ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Janasena: జనసేన పోటీ చేసే అసెంబ్లీ సీట్ల లెక్క ఫైనల్‌గా ఇదే..!

ABN, Publish Date - Feb 27 , 2024 | 04:58 AM

AP Elections 2024: టీడీపీతో పొత్తులో భాగంగా జనసేన పోటీ చేసే స్థానాలపై గట్టి కసరత్తే నడుస్తోంది. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో దాదాపు 15 స్థానాల నుంచి ఆ పార్టీ పోటీ చేయనుండగా..

  • దక్షిణ కోస్తా, సీమల్లో 9 సీట్లు!

  • కృష్ణా, గుంటూరు, ప్రకాశంలో జనసేనకు రెండేసి.. రాయలసీమలో 3 స్థానాలు

  • కృష్ణాలో విజయవాడ వెస్ట్‌, అవనిగడ్డ

  • గుంటూరు పశ్చిమ లేదా తూర్పు

  • ప్రకాశంలో దర్శి ఖరారు.. రెండోది గిద్దలూరు లేదా చీరాల

  • చిత్తూరులో తిరుపతి, మదనపల్లె, శ్రీకాళహస్తిల్లో రెండు దక్కే చాన్స్‌

  • ధర్మవరం కోసం పవన్‌ గట్టి యత్నాలు

అమరావతి, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): టీడీపీతో పొత్తులో భాగంగా జనసేన (Janasena) పోటీ చేసే స్థానాలపై గట్టి కసరత్తే నడుస్తోంది. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో దాదాపు 15 స్థానాల నుంచి ఆ పార్టీ పోటీ చేయనుండగా.. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తొమ్మిది స్థానాల్లో మాత్రమే బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో రెండు స్థానాలు జనసేనకు దక్కే అవకాశముంది. విజయవాడ పశ్చిమ, అవనిగడ్డ కావాలని ఆ పార్టీ కోరుతోంది. విజయవాడ పశ్చిమ, గతంలో ప్రజారాజ్యం గెలిచిన విషయాన్ని జనసేన నేతలు గుర్తుచేస్తున్నారు. ఇక్కడ ముస్లిం సామాజిక వర్గం అధికంగా ఉంటుంది. ఆ వర్గానికి చెందిన వ్యక్తిని పోటీకి దించితే గెలుపు అవకాశం ఎక్కువని పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఇక అవనిగడ్డలో కాపు సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉన్నాయి. అక్కడైతే గెలుపు అవకాశాలు అధికంగా ఉంటాయని జనసేన నాయకులు భావిస్తున్నారు. కానీ అక్కడ టీడీపీ తరఫున బలమైన అభ్యర్థిగా మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్‌ ఉన్నారు. గుంటూరు జిల్లా విషయానికి వస్తే తెనాలి నుంచి పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ బరిలోకి దిగుతున్నారు. గుంటూరు ఈస్ట్‌, వెస్ట్‌ సీట్లలో ఒకటి ఇవ్వాలని జనసేన కోరుతోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాల్లో మూడు స్థానాలపై దృష్టి పెట్టింది. కనీసం రెండైనా ఇవ్వాలని అడుగుతోంది. దర్శి సీటు దాదాపు జనసేనకు ఖరారు అయింది. అక్కడనుంచి గరికపాటి వెంకట్‌ను బరిలోకి దించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఆయన క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తున్నారు.

రెండో సీటుగా గిద్దలూరు లేదా చీరాల అడుగుతోంది. గిద్దలూరులో కాపు ఓటిం గ్‌ శాతం ఎక్కువే అయినా... ఈ సీటు తీసుకుంటే మాత్రం ముస్లిం అభ్యర్థికి కేటాయించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. చీరాల దక్కితే మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ సోదరుడు ఆమంచి స్వాములును అభ్యర్థిగా ఖరారుచేసే అవకాశాలున్నా యి. జనసేన రాయలసీమలో ఆరు స్థానాలపై దృష్టి పెట్టింది. ఇందులో మూడు దక్కే వీలుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో తిరుపతి, మదనపల్లె, శ్రీకాళహస్తి సీట్లను జనసేన కోరుతోంది. ఇందులో రెండైనా దక్కుతాయని భావిస్తోంది. తిరుపతి దాదాపు ఖరారైనట్లేనని అంటున్నారు. ఇక్కడ అభ్యర్థిత్వం కోసం కిరణ్‌ రాయల్‌, హరిప్రసాద్‌తో పాటు మరికొంత మంది పోటీ పడుతున్నారు. అనంతపురం జిలా ధర్మవరం సీటు కోసం తీవ్ర పోటీ నెలకొంది. జనసేన రాయలసీమ ఇన్‌చార్జి చిలకం మధుసూదన్‌రెడ్డి తొలి నుంచీ ఈ నియోజకవర్గంపై దృష్టిపెట్టారు. సీమలో ఆ పార్టీకి రెడ్డి సామాజికవర్గం నుంచి ఉన్న బలమైన నేత ఈయనే. అందుకే పవన్‌ గట్టిగా పట్టుబడుతున్నారు. ఇదే సమయంలో బీజేపీ కూడా పొత్తులో ఆ సీటు కోరే అవకాశం ఉంది. అనంతపురం టౌన్‌ సీటు జనసేనకు ఇవ్వడం దాదాపు ఖాయమైందని అంటున్నారు. పుట్టపర్తి సీటు కూడా అడుగుతున్నట్లు తెలిసింది, కడప జిల్లాలో రాజంపేట లేదా బద్వేల్‌ నుంచి ఆ పార్టీ బరిలోకి దిగే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

Updated Date - Feb 27 , 2024 | 08:41 AM

Advertising
Advertising