తీరు మారని బోరుగడ్డ
ABN, Publish Date - Oct 31 , 2024 | 03:51 AM
వైసీపీ ప్రభుత్వ హయాంలో హద్దుమీరి రెచ్చిపోయిన.. రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌ను పోలీసులు బుధవారం రాత్రి శ్రీకాకుళం కోర్టులో హాజరుపరిచారు.
శ్రీకాకుళం కోర్టు ఆవరణలో మీడియాపై చిందులు
5వ తేదీ వరకు రిమాండ్
రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు
శ్రీకాకుళం/శ్రీకాకుళం క్రైం, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ హయాంలో హద్దుమీరి రెచ్చిపోయిన.. రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌ను పోలీసులు బుధవారం రాత్రి శ్రీకాకుళం కోర్టులో హాజరుపరిచారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నాయకుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుపైనా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పైనా సోషల్ మీడియా వేదికగా బోరుగడ్డ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై శ్రీకాకుళం నియోజకవర్గం గార మండలానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు బోర సురేష్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు మే 14న కేసు నమోదు చేశారు. ఈ కేసులో అనిల్‌కు పీటీ వారెంట్ జారీకావడంతో గార పోలీసులు రాజమండ్రి నుంచి తీసుకొచ్చి శ్రీకాకుళం కోర్టులో హాజరుపరిచారు.
రాజమండ్రి జైలుకు తరలింపు
స్పెషల్ మొబైల్ కోర్టు ఇన్‌చార్జి, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి భరణి నవంబరు 5 వరకు అనిల్‌కుమార్‌కు రిమాండ్ విధించారు. అనంతరం బోరుగడ్డను పోలీసులు రాజమండ్రి జైలుకు తరలించారు. కాగా, కోర్టు బయట వాహనంలో నుంచే పోలీసులు పక్కన ఉన్నప్పుడే ఆయన మీడియాపై చిందులు తొక్కారు. పాతబాణీలోనే అనుచిత వ్యాఖ్యలు చేశారు. తనను రౌడీషీటర్ అన్నవారి సంగతి తేల్చేస్తానని.. జాతీయ ఎస్సీ కమిషన్‌కు వెళ్తానని.. తానేంటో చూపిస్తానంటూ రెచ్చిపోయారు. ఇప్పటికే కొన్ని రోజుల నుంచి రిమాండ్‌లో ఉంటూ పాత కేసుల్లో ఒక్కో కోర్టుకు వెళ్లివస్తూ.. రిమాండ్‌లు పొడిగింపు జరుగుతున్నా.. బోరుగడ్డలో ఎలాంటి మార్పు రాలేదని.. పోలీసులు పక్కన ఉండగానే బెదిరింపులకు పాల్పడటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇది కూడా చదవండి
TTD Chairman: టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడు..
మరిన్ని ఏపీ వార్తల కోసం
Updated Date - Oct 31 , 2024 | 07:06 AM