Sakshi Bad Manner: మరోసారి అడ్డంగా దొరికేసిన సాక్షి.. ఇకనైనా ఆపు నీ డ్రామాలు..

ABN, Publish Date - Oct 08 , 2024 | 02:20 PM

ఆంధ్రజ్యోతిపై బురదజల్లాలనే ప్రయత్నం చేస్తూ సాక్షి సంస్థ మరోసారి అడ్డంగా దొరికేసింది. సాక్షి వంకర బుద్ధి.. కుట్రపూరిత వైఖరిని ప్రజల ముందుంచుకుంది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కొడితే సాక్షి వస్తుందని చెబితే.. ఆంధ్రజ్యోతితో పాటు..

Sakshi Bad Manner: మరోసారి అడ్డంగా దొరికేసిన సాక్షి.. ఇకనైనా ఆపు నీ డ్రామాలు..
Sakshi Bad Manner

సాక్షి మరోసారి అడ్డంగా దొరికేసింది. చేసిన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో తప్పుల మీద తప్పులు చేస్తూ పోతుంది. టెక్నాలజీలో తాము గూగుల్‌ను మించిపోయామనే కవరింగ్ ఇస్తూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ట్యాగ్ వాడటంపై వివరణ ఇస్తూ పప్పులో కాలేసింది. సాక్షి చేసిన పాడు పని జనాలకు తెలియడంతో తమ పరువుపోతుందని గ్రహించిన సాక్షి తాము శుద్ధపూసలం.. తమకు ఎలాంటి పాపం తెలియదన్నట్లు బిల్డప్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ.. ఏబీఎన్‌పై మరోసారి బురదజల్లే ప్రయత్నం చేసింది. ఈనాడు ట్యాగ్‌ను ఆంధ్రజ్యోతి వాడుకుంటుందంటూ లేనిపోని అసత్య ప్రచారాన్ని తెరపైకి తెచ్చింది. సాక్షి డిబేట్‌లో ఆంధ్రజ్యోతిపై బురదజల్లాలనే ప్రయత్నం చేస్తూ ఆ సంస్థ మరోసారి అడ్డంగా దొరికేసింది. సాక్షి వంకర బుద్ధి.. కుట్రపూరిత వైఖరిని ప్రజల ముందుంచుకుంది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కొడితే సాక్షి వస్తుందని చెబితే.. ఆంధ్రజ్యోతితో పాటు స్పేచ్ ఇచ్చి ఈనాడు అని సెర్చ్ చేసి.. అదిగో ఆంధ్రజ్యోతి అంటే ఈనాడు వస్తుంది చూడడంటూ తప్పును కవరింగ్ చేసుకునే ప్రయత్నంలో సాక్షి మరోసారి తమకు బుర్ర లేదనే విషయాన్ని బయటపెట్టుకుంది. ఇదే డిబెట్‌లో సాక్షి ట్యాగ్‌ను ఆంధ్రజ్యోతి వాడిందని.. దానిని డిలీట్ చేసిందంటూ మరో అసత్య ప్రచారాన్ని తెరపైకి తెచ్చింది. ఇప్పుడే కాదు.. ఆంధ్రజ్యోతి ఎప్పుడూ సాక్షి ట్యాగ్‌ను ఉపయోగించలేదు. ఏ వార్తకైనా ఆ ట్యాగ్ ఉపయోగించి ఉంటే ఆ వార్త ఓపెన్ చేయగానే ట్యాగ్ కనిపిస్తుంది. ఇప్పటికే సాక్షి ఏబీఎన్ -ఆంధ్రజ్యోతి ట్యాగ్‌ను హైడ్ చేసినా.. ఇంతకు ముందు ఉపయోగించిన వార్తల్లో ట్యాగ్ కనిపిస్తూనే ఉంటుంది. ఆంధ్రజ్యోతి సాక్షి ట్యాగ్‌ను ఉపయోగించినట్లు ఎలాంటి ఆధారాలు లేవు.. ఎప్పుడూ ఉపయోగించలేదు. చేసిన తప్పుకు క్షమాపణ చెప్పకుండా.. తప్పుల మీద తప్పులు చేస్తుంది. సాక్షి డిబెట్‌లో చెప్పిన అబద్ధాలు చూస్తే ఆ సంస్థ యాజమాన్యానికి బుర్ర లేదనే విషయం ప్రతి సామాన్యుడికి అర్థమవుతుంది.

WhatsApp Image 2024-10-08 at 2.03.44 PM.jpeg


తప్పు ఒప్పుకుంటూనే..

సాక్షి తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఆ సంస్థ ఎడిటోరియల్‌లో ఎడిటర్ ఒక వివరణ ఇస్తూ.. తాము తప్పు చేశామన్న విషయాన్ని చెప్పకనే చెప్పారు. ఒక సంస్థకు సంబంధించిన ట్యాగ్‌లైన్‌ను మరో వార్తా సంస్థ ఉపయోగించదనే విషయాన్ని ఒప్పుకున్నారు. అంటే వాడకూడదని తెలిసినా.. ఆంధ్రజ్యోతికి సంబంధించిన కథనాలు రాసినప్పుడు రిలేటడ్ ట్యాగ్ ‌లైన్ వాడాల్సి వస్తుందంటూ తప్పును కప్పిపుచ్చుకునేందుకు వివరణ ఇచ్చారు. ఇక్కడే సాక్షికి టెక్నాలజీపై, వెబ్ నాలెడ్జ్‌పై ఎంత అవగాహన ఉందో అర్థం చేసుకోవచ్చు.


ఏదైనా ఒక వార్తను రాసేటప్పుడు దానికి సంబంధించి కీ వర్డ్స్‌ను ఉపయోగిస్తారు.. కానీ ప్రతి వార్తకు ట్యాగ్‌లను ఉపయోగించరనే కనీస అవగాహన లేదనే విషయం ప్రజలకు అర్థమైపోయింది. ట్యాగ్‌ను ఎందుకు ఉపయోగిస్తారు.. కీ వర్డ్స్‌ను ఎందుకు ఉపయోగిస్తారనే అవగాహన లేకుండా తాము తోపులం అని చెప్పుకుంటే ఎవరు నమ్ముతారు. ట్యాగ్‌లను ఎప్పుడు, ఎందుకు ఉపయోగిస్తారనే విషయాన్ని వెబ్ టెక్నాలజీపై అవగాహన ఉన్న వ్యక్తులను అడిగితే తెలుస్తుంది. ఆంధ్రజ్యోతిపై బురద జల్లేందుకు ప్రయత్నించిన సాక్షి తన అజ్ఞానాన్ని బయటపెట్టుకుంది. ఇకనైనా డ్రామాలు ఆపి.. తప్పును ఒప్పుకుంటే మంచిది. లేదు తమ అజ్ఞానాన్ని తాము బయటపెట్టుకుంటామని సాక్షి ఉవ్విళ్లూరుతుంటే ఎవరైనా ఏం చేయగలరు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Latest Telugu News Click Here

Updated Date - Oct 08 , 2024 | 03:12 PM