఎస్200 సాలిడ్ మోటారు సెగ్మెంట్‌ను శుక్రవారం రాకెట్ లాంచ్ కాంప్లెక్స్‌కు తరలించారు.
Updated Date - Dec 14 , 2024 | 04:34 AM