ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

CM Jagan: ఎన్జీటీలో సీఎం జగన్‌కు ఎదురుదెబ్బ

ABN, Publish Date - Feb 21 , 2024 | 01:47 PM

ఎన్జీటీలో ఏపీ సీఎం జగన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలపై ఎన్జీటీ మండిపడింది. ఏపీలో అక్రమ మైనింగ్‌పై సుప్రీంకోర్టుకు నేడు ఎన్జీటీ నివేదించింది. ఏపీలో అక్రమ మైనింగ్‌పై ఎన్జీటీలో సామాజిక కార్యకర్త దండా నాగేంద్ర పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్‌పై విచారించి ఏపీలో ఇసుక తవ్వకాలు నిలిపివేయాలని గతంలో ఎన్జీటీ ఆదేశించింది.

ఢిల్లీ: ఎన్జీటీలో ఏపీ సీఎం జగన్‌ (AP CM Jagan)కు ఎదురుదెబ్బ తగిలింది. ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలపై ఎన్జీటీ మండిపడింది. ఏపీలో అక్రమ మైనింగ్‌పై సుప్రీంకోర్టు (Supreme Court)కు నేడు ఎన్జీటీ నివేదించింది. ఏపీలో అక్రమ మైనింగ్‌పై ఎన్జీటీ (NGT)లో సామాజిక కార్యకర్త దండా నాగేంద్ర పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్‌పై విచారించి ఏపీలో ఇసుక తవ్వకాలు నిలిపివేయాలని గతంలో ఎన్జీటీ ఆదేశించింది. ఏపీలో అక్రమ మైనింగ్‌పై నేడు ఎన్జీటీకి కేంద్ర పర్యావరణ అటవీశాఖ (Central Environment Forest Department) కమిటీ నివేదిక ఇచ్చింది. పర్యావరణ అనుమతులు లేకుండా ఏపీలో ఇంకా భారీగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నట్లు నివేదికలో కేంద్ర కమిటి నిర్ధారించింది. ఫోటోలతో పాటు ఇతర సాక్ష్యాధారాలతో నివేదికను కేంద్ర కమిటి ఎన్జీటీకి అందజేసింది.

18 కోట్ల జరిమానా..

కేంద్ర కమిటి నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించాలని కేంద్ర పర్యావరణ అటవీశాఖకు ఎన్జీటీ ఆదేశాలను జారీ చేసింది. యంత్రాలతో ఇసుక మైనింగ్‌కు అనుమతులు లేనప్పటికీ భారీ యంత్రాలతో భారీగా అక్రమాలకు పాల్పడుతున్నట్లు నివేదికలో కేంద్ర కమిటి పేర్కొంది. గతంలో ఇసుక అక్రమాలపై జేపీ పవర్ వెంచర్స్ కి 18 కోట్లు తాత్కాలికంగా ఎన్జీటీ జరిమానా విధించింది. మొత్తం ఎన్ని రీచ్‌లలో అక్రమ మైనింగ్ జరుగుతుందో తేల్చాలని కమిటీని కూడా నియమించింది. అక్రమాలు జరిగినట్లు నివేదికలో వెల్లడైతే ప్రతి రీచ్ కి కోటి రూపాయల చొప్పున జరిమానా చెల్లించాలని కూడా ఎన్జీటీ ఆదేశించింది.

సుప్రీంలో సవాల్ చేసిన జేపీ పవర్స్..

ఏపీలో 40 రీచ్‌లలో మ్యానువల్ మైనింగ్‌కి ఈసీ అనుమతులుంటే 500 లకు పైగా రీచ్‌లలో ఈసీ అనుమతులు లేకుండా యంత్రాలతో ఇసుక మైనింగ్ చేస్తున్నట్లు కేంద్ర కమిటీ నివేదికలో బట్టబయలు చేసింది. కేంద్ర కమిటీ నివేదిక ప్రకారం జేపీ పవర్ వెంచర్ కంపెనీ రూ.500 కోట్లకు పైగా జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ఎన్జీటీ అభిప్రాయపడింది. గతంలో ఎన్జీటీ ఆదేశాలను జేపీ పవర్ వెంచర్స్ సుప్రీంలో సవాలు చేసింది. ఎన్జీటీ విధించిన జరిమానాను నిలిపివేసేందుకు సుప్రీంకోర్టు షరతులు విధించింది. మైనింగ్‌ను వెంటనే నిలిపివేయడమే కాకుండా అసలు ఎంతమేరకు అక్రమ మైనింగ్ జరిగిందో కేంద్ర కమిటి ద్వారా నిగ్గు తేల్చాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతవరకూ ఎన్జీటీ విధించిన జరిమానాపై తాత్కాలికంగా సుప్రీంకోర్టు స్టే విధించింది.

ఏపీ ప్రభుత్వం ఖాతరు చేయడం లేదు..

గతంలో తాము ఇచ్చిన ఆదేశాలను సుప్రీంలో సవాలు చేసినందున ఇసుక మైనింగ్ అక్రమాలపై కేంద్ర పర్యావరణ, అటవీశాఖ కమిటీ నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించాలని నేడు ఎన్జీటీ ఆదేశించింది. తమ ఆదేశాలను కూడా ఏపీ ప్రభుత్వం ఖాతరు చేయడం లేదని కేంద్ర కమిటీ నివేదిక ద్వారా స్పష్టమవుతోందని ఎన్జీటీ తెలిపింది. సుప్రీంకోర్టే ఏపీలో జరుగుతున్న అక్రమ ఇసుక మైనింగ్‌పై తుది నిర్ణయం తీసుకుంటుందని కేసును సుప్రీంకు ఎన్జీటీ రిఫర్ చేసింది. వచ్చే వారం సుప్రీంకోర్టులో ఏపీ అక్రమ ఇసుక తవ్వకాలపై విచారణ జరిగే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి..

YCP: జగన్‌కు బిగ్ షాక్.. పార్టీని వీడాలని డిసైడ్ అయిన ఎంపీ !

Bandaru Satyanarayana: రేపు మీ సాక్షికి కూడా ఇదే గతి..

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 21 , 2024 | 01:58 PM

Advertising
Advertising