ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Drugs Case: మస్తాన్ సాయి కేసులో సంచలన నిజాలు.. కదులుతున్న డ్రగ్స్ డొంక

ABN, Publish Date - Aug 13 , 2024 | 05:29 PM

డ్రగ్ ఫెడ్లర్ మస్తాన్ సాయి అరెస్ట్‌తో సంచలన నిజాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. సోమవారం నాడు మస్తాన్‌ను అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు.. హైదరాబాద్‌లో డ్రగ్ సప్లై, కస్టమర్లు వ్యవహారంపై ఆరా తీశారు. ఈ టైమ్‌లోనే మస్తాన్ ఫ్రెండ్ ప్రీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో పాటు అమ్మాయిలతో అసభ్యంగా ఉన్న ఫొటోలు, వీడియోలు వెలుగుచూశాయి...

అమరావతి/హైదరాబాద్: డ్రగ్ ఫెడ్లర్ మస్తాన్ సాయి (Mastan Sai) అరెస్ట్‌తో సంచలన నిజాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. సోమవారం నాడు మస్తాన్‌ను అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు.. హైదరాబాద్‌లో డ్రగ్ సప్లై, కస్టమర్లు వ్యవహారంపై ఆరా తీశారు. ఈ టైమ్‌లోనే మస్తాన్ ఫ్రెండ్ ప్రీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో పాటు అమ్మాయిలతో అసభ్యంగా ఉన్న ఫొటోలు, వీడియోలు వెలుగుచూశాయి. మస్తాన్ ఫోన్ ఓపెన్ చేసిన పోలీసులు అందులోని ఫొటోలు, వీడియోలు చూసి కంగుతిన్నారు..! అమ్మాయిలతో అసభ్యంగా ఉన్న ఫోటోలు, వీడియోలను మస్తాన్ సాయి రికార్డ్ చేసి సేవ్ చేసుకున్నాడు. డ్రగ్స్, గంజాయి సేవిస్తున్న సమయంలో కూడా ప్రీతి, ఉదయ్ వీడియోలు తీసుకున్నారు. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియా‌లో హల్‌చల్ చేస్తున్నాయి.


చాటింగ్ చూస్తే..!

డ్రగ్స్ కావాలని మస్తాన్ సాయితో ప్రీతి చేసిన వాట్సప్ చాటింగ్ మొత్తం అంతా బయటికి వచ్చింది. ‘నాకు తిక్కరేగితే అందరిని డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’నని వాట్సప్‌లో చాటింగ్ చేసింది ప్రీతి. ఇలా ఇదొక్కటే చాలా విషయాలపై ఇద్దరి మధ్య జరిగిన చాటింగ్ వ్యవహారం మొత్తం వీడియో రూపంలో బయటికొచ్చింది. బాబోయ్.. పచ్చి బూతులతో ఉన్న ఆ చాటింగ్ చూస్తే ముక్కున వేలేసుకుంటారు అంతే!. అమ్మాయిలతో మస్తాన్ ఉన్న ఫొటోలు, వీడియోలు.. డ్రగ్స్ తీసుకుంటున్న వ్యక్తుల ఫోటోలు, అమ్మాయిల ఫొటోలు.. వీడియోలు ఇలా అన్నీ బయటికి రావడంతో పోలీసులు తర్వాత స్టెప్ ఏంటి..? వాళ్లను కూడా పిలిపించి విచారిస్తారా..? లేకుంటే మరేం చేయబోతున్నారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.


ఇలా దొరికాడు..!

ఇదిలా ఉంటే.. లావణ్య, సినీనటుడు రాజ్‌తరుణ్‌ కేసులో డ్రగ్స్‌ వ్యవహారం నిజమేనని తేలింది. వారికి మాదకద్రవ్యం సరఫరా చేసిన కీలక నిందితుడిని విజయవాడ సెబ్‌ (స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో) పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వాస్తవానికి ఒక కేసులో ఈ నిందితుడిని అరెస్టు చేస్తే ఇందులోకి లావణ్య, రాజ్‌తరుణ్‌ ఎపిసోడ్‌ వచ్చి చేరింది. రాజ్‌తరుణ్‌తో తనకు పరిచయం ఉన్నదని, ఆ పరిచయంతోనే రాజ్‌తరుణ్‌, లావణ్యలకు డ్రగ్‌ సరఫరా చేశానని ఈ కేసులో నిందితుడు రావి సాయిమస్తాన్‌రావు(మస్తాన్‌సాయి) అంగీకరించినట్టు సమాచారం. మస్తాన్‌‌ను సెబ్‌ నిఘా అధికారులు సోమవారం గుంటూరులో అరెస్టుచేసి విజయవాడకు తరలించారు. రెండు నెలలుగా హైదరాబాద్‌లో ఉన్న సాయిమస్తాన్‌రావు కోసం సెబ్‌ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అతడి కదలికలపై నిఘా పెట్టారు. కొన్ని బృందాలు హైదరాబాద్‌ కేంద్రంగా నిఘా కొనసాగిస్తున్నారు. ఈ తరుణంలోనే అతడు రెండు రోజుల క్రితం హైదరాబాద్‌ నుంచి గుంటూరు నగరపాలెంలో ఉన్న దర్గాకు వచ్చాడు. ఈ దర్గాకు ధర్మకర్తగా అతని తండ్రి రావి రామ్మోహన్‌రావు ఉన్నారు. అక్కడే సాయిమస్తాన్‌రావు తలదాచుకుంటున్నాడు. ఈ సమాచారాన్ని సేకరించిన పోలీసులు, సాయిమస్తాన్‌రావును దర్గా పరిసరాల్లో సోమవారం అరెస్టు చేసి విజయవాడకు తరలించారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా మారిన సినీనటుడు రాజ్‌తరుణ్‌, లావణ్యల కేసు లింక్‌లు తగిలాయి.

Updated Date - Aug 13 , 2024 | 06:00 PM

Advertising
Advertising
<