ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పెట్టుబడుల సాధనకు.. ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌!

ABN, Publish Date - Aug 17 , 2024 | 03:10 AM

గత ఐదేళ్లలో జగన్‌ ప్రభుత్వ విధానాలతో ఆంధ్రప్రదేశ్‌ వైపు చూడాలంటేనే హడలిపోతున్న పారిశ్రామికవేత్తల్లో నమ్మకం పాదుగొల్పి..

CM Chandrababu Naidu

చైర్మన్‌గా చంద్రబాబు, కో-చైర్మన్‌గా టాటా గ్రూప్‌ అధినేత చంద్రశేఖరన్‌

దేశ ప్రముఖ పారిశ్రామికవేత్తలకూ చోటు

ఆయా రంగాల నిపుణులకు కూడా..

అమరావతిలో ‘సెంటర్‌ ఫర్‌ గ్లోబల్‌ లీడర్‌షిప్‌’

విశాఖలో టీసీఎస్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌

రాష్ట్రంలో ఎయిర్‌ ఇండియా, విస్తారా విస్తరణ

సోలార్‌, టెలికాం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలు

టాటా చంద్రశేఖరన్‌తో సీఎం చర్చలు

సెప్టెంబరు 17న లేలాండ్‌ పునఃప్రారంభం

అమరావతిలో లా యూనివర్సిటీ

ఇందులోనే అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌!

అమరావతి, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): గత ఐదేళ్లలో జగన్‌ ప్రభుత్వ విధానాలతో ఆంధ్రప్రదేశ్‌ వైపు చూడాలంటేనే హడలిపోతున్న పారిశ్రామికవేత్తల్లో నమ్మకం పాదుగొల్పి.. రాష్ట్రానికి మళ్లీ పెద్దఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ముమ్మరం చేశారు. 2047 నాటికి పారిశ్రామిక రంగంలో రాష్ట్రాన్ని నంబర్‌ వన్‌గా నిలపడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేయిస్తున్నారు. ఈ క్రమంలోనే పెట్టుబడిదారులను ఆకర్షించి రాష్ట్రంలో పరిశ్రమలను నెలకొల్పేలా ప్రోత్సహించడంతోపాటు రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి తగిన సూచనలు, సలహాలతో ప్రణాళికలు అందించేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయనుంది.


దీనికి స్వయంగా చంద్రబాబే చైర్మన్‌గా, దిగ్గజ పారిశ్రామిక సంస్థ టాటా గ్రూప్‌ చైర్మన్‌ నటరాజన్‌ చంద్రశేఖరన్‌ కో-చైర్మన్‌గా ఉంటారు. ఇందులో దేశంలో పేరుమోసిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ఆయా రంగా నిపుణులు కూడా సభ్యులుగా ఉంటారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించి, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఈ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ దృష్టిపెడుతుంది.

నటరాజన్‌ చంద్రశేఖరన్‌ శుక్రవారమిక్కడ అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి, స్వర్ణాంధ్రప్రదేశ్‌ విజన్‌-2047 రూపకల్పన, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు ప్రైవేటు పారిశ్రామిక సంస్థల నుంచి పెద్దఎత్తున పెట్టుబడులను సాధించే అంశంపైనా విస్తృతంగా చర్చించారు.


విశాఖపట్నంలో టీసీఎస్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌, రాష్ట్రంలో ఎయిర్‌ ఇండియా, విస్తారా ఎయిర్‌లైన్స్‌ విస్తరణ, సోలార్‌, టెలికమ్యూనికేషన్స్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమల ఏర్పాటుపై చంద్రశేఖరన్‌ సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి లోకేశ్‌, పరిశ్రమల మంత్రి టీజీ భరత్‌ కూడా చర్చల్లో పాల్గొన్నారు. చర్చల సారాంశాన్ని చంద్రబాబు ఆ తర్వాత ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు. సీఐఐ డైరెక్టర్‌ జనరల్‌ చంద్రజిత్‌ బెనర్జీ నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో, బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌, సీనియర్‌ న్యాయవాది మనన్‌ కుమార్‌ మిశ్రా నేతృత్వంలోని ప్రతినిధి బృందంతోనూ భేటీ అయినట్లు తెలిపారు.


సీఐఐ భాగస్వామ్యంతో అమరావతిలో ‘సెంటర్‌ ఫర్‌ గ్లోబల్‌ లీడర్‌షిప్‌ ఆన్‌ కాంపిటీటివ్‌నెస్‌’ సంస్థ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సంస్థ ఏర్పాటుకు సీఐఐ ముందుకు రాగా.. అందులో టాటా గ్రూప్‌ కూడా భాగస్వామి కానుంది. ‘ఆర్థికాభివృద్ధిపై టాస్క్‌ఫోర్స్‌ సిఫార్సులను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం-సీఐఐ కలిసి ఇండస్ట్రీ ఫోరం ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాం. అదనంగా మల్టీ స్కిల్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎంఎ్‌సటీఐ), సీఐఐ మోడల్‌ కెరీర్‌ సెంటర్‌ (ఎంసీసీ) వంటి కార్యక్రమాల ద్వారా ఏపీలో యువత నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలను పెంపొందించడంపై దృష్టి సారిస్తాం’ అని చంద్రబాబు తెలిపారు.


Also Read:

అర్థరాత్రి దాడి.. హరీష్ రావు కన్నెర్ర..!

చనిపోతుందేమోనని భయపడ్డాం..

షాకింగ్.. భారీగా పెరిగిన బంగారం, వెండి రేట్లు

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Aug 17 , 2024 | 09:23 AM

Advertising
Advertising
<