Nara Lokesh: టీడీపీ ఎప్పుడు ‘ఆ పని’ చేయదు..
ABN, Publish Date - Jun 07 , 2024 | 06:37 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేశారు. అంతేకానీ తామకు మంత్రి పదవులు ముఖ్యం కాదన్నారు. అయినా తమ పార్టీ పదవుల కోసం ఎప్పుడు సంప్రదింపులు జరపదని తెలిపారు.
న్యూఢిల్లీ, జూన్ 07: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేశారు. అంతేకానీ తామకు మంత్రి పదవులు ముఖ్యం కాదన్నారు. అయినా తమ పార్టీ పదవుల కోసం ఎప్పుడు సంప్రదింపులు జరపదని తెలిపారు. అయితే రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో మాత్రం కచ్చితంగా కేంద్రంతో సంప్రదింపులు జరిపి తీరుతామని నారా లోకేశ్ పేర్కొన్నారు. శుక్రవారం జాతీయ మీడియాకు నారా లోకేశ్ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ క్రమంలో లోక్‌సభ స్పీకర్ పదవితోపాటు కీలక మంత్రి శాఖలు తెలుగుదేశం పార్టీ కోరినట్లు జరుగుతున్న ప్రచారంపై యాంకర్ ప్రశ్నకు టీడీపీ యువనేత నారా లోకేశ్‌పై విధంగా స్పందించారు. అంతేకాదు ఈ ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
Also Read: మోదీ ఆరోపణలు.. కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం
అలాగే రాష్ట్రంలో ముస్లిం రిజర్వేషన్లను కొనసాగిస్తామన్నారు. వారికి రిజర్వేషన్ల కోసం రెండు దశాబ్దాలుగా వారితోనే ఉన్నామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అయితే ముస్లింలకు రిజర్వేషన్లు అనేవి.. వారిని బుజ్జగించేందుకు చేపట్టినవి కావని.. వారి సామాజిక న్యాయం కోసం చేపట్టినవని నారా లోకేశ్ వివరించారు. వారికి రిజర్వేషన్లు ఎందుకంటే.. రాష్ట్రంలో మైనారిటీల తలసరి ఆదాయం చాలా తక్కువగా ఉందన్నారు. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఇది వాస్తమని నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఆ క్రమంలో వారిని పేదరికం నుంచి బయట తీసుకు రావడమే తమ ప్రభుత్వ బాధ్యత అన్నారు. అయితే ఎన్డీయే భాగస్వామ్య పక్షమైన బీజేపీ ముస్లిం రిజర్వేషన్లను పూర్తిగా వ్యతిరేకిస్తుంది.. మరి వారికి రిజర్వేషన్లు కొనసాగిస్తారా? అంటూ అడిగిన ప్రశ్నకు నారా లోకేశ్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. అలాగే తమ పార్టీ ఉద్యోగాల కల్పన, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తుందని నారా లోకేశ్ పునరుద్ఘాటించారు.
Also Read: అద్వానీ, జోషిల నుంచి ఆశీర్వాదం తీసుకున్న మోదీ
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో నారా చంద్రబాబు నాయుడును జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేయడంపై నారా లోకేశ్ స్పందించారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమమన్నారు. ఇది ప్రతీకార రాజకీయ చర్యగా ఆయన అభివర్ణించారు. అయితే తామంతా ప్రతీకార రాజకీయాలకు బాధితులమని గుర్తు చేశారు. కానీ చట్టం ప్రతీ ఒక్కరికీ సమానమేనని.. దేశంలో ప్రతీకార రాజకీయాలకు చోటే లేదన్నారు.
Also Read: నలుగురు భారతీయ వైద్య విద్యార్థులు మృతి
బలమైన రాష్ట్రాలు.. బలమైన దేశాన్ని తయారు చేస్తాయి. ఆ క్రమంలో తాము 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ కలలో భాగం కావాలని కోరుకుంటున్నామన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రమే 1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారగలదని తాము నమ్ముతున్నామని చెప్పారు. ఆ క్రమంలో ఎన్డీయేతో కలిసి పని చేసేందుకు ఎదురు చూస్తున్నామని లోకేశ్ వివరించారు.
Also Read: బాలీవుడ్ మౌనంపై కంగనా రనౌత్ స్పందన
ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ గెలుపులో నారా లోకేశ్ కీలక పాత్ర పోషించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. దీంతో ఆయన్ని 52 రోజుల పాటు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉంచింది. ఆ సమయంలో పార్టీలో నారా లోకేశ్ కీలక పాత్ర పోషించారు. అలాగే 2023 జనవరి 27వ తేదీన ఉమ్మడి చిత్తూరు జిల్లా కుప్పంలో యువగళం పేరుతో ఆయన పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఆ క్రమంలో ప్రతీ రోజు ప్రజల మధ్య ఉంటూ.. వారి సమస్యలు తెలుసుకొంటూ నారా లోకేశ్ ముందుకు సాగిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఎన్నికల్లో మంగళగిరి ఎమ్మెల్యేగా నారా లోకేశ్ 91 వేలకు పైగా ఓట్ల అధిక్యంతో గెలుపొందిన విషయం విధితమే.
For Latest News and National News click here
Updated Date - Jun 07 , 2024 | 06:44 PM