ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Chanrababu: శ్రీకాకుళం జిల్లాలో సిలిండర్ల పథకాన్ని ప్రారంభించనున్న సీఎం..

ABN, Publish Date - Nov 01 , 2024 | 08:17 AM

ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే చంద్రబాబు దీపావళి పండుగ సందేశంతో పాటు దీపం పథకం 2.0 గురించి చెప్పారు. దీపావళి కానుకగా శ్రీకాకుళం జిల్లా నుండి ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేసేందుకు సిద్ధం అయ్యారు.

శ్రీకాకుళం: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) శుక్రవారం శ్రీకాకుళం జిల్లా (Srikakulam Dist.)లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఇచ్ఛాపురం నియోజకవర్గం, ఈదుపురంలో దీపం గ్యాస్ -2 ఉచిత సిలిండర్ల పథకాన్ని (Free Gas Scheme) సీఎం ప్రారంభించనున్నారు. లబ్ధిదారులకు గ్యాస్ ఉచిత సిలిండర్లు పంపిణీ చేయనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 12.35 గంటలకు సీఎం చంద్రబాబు ఈదుపురం చేరుకోనున్నారు. అనంతరం ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు. సాయంత్రం జిల్లా అధికారులతో సమీక్ష జరుపుతారు. రాత్రికి శ్రీకాకుళంలోనే చంద్రబాబు బస చేయనున్నారు.

కాగా ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే చంద్రబాబు దీపావళి పండుగ సందేశంతో పాటు దీపం పథకం 2.0 గురించి చెప్పారు. దీపావళి కానుకగా శ్రీకాకుళం జిల్లా నుండి ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేసేందుకు సిద్ధం అయ్యారు.


సీఎం చంద్రబాబు శ్రీకాకుళం పర్యటన షెడ్యూల్..

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లా పర్యటన షెడ్యూల్‌ను సీఎం క్యాంపు కార్యాలయం విడుదల చేసింది. ఆ వివరాల ప్రకారం నవంబర్ 1 వ తేదీ శుక్రవారం ఉదయం 10.00 గంటలకు చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసం నుంచి విజయవాడ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 11.25 గంటలకు విశాఖ చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి మధ్యాహ్నం 12.35 గంటలకు ఇచ్చాపురం చేరుకుంటారు. మధ్యాహ్న భోజనం అనంతరం 1.30 గంటలకు హెలిప్యాడ్ వద్ద నుంచి బయలుదేరి 1.50 నిమిషాల వరకు ఈదుపురంలో పలువురు లబ్ధిదారులకి దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లను అందజేస్తారు.

ప్రజలతో నేరుగా మాట్లాడనున్న చంద్రబాబు

మధ్యాహ్నం 2.20 గంటల వరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పలువురు లబ్ధిదారులకు స్వయంగా సీఎం చంద్రబాబు అందజేస్తారు. అనంతరం గ్రామంలోని వివిధ వర్గాలకు చెందిన ప్రజలతో ముఖ్యమంత్రి ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు. తర్వాత సాయంత్రం 4 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి శ్రీకాకుళం చేరుకుంటారు.


కాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం శృంగవరపుకోట నియోజకవర్గంలో పర్యటించనున్నారు. రాష్ట్రంలోని రోడ్లుభవనాల శాఖ రహదారుల పునఃనిర్మాణానికి ఈ నియోజకవర్గ పరిధిలో శ్రీకారం చుట్టనున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై శృంగవరపుకోట తహసీల్దార్‌ కార్యాలయంలో కలెక్టర్‌ అంబేడ్కర్‌, ఎస్పీ వకుల్‌జిందాల్‌, ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి చర్చించారు. ఇక్కడ నుంచే జిల్లా ఇన్‌చార్జి మంత్రి, హోంశాఖ మంత్రి వంగలపూడి అనితతో ఫోన్‌లో మాట్లాడారు. రోడ్ల నిర్మాణం పునఃప్రారంభానికి అనువైన రహదారిని గుర్తించాలని ఆమె సూచించారు. అనంతరం ఏర్పాట్లు చేసేందుకు కలెక్టర్‌, ఎస్పీ, ఎమ్మెల్యేలు స్థానిక రెవెన్యూ, పోలీస్‌, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ అధికారులతో కలసి ముందుగా లక్కవరపుకోట మండలం గోల్డ్‌స్టార్‌ కూడలి నుంచి గేదలవానిపాలెం రహదారిని పరిశీలించారు. అక్కడి నుంచి ఖాసాపేట శివారు ముత్యాలమ్మపాలెం రహదారిని పరిశీలించారు. జామి మండలం జాగారం రోడ్డు, శృంగవరపుకోట మండలం పోతనాపల్లి- విజయనగరం రోడ్డును చూశారు. ట్రాఫిక్‌ రీత్యా ఇవేవీ సీఎం ప్రారంభించేందుకు అనువుగా లేకపోవడంతో కొత్తవలస మండలం దెందేరు-సంతపాలెం రోడ్డును పరిశీలించారు. అనంతరం ఇదే షెడ్యూల్‌ను ఖరారు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అట్లాంటాలో నారా లోకేస్ రెడ్ బుక్ ప్రస్తావన..

దీపావళి నాడు మరో శుభవార్త

భారీగా పెరిగిన బంగారం ధరలు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Nov 01 , 2024 | 08:17 AM