పురాతన శివాలయాన్ని కూల్చేశారు
ABN, Publish Date - Oct 31 , 2024 | 12:43 AM
రణస్థలం మండలం చిల్లపేట రాజాం పంచాయతీ బొడ్డపాడులో పురాతన శివాలయాన్ని దుండగులు బుధ వారం రాత్రికి రాత్రే నేలమట్టం చేశారు. ఈ విధ్వంసానికి పాల్పడింది ఎవరో తేల్చాలని ఆలయ పూజారి ఫణిశర్మ అధికారులను కోరారు.
- బొడ్డపాడులో రాత్రికి రాత్రే నేలమట్టం
- ఈ విధ్వంసానికి పాల్పడింది ఎవరు?
- తేల్చాలంటున్న ఆలయ పూజారి
రణస్థలం, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): రణస్థలం మండలం చిల్లపేట రాజాం పంచాయతీ బొడ్డపాడులో పురాతన శివాలయాన్ని దుండగులు బుధవారం రాత్రి కూల్చేశారు. రాత్రికి రాత్రే నేలమట్టం చేశారు. ఈ విధ్వంసానికి పాల్పడింది ఎవరో తేల్చాలని ఆలయ పూజారి ఫణిశర్మ అధికారులను కోరుతున్నాడు. ఈ గ్రామంలో వెయ్యేళ్ల చరిత్ర కలిగిన సోమేశ్వరాలయం ఉంది. ఈ ఆలయానికి వంశపారంపర్య పూజారిగా ఫణిశర్మ వ్యవహరిస్తున్నారు. గురువారం ఉదయం ఆలయంలో దూప దీప నైవేద్యాల కోసం ఆయన వచ్చారు. అక్కడ ఆలయం పూర్తిగా నేలమట్టమై ఉండడంతో ఖంగుతిన్నారు. ఎక్స్‌కవేటర్‌తో ఆలయాన్ని కూల్చేసినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. దీంతో ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. ఇక్కడ స్వామివారి ఉత్సవ విగ్రహాలతో పాటు శివలింగం ఉండేది. ఈ ప్రాంతానికే శైవక్షేత్రంగా విరాజిల్లేది. కానీ, ఇంతలోనే విధ్వంసానికి గురికావడంతో ఈ ప్రాంతీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని హిందూ వాదులు కోరుతున్నారు.
ఇది కూడా చదవండి
TTD Chairman: టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడు..
మరిన్ని ఏపీ వార్తల కోసం
Updated Date - Oct 31 , 2024 | 06:54 AM