ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

SIT Investigates : ‘కల్తీ నెయ్యి’పై మరింత కదలిక

ABN, Publish Date - Dec 15 , 2024 | 05:10 AM

తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా అయిందన్న ఆరోపణలపై దర్యాప్తు కోసం సుప్రీం కోర్టు నియమించిన సిట్‌ బృందం చకచకా విచారణ కొనసాగిస్తోంది.

  • చకచకా సాగుతున్న సిట్‌ విచారణ

  • తిరుమలలో విస్తృత దర్యాప్తు

  • బూందీపోటు కేంద్రం, ల్యాబ్‌ పరిశీలన

  • సీబీఐ డైరెక్టర్‌కు మధ్యంతర నివేదిక

తిరుపతి, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా అయిందన్న ఆరోపణలపై దర్యాప్తు కోసం సుప్రీం కోర్టు నియమించిన సిట్‌ బృందం చకచకా విచారణ కొనసాగిస్తోంది. సీబీఐ జేడీ, ఎస్పీ, ఏపీ పోలీసు ఐజీ, ఫుడ్‌ సేఫ్టీ అధికారులతో కూడిన సిట్‌ బృందం శుక్రవారం రాత్రే ఆరోపణలు ఎదుర్కొంటున్న వైష్ణవీ డెయిరీలో తనిఖీలు చేయగా, శనివారం దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు. తిరుమల కొండపై పోటు, బూందీ తయారీ కేంద్రం, నెయ్యి నిల్వ కేంద్రం, ల్యాబ్‌ వంటి ప్రదేశాలను పరిశీలించారు. సిట్‌ బృంద కీలక అధికారులు శనివారం వేకువజామున తిరుమల చేరుకున్నారు. తొలుత శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ఆవరణలోనే వున్న శ్రీవారి లడ్డూ పోటును పరిశీలించారు. ఆపై ఆలయం వెలుపల ఉత్తర దిశలో ఉన్న నెయ్యి నిల్వ చేసే షెడ్డుకు చేరుకున్నారు. అక్కడ రెండు నెయ్యి ట్యాంకర్లు పరిశీలించారు. తర్వాత బూందీ తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. అక్కడ నుంచి కాలినడకన అర్చక నిలయం మీదుగా ల్యాబ్‌కు వెళ్లారు. దాదాపు అరగంటకు పైగానే ల్యాబ్‌లో గడిపారు. నెయ్యి నాణ్యతను నిర్ధారించే పరికరాలను అక్కడ పరిశీలించారు. వాటి స్థాయి ఏమిటి? నాణ్యతా పరీక్షలు ఎలా చేస్తున్నారు? వంటి ప్రశ్నలు వేశారు. పూర్తిస్థాయిలో పరీక్షించే అధునాతన పరికరాలు ఎందుకు లేవని ప్రశ్నించారు. ల్యాబ్‌లో పనిచేస్తున్న సిబ్బంది సంఖ్య, వారి అనుభవం, అర్హత వంటివి ఆరా తీశారు.


నాణ్యతా పరీక్షలకు పూర్తిస్థాయి పరికరాలు లేనప్పుడు ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదని ప్రశ్నించారు. నెయ్యి ట్యాంకర్‌ వచ్చాక శాంపిల్స్‌ ఎలా సేకరిస్తారు? వాటిని ఎక్కడ నమోదు చేస్తారు? ఆరోపణలు వచ్చిన నెయ్యిలో నాణ్యత లేదని ఎలా గ్రహించారు? తదితర ప్రశ్నలు అడిగారు.అయితే ల్యాబ్‌ సిబ్బంది చాలావరకూ సమాధానాలు ఇవ్వలేకపోయారు. లడ్డూ తయారీకి రోజువారీ వినియోగించే ముడిసరుకుల పరిమాణం వంటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే పప్పు దినుసులు నిల్వ చేసే ప్రాంతాన్ని పరిశీలించారు. వాటి రోజువారీ వినియోగం మోతాదు, నాణ్యతా పరీక్షల గురించి ఆరా తీశారు. పిండి మరలను కూడా పరిశీలించారు. అవసరమైన వాటి ఫొటోలు తీసుకోవడంతో పాటు రికార్డులు కూడా సేకరించారు. వీరి వెంట టీటీడీ సీవీఎస్వో శ్రీధర్‌, మార్కెటింగ్‌ ఇన్‌చార్జి పద్మావతి, సూపరింటెండెంట్‌ సురేశ్‌, తిరుపతి ఏఎస్పీ వెంకట్రావు తదితరులు ఉన్నారు.

Updated Date - Dec 15 , 2024 | 05:11 AM