ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TDP: శ్రీకాకుళం ఎన్టీఆర్ మున్సిపల్ గ్రౌండ్స్‌లో మహిళా సదస్సు.. పాల్గొననున్న చంద్రబాబు

ABN, Publish Date - Apr 24 , 2024 | 07:14 AM

శ్రీకాకుళం జిల్లా: ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండో రోజు బుధవారం పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం ఎన్టీఆర్ మున్సిపల్ గ్రౌండ్స్‌లో మహిళా సదస్సు జరగనుంది. ఈ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్నారు. రాత్రికి పార్టీ కార్యాలయంలోని క్యాంప్ సైట్‌లో బాబు బస చేస్తారు.

శ్రీకాకుళం జిల్లా: ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు (TDP Chief), మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) రెండో రోజు బుధవారం పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం (Srikakulam) ఎన్టీఆర్ మున్సిపల్ గ్రౌండ్స్‌ (NTR Municipal Grounds)లో మహిళా సదస్సు జరగనుంది. ఈ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్నారు. రాత్రికి పార్టీ కార్యాలయంలోని క్యాంప్ సైట్‌లో బాబు బస చేస్తారు.


కాగా మహిళలతో నిర్వహించే సమావేశానికి వెళ్లేందుకు కుదరదని చంద్రబాబు, నాయకులకు పోలీసులు ఆంక్షలు విధించారు. బుధవారం ఉదయం 11గంటలకు ఎన్టీఆర్‌ ఎంహెచ్‌ స్కూల్‌ మైదానంలో మహిళలతో సమావేశం ముందే ఖరారు అయింది. చంద్రబాబు టీడీపీ జిల్లా ఆఫీసు నుంచి ఉదయం 10.50 గంటలకు రోడ్డుమార్గంలో బయల్దేరతారు. అయితే బుధవారం ఉదయం రెవెన్యూమంత్రి ధర్మాన ప్రసాదరావు నామినేషన్‌ వేయనున్నారు. కార్యకర్తలతో కలసి ఏడురోడ్ల జంక్షన్‌ నుంచి ర్యాలీ చేసుకుంటూ 80 అడుగుల రోడ్డుమీదుగా వెళ్లి కలెక్టరేట్‌కు చేరుకుంటారు. అయితే ఆ రోడ్డులోనే టీడీపీ జిల్లా కార్యాలయం ఉంది. అదే రోడ్డు నుంచి చంద్రబాబునాయుడు కాన్వాయ్‌ను విడిచిపెడితే.. లా అండ్‌ ఆర్డర్‌ సమస్యలు తలెత్తుతాయని.. రెండుగంటల ఆలస్యంగా టీడీపీ కార్యాలయం నుంచి చంద్రబాబు బయటకు రావాలని పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ విషయాన్ని మంగళవారం రాత్రి టీడీపీ జిల్లా ఆఫీసు వద్దకువెళ్లి చెప్పారు. దీంతో కలెక్టర్‌, ఎస్పీతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడారు. ఎట్టకేలకు టీడీపీ జిల్లా ఆఫీస్‌ నుంచి చంద్రబాబునాయుడు కాన్వాయ్‌ను గంట తర్వాత అంటే.. 11.50 గంటలకు బయల్దేరాలని పోలీసులు స్పష్టం చేశారు.


కాగా టీడీపీ అధినేత చంద్రబాబు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు నియోజకవర్గాల నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు. చంద్రబాబు పర్యటనకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, అభిమానులు తరలిరావాలని ఆమదాలవలస, పాతపట్నం టీడీపీ అభ్యర్థులు కూన రవికుమార్‌, మామిడి గోవిందరావు పిలుపునిచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

డ్వాక్రాలకు 10 లక్షలుజ: చంద్రబాబు

జగన్‌కు మరో షాక్‌!

కడప జిల్లా కోర్టు గీత దాటింది!

Read Latest AP News and Telugu News

National News, Telangana News, Sports News

Updated Date - Apr 24 , 2024 | 07:20 AM

Advertising
Advertising